YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు విద్య-ఉపాధి తెలంగాణ

కలకలం రేపిన ఉపాధ్యాయుడి దారుణహత్య

కలకలం రేపిన ఉపాధ్యాయుడి దారుణహత్య

కలకలం రేపిన ఉపాధ్యాయుడి దారుణహత్య
ఖమ్మం ఫిబ్రవరి 10 
ఖమ్మం జిల్లాలో గత అర్ధరాత్రి జరిగిన ఉపాధ్యాయుడి దారుణ హత్య కలకలం రేపింది. పోలీసుల కథనం ప్రకారం.. జిల్లాలోని దుమ్ముగూడెం మండలం లచ్చిగూడెంలోని నాగన్నగుంపునకు చెందిన కారం చిన్న రామకృష్ణ (35) స్థానిక ఎంఈవో కార్యాలయంలో క్లస్టర్ రిసోర్స్ పర్సన్ (సీఆర్సీ)గా పనిచేస్తున్నాడు. నిన్న రాత్రి భార్య, పిల్లలతో కలిసి నిద్రిస్తున్న సమయంలో ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు ఇంట్లోకి ప్రవేశించారు. నిద్రిస్తున్న రామకృష్ణను గొంతుకోసి హత్య చేశారు. అడ్డుకునేందుకు యత్నించిన అతడి భార్యపైనా వారు దాడిచేశారు. అనంతరం పరారయ్యారు. భూ వివాదాలే హత్యకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు.  కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు

Related Posts