YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

  నిబద్ధతకు మారుపేరు పసుపులేటి రామారావు  -  రెబల్ స్టార్ కృష్ణంరాజు 

  నిబద్ధతకు మారుపేరు పసుపులేటి రామారావు  -  రెబల్ స్టార్ కృష్ణంరాజు 

 నిబద్ధతకు మారుపేరు పసుపులేటి రామారావు 
-  రెబల్ స్టార్ కృష్ణంరాజు 
హైదరాబాద్  ఫిబ్రవరి 12
సీనియర్ ఫిలిం జర్నలిస్ట్ పసుపులేటి రామారావు ఆకస్మిక మరణం పట్ల రెబల్ స్టార్ కృష్ణంరాజు తీవ్ర దిగ్భ్రాంతిని, సంతాపాన్ని వ్యక్తం చేశారు. పసుపులేటి రామారావుతో తనకు గల సుదీర్ఘ అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ కృష్ణంరాజు “ నిబద్ధతకు మారుపేరైన పసుపులేటి రామారావు  నాకు ఎంతో సన్నిహితుడు. మా గోపీకృష్ణ మూవీస్ ప్రారంభం నుండి నాతోను, మా సంస్థ తోనూ ఆయనకు చక్కని అనుబంధం ఏర్పడింది. నలభై ఐదు సంవత్సరాలుగా సినిమా జర్నలిస్టుగా మా అందరికీ సుపరిచితులైన రామారావు మరణం వ్యక్తిగతంగా నన్నే కాకుండా యావత్ చిత్ర పరిశ్రమను దిగ్భ్రాంతికి గురి చేసింది. తన నిజాయితీ, నిరాడంబరత, కష్టపడి పని చేసే తత్వంతో పరిశ్రమలో అందరికీ ఆప్తుడు అయ్యాడు రామారావు. ఎప్పుడూ తెల్ల చొక్కా, తెల్ల ప్యాంటు, భుజాన సంచి.. ఇదీ రామారావు శాశ్విత ఆహార్యం. తను కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్నాడని తెలుసుగాని ఇంత హఠాత్తుగా ఈ వార్త వినాల్సి వస్తుందని అనుకోలేదు. రామారావు మరణంతో తెలుగు ఫిలిం జర్నలిజంలో ఒక తరం అంతరించి నట్లు అయింది. ఈ సందర్భంగా ఆయన కుటుంబానికి , తెలుగు సినీ పాత్రికేయ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.. ఆయన ఆత్మకు శాంతిని ఆకాంక్షిస్తున్నాను " అన్నారు.

Related Posts