YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

అసెంబ్లీలో సీఎం చంద్రబాబు

అసెంబ్లీలో సీఎం చంద్రబాబు

రాష్ట్ర ప్రజలంతా ఆందోళనలో ఉన్నారు- మన హక్కుల విషయంలో కేంద్రంపై ఎలా ఒత్తిడి పెంచాలనే అంశంపై సమాలోచన చేయడానికి నిన్న ఉదయం సచివాలయంలో అఖిలపక్షాలు, సంఘాల సమావేశాన్ని నిర్వహించాం- విభజన చట్టంలోని అంశాలు, అప్పటి ప్రధాని రాజ్యసభలో చేసిన హామీలపై చర్చించాం- మూడు పార్టీలు మినహా రాష్ట్రంలోని అన్ని పక్షాలు, ప్రజాసంఘాలు, జర్నలిస్టులు, ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, వాణిజ్య సంఘాలు, ప్రవాస తెలుగు సమాజం ప్రతినిధులు పాల్గొన్నారు- రాష్ట్రానికి ఇచ్చిన హామీల అమలులో కేంద్రం విఫలమైందని తీర్మానించాం- ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం దారుణంగా వంచించింది-జాతీయ పార్టీ మనల్ని రోడ్డున పడేస్తే మరో జాతీయ పార్టీ మనల్ని ఆదుకుంటుందని నమ్మాం- కానీ ఆ పార్టీ కూడా దారుణంగా వంచించింది- విభజన సమయంలో ప్రజల్లో ఏర్పడిన భావోద్వేగాలు నిన్నటి సమావేశంలోనూ కనిపించాయి- ఈ అంశంపై చర్చ జరగాలని ఆకాంక్షిస్తూ లోక్ సభలో అవిశ్వాసం పెట్టాలని ప్రయత్నిస్తే వాయిదాలు వేయడాన్ని ఈ సమావేశం తప్పుబట్టింది- తక్షణమే ప్రత్యేక హోదాపై ప్రకటన చేయాలని సమావేశం తీర్మానించింది- ఈ రోజు నుంచి ఏప్రిల్ 6 వరకు రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తపరచాలని సమావేశం పిలుపునిచ్చింది- సమయాభావం వల్ల ఈ సమావేశానికి అన్ని సంఘాలను పిలవలేకపోయాం- అందుకోసం మరోసారి సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నాం- రాష్ట్రం కోసం రాజీలేని పోరాటం చేయాలని నిర్ణయించాం- ఎన్నికల ముందు ప్రధాని అభ్యర్థిగా రాష్ట్రానికి వచ్చిన మోదీ, గెలుపొందిన తర్వాత ఏం మాట్లాడారో ఒక్కసారి చూద్దాం- ప్రధాని మోదీ మాట్లాడుతూ తనను ఢిల్లీలో కూర్చోబెడితే ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయడంతో పాటుగా అన్ని విధాలుగా సహాయపడతామని చెప్పారు- తిరుపతిలో కూడా ఆయన మాట్లాడుతూ ప్రపంచంలోని అత్యున్నత నగరాలకు దీటుగా రాజధానిని నిర్మించాలని కోరుకుంటున్నానని వ్యాఖ్యానించారు- అమరావతి రాజధాని శంకుస్థాపనకు వచ్చినప్పుడు కూడా విభజన చట్టంలోని అన్ని అంశాలను నిర్ణీత సమయంలో అమలు చేస్తామని చెప్పారు- ఈ విషయంలో ప్రజలకు విశ్వాసం కలిగించడానికే వచ్చానని మోదీ ఆనాడు ప్రకటించారు- ప్రధాని చెబితే జరుగుతుందని ప్రజలందరిలో ఆశ కలిగింది- కానీ ఇటీవల కేంద్రం వ్యవహరిస్తున్న తీరు షాక్ కలిగిస్తోంది- మొత్తం 60 మందితో మాట్లాడిస్తే అందరూ ఆవేశం, ఆవేదనతో మాట్లాడారు- వీరిలో విభజన సమయంలో చాలామంది ఆందోళనలు, నిరసనలు చేశారు- వైసీపీ, బీజేపీ, జనసేన తప్ప అందరూ వచ్చారు- పార్లమెంటులో బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన నాటి నుంచి ఎంపీలంతా పోరాడుతున్నారు- మాట ఇచ్చిన వాళ్లే మోసం చేస్తే ఎవరికి చెప్పుకోవాలి?- కేంద్రం తీసుకొచ్చిన చట్టాన్ని అమలు చేయకుండా తూట్లు పొడవడం ఎంత దుర్మార్గం?- జాతీయ పార్టీలు రెండింటికీ బాధ్యత ఉంది- ఇచ్చిన హామీలు ఎందుకు నెరవేర్చరో ఐదు కోట్ల మందికి సమాధానం చెప్పాల్సిన అవసరం కేంద్రానికి ఉంది- నేడు ప్రతి ఒక్కరూ కేంద్రం మీద పోరాడాలి- మామూలు వ్యక్తుల కన్నా రాజకీయ పార్టీలకు ఎక్కువ బాధ్యత ఉంది- ఈ మూడు పార్టీలు ఎందుకు రాలేదో సమాధానం చెప్పాలి- సమయం లేదా? లేక రాష్ట్రానికి న్యాయం చేయడం ఇష్టం లేదా?- ప్రభుత్వంపై దాడి చేయడానికి మాత్రమే ఆ పార్టీలు ఉపయోగపడుతున్నాయి- దేశ ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాల్సిన వ్యక్తులు ఏ మాత్రం బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నారు- సభకు రాకుండా ఉండటం, లేదంటే సభను వాయిదా వేసి వెళ్లిపోవడం చేస్తున్నారు- హామీలు నెరవేర్చడంలో ఫెయిలైనప్పుడు ఆ విషయాన్ని ఎందుకు  చెప్పలేకపోతున్నారు?- మనం గొంతెమ్మ కోర్కెలు అడగటం లేదు- మన రాష్ట్రం కోసం కసితో కష్టపడి పని చేద్దాం- శ్రమ చేస్తూనే పోరాడదామని సమావేశంలో ప్రతి ఒక్కరూ చెప్పారు- ప్రజలంతా ఇంత స్ఫూర్తితో ముందుకొస్తే కేంద్రంలో ఉన్న ప్రభుత్వం చట్టాన్ని ఎందుకు అమలు చేయడం లేదని అడుగుతున్నా- ప్రజల హక్కులకు, ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం- అందుకే అందరూ నల్ల బ్యాడ్జీలు పెట్టుకోవాలని పిలుపునిస్తున్నా- అవసరమైతే అర్ధ గంట ఎక్కువ సమయం ఉండి పని చేసి నిరసన తెలపాలి- సమావేశానికి రాని మూడు పార్టీలను మళ్లీ పిలుద్దాం- పిలవడమే కాకుండా మా మంత్రులే ఒకరో ఇద్దరో వెళ్లి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం- అయినా రాకపోతే ప్రజలకు సమాధానం వాళ్లే చెప్పాల్సి ఉంటుంది- అరవయ్యేళ్లు కష్టపడి హైదరాబాద్లో సంపద సృష్టించాం- విభజన సమయంలో రాజధాని, విద్యాసంస్థలు, ఉద్యోగాలు, పించన్లు రావేమోనని ఆందోళన చెందారు- అయినా విభజన చేశారు- ఎందుకీ వివక్ష, ఎందుకీ కక్ష అనే విషయాలకు సమాధానం చెప్పాలి- అభివృద్ధి విషయంలో చూస్తే జాతీయ గ్రోత్ కన్నా ముందున్నాం- ప్రజలంతా కష్టపడ్డారు, ఉద్యోగ సంఘాలన్నీ హార్డ్ వర్క్ చేశాయి- నిన్న నీరు- ప్రగతి టెలీ కాన్ఫరెన్స్ చేయలేకపోతే, ఈ రోజు ఉదయం నిర్వహించాం- కేంద్రం డబ్బులు రాకుండా ప్రయత్నం చేస్తారు, సహకరించకుండా తప్పులు చూపించాలని చూస్తుందని చెప్పాం- అందుకోసం ఏ లెక్కలు కావాలన్నా సిద్ధంగా ఉండాలని ఆదేశాలిచ్చాం- కేంద్ర రాష్ట్ర సంబంధాలను రీడిఫైన్ చేయడంలో ఎన్టీఆర్, టీడీపీ కీలక పాత్ర పోషించాయి- యూసీల గురించి ప్రధానే సమాధానం చెప్పాలి- నిన్న కూడా బీజేపీ నాయకులొచ్చి ఇవన్నీ తప్పులని మాట్లాడుతున్నారు- అందుకే ఎమ్మెల్యేలందరికీ ఒక్కో కాపీ ఇమ్మని చెప్పాం- యూసీలు కూడా తప్పని చెబితే ఈ బీజేపీ నాయకులను ఏమనాలి?- నేను చెప్పింది కాదంటే కేంద్రం సమాధానం చెప్పాలి- రాష్ట్ర ముఖ్యమంత్రిగా డిమాండ్ చేస్తున్నా- ఏదంటే అది మాట్లాడటం ఫెడరల్ స్ఫూర్తికి కరెక్ట్ కాదు- రెవెన్యూ లోటుపై మాట్లాడుతుంటే యూసీలు అడుగుతారా?- నాటి ప్రధాని చట్టంలో పెట్టకపోతే మా తప్పా?- చట్టంలో పెట్టి డబ్బులిస్తామని ఆ రోజు చెప్పారు- 16 వేల లోటు ఉందని ఇక్కడి గవర్నర్ పంపించారు- తర్వాత సీఏజీ రిపోర్టులోనూ 16 వేల కోట్లు ఖర్చు పెట్టారని చెప్పింది- తర్వాత కేంద్రం లెక్కలేసి రుణమాఫీ, పింఛన్లు, డిస్కమ్ లకు ఇచ్చామని చెప్పి ఇవ్వకుండా చేశారు- కేంద్రం తమ ప్రయారిటీలను మార్చుకుంది- కేంద్రం కూడా మా దారికి వచ్చి యూపీలో రైతు రుణ విముక్తి ఇవ్వలేదా?-  వచ్చిన ఆదాయం తెలంగాణకు పోవడం వల్లే ఏపీకి లోటు వచ్చింది- మొదటి ఏడాది బడ్జెట్లో తర్వాతి నుంచి ఫైనాన్స్ కమిషన్ ద్వారా ఇస్తామని ప్రకటించారు- 2014-15కు ఇవ్వాల్సింది నాలుగేళ్ల తర్వాత కూడా ఇవ్వకపోతే ఏం చేయాలి?- నాడు టీడీపీ, బీజేపీ కలిసి రాష్ట్ర అభివృద్ధి కోసమే పోటీ చేశాం- 4 వేల కోట్లకు యూసీలు ఇవ్వక్కర్లేదని కేంద్రం గుర్తు పెట్టుకోవాలి- పోలవరం అథారిటీకి రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు బిల్లులను అందజేస్తోంది- అయినా దీనికి లెక్కలు చెప్పలేదని మాట్లాడుతున్నారు- అమరావతికి 1500 కోట్లు, విజయవాడ, గుంటూరుకు వెయ్యి కోట్లిచ్చి లెక్కలివ్వడం లేదంటున్నారు- 1500 కోట్లకు 1582 కోట్లకు యూసీలిచ్చాం- వాటిని చూసి నీతి ఆయోగ్ వెయ్యి కోట్లివ్వాలని రికమెండ్ చేసింది- అవివ్వకపోగా యూసీలన్నీ ఫాల్స్ అని అంటారా?- వెనుకబడిన జిల్లాలకు నిధుల విషయంలో స్పెల్ వారీగా యూసీలు పంపించాం- 946.47 కోట్లకు సంబంధించి తేదీల వారీగా యూసీలు పంపించాం- ఇంకా 103.53 కోట్లకు లెక్కలు పంపాలి- ఇవన్నీ పంపిస్తే 350 కోట్లు ఇచ్చినట్లే ఇచ్చి వెనక్కి తీసుకున్నారు- ఇది ప్రధానికి తెలియకుండా జరిగిందా?- మీకు తెలియకుండా జరిగితే చర్యలు తీసుకోవాలి, తెలిసీ జరిగితే ఎందుకు చేశారో ఐదు కోట్ల ఆంధ్రులకు జవాబు చెప్పాలి- అమిత్ షా లేఖలో నాకు చెడు కలలొస్తున్నాయన్నారు, నాకు కలలు రావడం లేదు, మీరే వాస్తవాలు తెలుసుకోవాలి- మనం చేసేది ధర్మ పోరాటం కాబట్టి ఎప్పటికైనా మనమే గెలుస్తాం- విజయవాడ, గుంటూరులకు వెయ్యి కోట్లిస్తే వాటిలో 229.65 కోట్లకు పంపించాం, మరో వంద కోట్లకు యూసీలు పంపిస్తున్నాం- బీజేపీ నేతలు వాస్తవాలు చెప్పడం నేర్చుకోవాలి- ప్రజల్ని మభ్యపెట్టాలనుకుంటే  రాబోయే రోజుల్లో శాశ్వతంగా ఇబ్బందులు పడాల్సి వస్తుంది- వడ్డించే వాడు మనవాడైతే క్యూలో ఎక్కడ కూర్చున్నా ఫర్వాలేదు- మనవాడు కాకపోతేనే ఏ లెక్కలు కావాలన్నా అందించి డిమాండ్ చేస్తాం- రేపు డబ్బులివ్వకపోతే ఏం చేయాలని ఆందోళన పడక్కర్లేదు- మనం ట్యాక్సులు కడుతున్నాం- వాటిలో 42 శాతం తిరిగిస్తున్నారు, మిగిలిన వాటిని కేంద్రం వివిధ విషయాలకు ఖర్చు చేస్తోంది- రాష్ట్రానికి నిధులివ్వకపోయినా అభివృద్ధి, సంక్షేమం ఆగవు- 12 శాతం కూడా మేం ఖర్చు పెట్టలేదని, యూసీలు ఇవ్వలేదని చెబుతున్నారు- మేమిచ్చిన యూసీలు చూసి ఏం మాట్లాడతారు?- దేశంలో సుపరిపాలనకు నాంది పలికింది, అడ్మినిస్ట్రేషన్లో టెక్నాలజీ వాడిన మొదటి వ్యక్తిని- ప్రధాని కూడా విదేశాలకు వెళ్లి మా దగ్గర కూడా మంచి నగరాలున్నాయని చెప్పారు- అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ హైదరాబాద్ కు వచ్చి నాతో మాట్లాడారు- మీరు రారనే ఉద్దేశంతో నేను పిలవలేదని క్లింటన్ కు చెప్పా- ఇండియాలో చూడాల్సింది హైదరాబాద్ నే అని వచ్చానని చెప్పారాయన- నేను నా స్వార్థం కోసం చేయలేదు- దేశ ప్రతిష్టను పెంచేందుకు కష్టపడ్డాం- రియల్ టైమ్ గవర్నెన్స్ కానీ, 1100 గురించి దేశంలో ఆదర్శంగా చూస్తున్నారు- సస్టెయినబుల్ డెవలప్ మెంట్ కోర్సులో నీతి ఆయోగ్ ఏపీతో ఎంవోయూ చేసుకుంది- మేము జాతీయ స్థాయిలో ఉన్నా దేశం తరఫున మన రాష్ట్రంతో కలిసి పని చేయాలని నిర్ణయించారు- పవర్ సెక్టార్లో రిఫార్మ్స్ మేమే తీసుకొచ్చాం- అవసరమైతే కరెంట్ చార్జీలు పెంచకుండా తగ్గిస్తామని ప్రకటించాం- పరిపాలనలో ఏం అనుభవం ఉందని మీరు మాట్లాడుతున్నారు?- అనుభవం లేని వ్యక్తులు కూడా తప్పులు పట్టి డ్యామేజ్ చేయాలని ప్రయత్నం చేయడం దారుణం- నా గురించి ఏ జాతీయ నాయకుడూ తప్పుగా మాట్లాడలేదు- యునైటెడ్ ఫ్రంట్, నేషనల్ ఫ్రంట్, ఎన్డీయే 1లో పని చేశా- ఢిల్లీకి వెళితే వాజ్ పేయి ప్రత్యేక గౌరవం ఇచ్చేవారు- చంద్రబాబు తన కోసం కాకుండా రాష్ట్రం, దేశం కోసం అడుగుతారని చెప్పేవారు- హైదరాబాద్లో మొదట గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టును తీసుకొచ్చా- తర్వాతే బెంగళూరు, ముంబైల్లో వచ్చాయి- టెలీ కమ్యూనికేషన్స్ లో రిఫార్మ్స్ రావాలని మాట్లాడితే ఎవరూ ముందుకు రాలేదు- వాజ్ పేయి హయాంలో నన్ను వైస్ చైర్మన్ గా పెట్టి నివేదిక తెప్పించుకుని రిఫార్మ్స్ అమలు చేశారు- డ్రిప్, మైక్రో ఇరిగేషన్లో ఇప్పుడు కూడా ఏదైనా రిపోర్టును రిఫర్ చేస్తున్నారంటే అది నేనిచ్చిన రిపోర్టే- దేశం కోసం, రాష్ట్రం కోసం పని చేయాలని చూస్తుంటే నాపై బురద చల్లి నాయకులను దెబ్బ తీయాలని చూస్తున్నారు- ప్రత్యేక హోదా అడిగితే స్పెషల్ పర్పస్ వెహికల్ ఇస్తామంటున్నారు- ఎఫ్ఆర్బీఎం లెక్కలో తీసుకోవాలంటే ప్రత్యేకంగా కాకుండా నా లెక్కలో ఇస్తారా?- రెండు జీవోలతో వేరే రాష్ట్రాలకు ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ ఇచ్చారు- మేము అదే ఇవ్వాలని అడిగితే స్పెషల్ పర్పస్ వెహికల్ ను ఇస్తానంటున్నారు- అంటే హోదాతో వచ్చే సదుపాయాలను కాదనుకుని ఎస్పీవీ తీసుకోవాలా?- దీనికి వేరే అవసరాల కోసం ఖర్చు చేస్తారా అని అంటారా?- ఇలాంటి మాటలు వస్తాయనే కేంద్రం ఇచ్చిన ప్రతి పైసాకు లెక్కలు తీసుకొచ్చాం- అన్ని అంశాలపైనా టెలీ కాన్ఫరెన్స్ లు పెట్టి లెక్కలు జాగ్రత్తగా తీస్తున్నాం- లేఖలో రాసిన విషయాలు వేరే రాష్ట్రాల్లో ఉన్నాయేమో కానీ, నేను 40 సంవత్సరాలుగా స్వప్రయోజనాలను చూసుకోలేదు- నీతి నిజాయితీగా ఉండాలనే రాత్రికి రాత్రి రాజీనామాలు చేయించి ఇద్దరు మంత్రులను విత్ డ్రా చేసుకున్నాం- అలాగే అలయెన్స్ నుంచి బయటకొచ్చిన తర్వాతే అవిశ్వాసం పెట్టాం- కేంద్రానికి దాసోహమనే పరిస్థితి  నా జీవితంలో రాదు- గతంలో 2020 విజన్ పెట్టా, ఇప్పుడు విజన్ 2050 పెట్టాం- కుటుంబ వికాసం, సంక్షేమం కోసం అనేక పథకాలు తీసుకొస్తున్నాం- మీరిచ్చేది ముష్టి కాదు, మా హక్కు- కేంద్ర, రాష్ట్రాలు ఒకరినొకరు గౌరవించుకోవాలి- రాష్ట్రాలపై అధికారం చెలాయిస్తామంటే సాధ్యం కాదు, మంచిది కాదు- అన్ని రాష్ట్రాలకు నిధులిస్తున్నట్లుగా మనకూ రావాలి- అలా ఇవ్వకపోతే ఎందుకివ్వరో చెప్పి తీరాలి- ఈ రోజు వయొలెన్స్ చేస్తే కేంద్రం కూడా సంతోషించవచ్చు- ఎందుకంటే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందడం వాళ్లకిష్టం లేదు- ప్రగతితో కేంద్రం అభివృద్ధికి దోహదపడుతుంటే అడ్డు పడుతున్నారు- కరెంటు కొరత లేకుండా సర్ ప్లస్ స్టేట్ గా ఏపీని తీసుకొచ్చాం- సోలార్, విండ్ కు ప్రాధాన్యమిచ్చాం- మరో పదిహేను రోజుల్లో వంద శాతం ఓడీఎఫ్ సాధించిన పెద్ద రాష్ట్రంగా మనది ఉండబోతుంది- కేంద్రం 8 వేలు ఇస్తే, మేం 7 వేలు అదనంగా పెట్టాం- నరేగా కోసం 12 వేలిస్తే మేం మొత్తం 15 వేలు చేశాం- నీటి ఎద్దడి లేకుండా చేసి నీటి భద్రత దిశగా వెళ్తున్నాం- నదుల అనుసంధానం చేస్తే మీరు విడిపోయాక పట్టిసీమపై కోర్టుకెళ్లి ఆరోపణలు చేసి నీచంగా మాట్లాడారు- ఈ ఆరోపణలో పస లేదని కోర్టు కొట్టేసింది- పొత్తు పెట్టుకున్న రోజున మాట్లాడకుండా ఇప్పుడు విమర్శలు చేస్తారా?- అంటే పట్టిసీమ, పురుషోత్తపట్నం, చింతలపూడి, పోలవరం రాకూడదని, అన్ని విధాలుగా అన్యాయం చేయాలనుకుంటున్నారు- అయినా ఎట్టి పరిస్థితుల్లో పోలవరాన్ని సాధించి తీరతాం- అమరావతి విషయంలో ప్రధానే ఫోన్ చేసి ఆస్థానాను చూడాలని సూచిస్తే సంతోషపడ్డా- మరి అప్పటికీ, ఇప్పటికీ తేడా ఎందుకు వచ్చింది?- అమరావతికి 2500 కోట్ల కన్నా ఎక్కువ ఎందుకని అడుగుతున్నారు- అహ్మదాబాద్ కోసం ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మోదీ అడగలేదా?- దేశంలో ఇలాంటి రాజధానులు కట్టే అవకాశాలు లేవు- ఒకప్పుడు మీరే మెచ్చుకుని, ఇప్పుడు సన్నాయి నొక్కులు నొక్కడం సరైన పద్ధతి కాదు- నేను వీటిపై మాట్లాడితే బీజేపీ వాళ్లెళ్లి రాయలసీమ డిక్లరేషన్ అంటున్నారు- జాతీయ పార్టీ దేశాన్ని కలిపి ఉంచాలి కానీ, విచ్ఛిన్నం చేస్తారా?- నాడు నేడు మనోభావాలతో ఆడుకుంటున్నారు- రాజకీయాల్లో తాత్కాలికంగా లాభం కలగొచ్చేమో కాని శాశ్వతంగా దేశానికి నష్టం వస్తుంది- ప్రత్యేక ఇన్సెంటివ్స్ తో కియా తీసుకొచ్చాం- కర్నూలులో ఎయిర్ పోర్టు రాబోతోంది- ఓర్వకల్లులో కంపెనీలు పెట్టబోతున్నాం- తిరుపతిలో ఫాక్స్ కాన్ 4 వేల కోట్లతో పెట్టుబడులు పెడుతోంది- గ్రామీణ ప్రాంతాల్లో 17వేల కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు వేశామంటే అది ఒక చరిత్ర- తాగునీరు, డ్రైనేజీలు, వీధి లైట్లు వీటిలో దేనికీ దేశం సహకరించడం లేదు- అన్ని రాష్ట్రాలకు ఇచ్చినట్లు ఎందుకివ్వడం లేదు?- ప్రజలు అధైర్యపడొద్దు- మనం ఇంత కష్టపడుతున్నా సౌత్ ఇండియాలో తలసరి ఆదాయంలో 30 వేలు తక్కువ ఉందంటే మన తప్పా?- పాలకుల తప్పు- చట్టంలోని అంశాలను అమలు చేసి ఉంటే గ్రోత్ రేటును 12 శాతానికి తీసుకెళ్లేవాళ్లం- వయొలెన్స్ వల్ల అభివృద్ధి ఆగిపోతుంది- కొంతమంది నాయకులు అదే కోరుకుంటున్నారు- కానీ మనకు అది వద్దు, అహింసా పద్ధతిలోనే పోరాడదాం- విద్యార్థులు నాలెడ్జ్, టెక్నాలజీతో ముందుకు పోవాలి- సాయంత్రాలు బయటకొచ్చి ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి- అలా కాకుండా ఆవేశపడితే జీవితాల్లో రెండుమూడేళ్లు కోల్పోవాల్సి వస్తుంది- అమెరికాలో హయ్యెస్ట్ పర్ క్యాపిటా సంపాదిస్తున్న వారు తెలుగువారే- ప్రతి ఒక్కరూ రాజధానికి ఒక ఇటుక ఇచ్చి సహకరించాలి- ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు కష్టపడాలి- రాజధానికి భూముల్లేకపోతే ఒక ఆలోచన చేసి విన్ విన్ పద్ధతిలో 34 వేల ఎకరాలు రైతులు ముందుకొచ్చి ఇచ్చారు- దీనిపై కొంతమంది నాయకులు సుప్రీం కోర్టు వరకు వెళ్లారు- రాజధాని రావడం ఇష్టం లేకనే అక్రమాలు జరిగాయని ముందుకెళుతున్నారు- రాష్ట్రం అభివృద్ధి చెందడం ఇష్టం లేదా?- ఎందుకు లాలూచీ రాజకీయాలు?- రాష్ట్ర ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రయోజనాల కోసం నిన్న సమావేశానికి పిలిస్తే ఎందుకు రాలేదు?- అభిప్రాయాలు వేరైనా రాష్ట్రం కోసం రావాలి- మీరు నాయకులుగా చెలామణీ అవ్వాలనుకున్నప్పుడు, మీ పార్టీ మనుగడ సాధించాలనుకున్నప్పుడు సమావేశానికి రావాలి- ఈ గడ్డ మీద పుట్టినప్పుడు ఈ పోరాటానికి సహకరించాలి కాని, అన్యాయం చేస్తున్న కేంద్రానికి కాదు- ప్రత్యేక హోదా, రెవెన్యూ లోటు, పోలవరం అన్నీ ఇవ్వాలి- పోలవరం ప్రజల సెంటిమెంట్, జీవన్మరణ సమస్య- దీనిపై రాజకీయ అపవాదులు వేయాలనుకుంటే రైతులు క్షమించరు- పోలవరాన్ని పూర్తి  చేసి రాష్ట్రంలో కరువు లేకుండా నీటి భద్రత ఇస్తాం- రైల్వే జోన్ మన సెంటిమెంట్- పెట్రో కెమికల్ కాంప్లెక్స్, క్రూడ్ ఆయిల్ రిఫైనరీ, మనం పెట్టి ఆదాయం కేంద్రానికి ఇవ్వాలనడం ఎక్కడి న్యాయం?- దుగరాజపట్నం, స్టీల్ ప్లాంట్, అసెంబ్లీ సీట్లు, విభజన సమస్యలను పరిష్కరించాలి- విశాఖ- చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ కు ముంబై- ఢిల్లీ కారిడార్ తరహాలో డబ్బులివ్వాలి- లైట్ మెట్రో పేరిట నీరుగార్చాలని చూస్తున్నారు- వెనుకబడిన ప్రాంతాలకు బుందేల్ ఖండ్ తరహాలో ఇవ్వాలి- అమిత్ షా రాసిన లేఖపై నిన్నటి సమావేశంలో అందరూ వ్యతిరేకించారు- 40 ఏళ్లుగా ఎదురుదాడికి దిగిన వారెవ్వరూ బాగుపడినట్లు చూడలేదు- నష్టపోయి బాధల్లో ఉన్నవారిని ఎగతాళి చేయడం మంచిది కాదు- ఆత్మగౌరవం అందరికీ ఉండాలి- తెలుగువారి ఆత్మగౌరవం కోసం యుగపురుషుడు ఎన్టీఆర్ పార్టీని ప్రారంభించారు- ఈ విషయాన్ని ప్రధానే పార్లమెంటులో చెప్పారు- కానీ అంతకన్నా ఎక్కువ అవమానం చేస్తున్నారు- ఇది కో ఆపరేటివ్ ఫెడరిలజానికి మంచిది కాదు- ఈ పరిస్థితుల్లో విదేశాల్లో ఉన్న తెలుగువారు కూడా వచ్చి సహకారం అందించాలి- అవసరమైతే ప్రత్యేక బాండ్లు తీసుకొచ్చి మన డబ్బులతో మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాం- బ్యాంకులకు 8 శాతం వడ్డీ ఇస్తున్నాం, మీరంతా నాలుగైదు శాతానికి ముందుకు వస్తే అభివృద్ధి సాధ్యమే- నాకు ఎవ్వరి మీదా కోపం లేదు- నేను తీసుకున్న నిర్ణయం రాష్ట్రం కోసమే కాని రాజకీయ ప్రయోజనాల కోసం కాదు- రాష్ట్రం కోసం కాకుండా విడిగా పోటీ చేసి ఉంటే నాకు మరో 15 సీట్లు ఎక్కువ వచ్చేవని లెక్కలు చెబుతున్నాయి- రాష్ట్రం కోసం పొత్తు పెట్టుకుంటే సహకరించకపోవడం న్యాయంకాదు- కచ్చితంగా ఢిల్లీ వెళ్లి అందరినీ సమీకరిస్తాం- అవసరమైతే మరో నాలుగైదు గంటలు ఎక్కువ పని చేస్తా- ఢిల్లీ వెళ్లి అందరూ సహకరించాలని కోరతాం- 40 ఏళ్లలో ఎప్పుడూ హుందాతనాన్ని తప్పలేదు- అందుకే ఎంతో మంది ఎన్నో చేయాలని చూసినా ఏమీ చేయలేకపోయారు- క్రమశిక్షణ, నీతి నిజాయితీ అనేవి జీవతంలో పెట్టుకున్నా- ప్రధాని కాళ్లకు మొక్కిన ఒక నిందితుడు బయటకొచ్చి తల్లిదండ్రులను విమర్శిస్తున్నారు- తల్లిదండ్రులు చనిపోయినా డీప్ సెంటిమెంట్ ఉంటుంది- మన సంప్రదాయం ప్రకారం సంక్రాంతి రోజున పెద్దలకు పూజలు చేస్తాం- ఉచ్ఛరించరాని మాటలతో నిందిస్తే ఎంత బాధ కలుగుతుంది?- ఇలాంటి మాటలు పడుతున్నానంటే ప్రజల కోసమే- నాకూ ఇలాంటివి అంటే ఆవేదన, బాధ ఉంటాయి- అయినా భరిస్తా- మహిళలను, తల్లిని గౌరవించే సంస్కృతి మనది- అందుకే అమ్మకు వందనం కార్యక్రమాన్ని తీసుకొచ్చాం- ఇలాంటివి రాజకీయాలకు, సమాజానికి ఏ విధంగా హుందాగా ఉంటాయి?- అన్ని సంఘాలతో కలిసి అహింసా విధానంలో ముందుకు పోదాం.

Related Posts