YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతి తనిఖీ 

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతి తనిఖీ 

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతి తనిఖీ 
-ఐఏఎస్ ఎగ్జిక్యూటివ్ కమిషనర్ ఆఫీసర్ సర్ఫరాజ్
భూదాన్ పోచంపల్లి, ఫిబ్రవరి 13  
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతి 1  2 లో చేసిన పనులు తనిఖీకి చేయుటకు గాను మండల ఫ్లయింగ్ స్క్వాడ్ ఐఏఎస్ ఎగ్జిక్యూటివ్ కమిషనర్ ఆఫీసర్ సర్ఫరాజ్ పోచంపల్లి మండల కేంద్రంలో జలాల్పురం వంకమామిడి, ధర్మ రెడ్డి పల్లి జలాల్పురం గ్రామానికి తనిఖీ చేశారు. తనిఖీలో భాగంగా నర్సరీని పరిశీలించారు. అదేవిధంగా ధర్మ రెడ్డి పల్లి లో కంపోస్ట్ మరియు రెవెన్యూ ప్లాంటేషన్ తనిఖీ చేశారు. జలాల్పురం లో నర్సరీ అంగన్వాడి గ్రామంలో సానిటరీ పరిశీలించారు. అదేవిధంగా తనిఖీ చేసిన మూడు గ్రామాల్లో సెప్టెంబర్ 6 2019 నుండి సెప్టెంబర్ 14 ఫైనాన్స్ కమిషన్ ద్వారా వచ్చిన నిధులను ఎలా ఖర్చు చేస్తున్నారు ప్రశ్నించారు. కరెంటు బిల్లులు చెల్లింపు శిథిలాల వ్యవస్థ చేరుకున్న ఇండ్లు తొలగింపు, మిషన్ భగీరథ వాటర్ సప్లై  సిబ్బంది జీతాలు ఎంత చెల్లిస్తున్నారు లాంటి అంశాలను క్షుణ్ణంగా అడిగి తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో  ఎంపిడిఓ సూపరిండెంట్ కృష్ణ ప్రియ, సి ఐ నాగిరెడ్డి ,కృష్ణమూర్తి యశోద కృష్ణ మాధవి సర్పంచ్ పి రజిత, శంకరయ్య రవీందర్ రెడ్డి కార్యదర్శి యాదగిరి రాజశేఖర్ రెడ్డి అమృత ఆయా గ్రామాల సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts