YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విద్య-ఉపాధి ఆంధ్ర ప్రదేశ్

 బడి బయటి పిల్లలను గుర్తించాలి

 బడి బయటి పిల్లలను గుర్తించాలి

 బడి బయటి పిల్లలను గుర్తించాలి
చిత్తూరు, ఫిబ్రవరి 7 
జిల్లాలో ఈ నెల 6 నుండి 15 వ తేదీ వరకు చేపట్టే సర్వే లో బడిబయట పిల్లల్ని గుర్తించాలని జె.సి.2 చంద్రమౌళి పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక జిల్లా సచివాలయంలోని జె.సి.ఛాంబర్ లో ఈ నెల 6 నుండి 15 వ తేదీ వరకు బడి బయట ఉన్న పిల్లల గుర్తింపు పై చేపట్టే సర్వే పై అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరైన జె.సి.2 మాట్లాడుతూ ఈ సర్వేలో భాగంగా ఏదో ఒక తరగతి నిలిచిపోయిన వారు ఇది వరకు బడికి పోనీ వారు అలాగే వీధుల్లో తిరిగే బాలలు అనాదలు లాంటి వారిని సర్వే లో అధికారులు గుర్తించి వివరాలను నమోదు చేయాలన్నారు. ఈ కార్యక్రమానికి సంబందించి భారత ప్రభుత్వం నిర్దేశించిన గైడ్ లైన్స్ ను అధికారులు ఫాలో కావాలని తెలిపారు. ఈ కార్యక్రమం పై ఈ నెల 10వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు ఎం.డి.ఓ, ఎం.ఈ.ఓ, ఐ.సి.డి.ఎస్ సిబ్బంధి తదితర మండల స్థాయి అధికారులతో మండల హెడ్ క్వార్టర్ లో సమావేశం నిర్వహించాలన్నారు. అలాగే ఈ నెల 11వ తేదీ వి.ఆర్.ఓ లు, పేరెంట్స్ కమిటీ, అంగన్వాడీ వర్కర్లు తదితర అధికారులతో గ్రామ స్థాయిలో సమావేశం నిర్వహించాలన్నారు. ఈ సమావేశంలో నమోదు చేసిన మినిట్స్ కు సంబందించిన వివరాలను సమగ్ర శిక్షా అధికారులకు పంపవలసి ఉంటుందని తెలిపారు.  బడి బయట పిల్లలను గుర్తించడం మాత్రమే ఈ సర్వే యొక్క ముఖ్య ఉద్దేశ్యం అన్నారు. ప్రదానంగా ప్రతి పిల్లవాడు పాఠశాలలో ఉన్నాడా లేక బడి బయట ఉన్నాడా అనేది వెరిఫై చేసుకోవాలన్నారు. బడి బయట పిల్లల వివరాలను యాప్ నందునమోదు చేయవలసి ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఓబులెషు, ఐ.సి.డి.ఎస్ పి.డి ఉషా పనికర్, సమగ్ర శిక్షా అడిషనల్ ప్రోగ్రాం కొ-ఆర్డినేటర్ వెంకట రమణారెడ్డి, సమగ్ర శిక్ష సి.ఎం.ఓ గుణశేఖర్ రెడ్డి, ప్లానింగ్ కొ-ఆర్డినేటర్ దామోధర్ రెడ్డి, ఏ.ఎల్.ఎస్ కొ-ఆర్డినేటర్ అజయ్ కుమార్ రెడ్డి, ఏ.ఎం.ఓ మోహన్, సమగ్ర శిక్ష సెక్టోరల్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Related Posts