YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం విద్య-ఉపాధి తెలంగాణ

ప్రైవేట్ వర్శిటీలకు అడుగులు

ప్రైవేట్ వర్శిటీలకు అడుగులు

ప్రైవేట్ వర్శిటీలకు అడుగులు
హైద్రాబాద్, ఫిబ్రవరి 15,
రాష్ట్రంలో రెండు ప్రైవేటు యూనివర్సిటీల ఏర్పాటుకు సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ఇచ్చారు. మల్లారెడ్డి మహిళా ప్రైవేటు వర్సిటీ, టెక్మహీంద్రా ప్రైవేటు వర్సిటీలకు సర్కారు లెటర్ ఆఫ్ ఇంటెంట్ (ఎల్ఓఐ) జారీ చేసింది. త్వరలో మరో ఏడు ప్రైవేటు వర్సిటీలకూ ఎల్ఓఐ ఇచ్చేందుకు రంగం సిద్ధమైంది.  ఆరు నెలల్లోపు అన్ని వసతులు ఏర్పాటు చేసుకుంటే పూర్తి స్థాయి అనుమతి (లెటర్ఆఫ్ అప్రూవల్– ఎల్ఓఏ) జారీ చేయనుంది. మొత్తంగా వచ్చే విద్యా సంవత్సరంలో ప్రైవేటు యూనివర్సిటీలు అడుగుపెట్టనున్నాయి.రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ స్టేట్‌‌ ప్రైవేటు యూనివర్సిటీస్‌‌ (ఎస్టాబ్లిష్‌‌మెంట్‌‌ అండ్‌‌ రెగ్యులేషన్‌‌) యాక్ట్‌‌ ను గతేడాది జూలై నుంచి అమల్లోకి తెచ్చింది. 2018లోనే అసెంబ్లీలో బిల్లు పాస్‌‌ కాగా.. ఏడాది తర్వాత గెజిట్‌‌ నోటిఫికేషన్‌‌ విడుదల చేశారు. గతేడాది ఆగస్టులో గైడ్లైన్స్జారీ చేసి, దరఖాస్తులు ఆహ్వానించారు.  దాంతో పదకొండు సంస్థలు (టెక్మహీంద్రా, మల్లారెడ్డి, వాక్సన్, శ్రీనిధి, ఎస్ఆర్, అమిటీ, అనురాగ్, గురునానక్, నిక్మార్, రాడ్క్లిఫ్‌‌, ఎంఎన్ఆర్) ప్రైవేటు యూనివర్సిటీ పెట్టేందుకు అప్లై చేసుకున్నాయి. విద్యాశాఖ సెక్రెటరీ నేతృత్వంలోని కమిటీ అప్లికేషన్లను, ఏర్పాటుకు ప్రతిపాదించిన స్థలాలను పరిశీలించింది. తొమ్మిది ప్రైవేటు వర్సిటీలకు సంబంధించిన రిపోర్టును సర్కారుకు అందజేసింది. అందులో మల్లారెడ్డి యూనివర్సిటీ ఫర్ ఉమెన్స్ తో పాటు టెక్ మహీంద్రా యూనివర్సిటీకి ఆమోదం తెలుపుతూ సర్కారు ఎల్ఓఐ జారీ చేసింది. మేడ్చల్జిల్లా దూలపల్లి మైసమ్మగూడలో మల్లారెడ్డి వర్సిటీ,  అదే జిల్లాలోని దుండిగల్లో టెక్మహీంద్రా వర్సిటీ ఏర్పాటుకు గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. అనురాగ్, ఎస్ఆర్, గురునానక్, శ్రీనిధి, నిక్మార్, ఎంఎన్ఆర్వర్సిటీలకు త్వరలోనే ఎల్ఓఐ జారీకానున్నట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయిప్రైవేటు వర్సిటీలు కేవలం క్యాంపస్లను మాత్రమే నిర్వహించుకోవాలి. వాటికి అనుబంధ కాలేజీలు ఉండవు. రూ.10 కోట్లు కార్ఫస్ఫండ్, రూ.30 కోట్లు ఫిక్స్డ్ డిపాజిట్ చూపించాలని.. యూజీసీ, ఏఐసీటీఈ నిబంధనల మేరకు నడపాలని సర్కారు స్పష్టం చేసింది. ఆరు నెలల్లోపు తగిన ఇన్ఫాస్ట్రక్చర్, ఫాకల్టీ, ల్యాబ్స్ ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించింది. ఈ ప్రైవేటు వర్సిటీల్లో 2020–21 అకడమిక్ ఇయర్ నుంచే క్లాసులు ప్రారంభించుకునే అవకాశముంది.

Related Posts