YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు ఆరోగ్యం తెలంగాణ

గాంధీ అక్రమాలపై ఆరోగ్య శాఖ సీరియస్

గాంధీ అక్రమాలపై ఆరోగ్య శాఖ సీరియస్

గాంధీ అక్రమాలపై ఆరోగ్య శాఖ సీరియస్
హైద్రాబాద్, ఫిబ్రవరి 14 
గాంధీ వైద్యుడు డాక్టర్ వసంత్ ఆస్పత్రిలో జరుగుతున్న అక్రమాల గురించి ఆరోపణలు చేసినప్పటి నుంచి అక్కడ జరుగుతున్న పరిణామాలు పలు అనుమానాలకు తావిస్తున్నాయి. రెండేళ్లుగా బయోమెట్రిక్ వ్యవస్థ పని చేయలేదని, అయినా సూపరింటెండెంట్ పట్టించుకోలేదని వసంత్ ఆరోపణలు చేశారు. చాలా మంది డాక్టర్లు డ్యూటీలు చేయకుండానే వేతనాలు పొందారని ఆయన కొద్ది రోజుల క్రితం ఆస్పత్రి ఆవరణలో వీరంగం సృష్టించారు. డాక్టర్ వసంత్ చేసిన ఆరోపణలపై గురువారం గాంధీ సూపరింటెండెంట్ డాక్టర్ శ్రవణ్ స్పందించారు. డాక్టర్ వసంత్‌కు మతిస్తిమితం లేదని, ఆయన ఆరోపణలకు అర్థం లేదని ఖండించారు.ఈ నేపథ్యంలో తాజాగా గాంధీ ఆస్పత్రిలో అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్‌‌కు వెళ్లే గేటుకు తాళాలు వేయడం మరింత అనుమానాలకు తావిస్తోంది. అంతేకాక, సూపరింటెండెంట్ పేషీ వద్ద ఉన్న స్టోర్ రూం తెరిచి అక్కడ వైద్యులకు సంబంధించిన కొన్ని కీలక పత్రాలను అక్కడ డిస్‌ప్లే చేశారు. ఇవి గత రెండేళ్ల క్రితం నాటివి కావడం గమనార్హం. అయితే, రెండేళ్ల క్రితం నాటి పత్రాలు అటక మీద నుంచి తీసి ఇప్పుడు ఎందుకు డిస్‌ప్లే చేశారనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. అయితే, తాళాలు వేసి మీడియాను లోనికి రానివ్వకుండా చేసే ఉద్దేశం తమకు లేదని, ఇంటెలిజెన్స్ సూచనల ప్రకారమే తాము ఈ పని చేసినట్లు సూపరింటెండెంట్ వివరణ ఇచ్చారు. గతంలో జరిగిన ఘటనలు మళ్లీ జరగకుండానే తాళాలు వేసినట్లు వెల్లడించారు.ఈ నేపథ్యంలో గాంధీ ఆస్పత్రిలో అక్రమాలపై వైద్య, ఆరోగ్యశాఖ సీరియస్ అయింది. మొత్తం వ్యవహారంపై విచారణకు కమిటీ వేసేందుకు మంత్రి ఈటల నిర్ణయించినట్లు తెలుస్తోంది. అక్రమాల ఆరోపణలు చేసిన డాక్టర్ వసంత్‌ను అధికారులు తప్పించిన విషయం తెలిసిందే. 2019లో బయోమెట్రిక్‌ పనిచేయకపోయినా 8 నెలల జీతాలు తీసుకున్నట్లు వైద్యులపై ఆరోపణలు వెల్లువెత్తాయి. హౌజ్ సర్జన్లు, హెచ్ఓడీలతో సూపరింటెండెంట్ అత్యవసర సమావేశం నిర్వహించారు. తర్వాత మీడియాతో మాట్లాడారు. 2019 మార్చి నుంచి హౌస్‌ సర్జన్లకు బయోమెట్రిక్, ఐరిస్‌ నమోదుతోపాటు హెచ్‌ఓడీలు రాజారావు, విమల థామస్, కృష్ణ మోహన్‌ త్రిసభ్య కమిటీకి నిర్వహణ బాధ్యతలు అప్పగించామని తెలిపారు. గాంధీ ఆస్పత్రిలో ఎటువంటి అవినీతి, అవకతవకలకు ఆస్కారం లేదని సూపరింటెండెంట్ అన్నారు

Related Posts