YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం విద్య-ఉపాధి ఆంధ్ర ప్రదేశ్

వైస్ ఛాన్సలర్ సమక్షలోనే విద్యార్ధులపై దాడి

వైస్ ఛాన్సలర్ సమక్షలోనే విద్యార్ధులపై దాడి

వైస్ ఛాన్సలర్ సమక్షలోనే విద్యార్ధులపై దాడి
విజయవాడ ఫిబ్రవరి 10
నాగార్జున యూనివర్సిటీ లో విద్యార్థులు పై దాడులు సరికాదు. ప్రజాస్వామ్య పద్దతిలో నిరసన వ్యక్తం చేస్తుంటే దాడులు చేస్తారా. వైస్ ఛాన్సలర్ ప్రవర్తన దారుణంగా ఉంది. విద్యార్థులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తే దాడులకు పాల్పడుతారా అని మాజీ ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. సోమవారం అయన విజయవాడ హెల్ప్ హాస్పటల్ లో చికిత్స పొందుతున్న నాగార్జున యూనివర్సిటీ విద్యార్థులను పరామర్శించారు.  తరువాత అయన మీడియాతో మాట్లాడుతూ  వైన్ ఛాన్సలర్ సమక్షంలోనే విద్యార్థులపై దాడులు జరిగాయి. వైస్ ఛాన్సలర్ ఒక పార్టీకి ఎలా వత్తాసు పలుకుతారు. వైస్ ఛాన్సలర్ తన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించాలి. శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తుంటే విద్యార్థులను రెచ్చగొట్టే విధంగా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. యూనివర్సిటీ లో జగన్ ఫొటోతో ఊరేగింపు నిర్వహించారు. యూనివర్సిటీని స్వార్ధ రాజకీయాలకు వాడుకుంటున్నారు. సీఎం జగన్ సైకో ...ఆయన ఏం చేస్తారో ఆయనకే తెలియదు. హిందూ పత్రిక నిర్వహించిన సర్వేలో 86 శాతం ప్రజలు రాజధాని తరలింపును వ్యతిరేకించారు. విద్యార్థుల స్వేచ్ఛను హరిస్తున్నారు. సీఎం ఆలోచలను ప్రజలపై రుద్దే అధికారం యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కు ఎవరు ఇచ్చారని ప్రశ్నించారు. వైస్ ఛాన్సలర్ చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. అలాగే ఐసీఎస్ అధికారి ఎ బి వెంకటేశ్వరవు పై కక్ష చర్యలు సరికాదు. అధికారులకు జీతాలు,పోస్టింగ్ లు ఇవ్వడం లేదు. 40 ఏళ్లలో ఇలాంటి పాలన చూడలేదు. సీఎం చెప్పిన పనిని చేయడమే అధికారుల విధి. సీనియర్ ఆఫీసర్ ని సస్పెండ్ చేయడం దారుణమని అన్నారు. అర్ధరాత్రి జీవోలు ఇవ్వడం. ఐటి దాడులు చేస్తూ భయబ్రాంతులకు గురిచేయడం దుర్మార్గం. వైట్ కార్డ్స్ వారిపై కేసులు నమోదు చేస్తున్నారు. రెండు ఎకరాల భూమి కొంటే కేసులు పెడతారా. కరెంట్ ఛార్జి లతో పాటు అన్ని ధరలు పెంచుతారు. చేతగాని పరిపాలన సాగిస్తున్నారని మండిపడ్డారు.

Related Posts