YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆటలు దేశీయం

 ఉసెన్ బోల్ట్ ను మరిపించిన శ్రీనివాస్

 ఉసెన్ బోల్ట్ ను మరిపించిన శ్రీనివాస్

 

 ఉసెన్ బోల్ట్ ను మరిపించిన శ్రీనివాస్
బెంగళూరు ఫిబ్రవరి 14
పరుగు పందెం అతని లైఫ్ స్టైల్ ను మార్చేసింది. ఏకంగా అథ్లెట్ ఛాంపియన్ ను అధిగమించి యావత్తు ప్రపంచాన్ని తన వైపు తిప్పుకున్నాడు.కర్ణాటకలో పరుగు వీరుడు సాధించిన విజయం భారత దేశానికి ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చింది. ప్రపంచ రన్నింగ్ లో ఉసేన్ బోల్ట్ ప్రపంచానికి పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు.కానీ ఇప్పుడు ఆ స్ధానాన్ని తన ప్రతిభతో కర్ణాటకలో యువకుడు బ్రేక్ చేసి హ్యాట్రిక్ విజయాన్ని అందుకొని ప్రత్యేకంగా నిలిచాడు.పరుగు పందెంలో రికార్డును బద్దలు కొట్టి ఘన విజయాన్ని కర్ణాటక ప్రజలకు బహుమతి అందించాడు.కర్నాటక రాష్ట్రానికి చెందిన 28ఏళ్ల యువకుడు పరుగు పదెంలో ఏకంగా ఉసేన్ బోల్ట్ ను మించిపోయాడు.వరల్డ్ వైడ్ గా రికార్డ్ ను సాదించి ఔరా అనిపించాడు.దక్షిణ కన్నడ జిల్లాలోని మూడబిద్రి పట్టణానికి చెందిన శ్రీనివాస గౌడ కంబాలా రేస్ లో పాల్గొని సత్తా చాటాడు.బురదతో ఉన్న మైదానంలో కేవలం 13.62 సెకన్లలో 142.5 మీటర్లు పరుగెత్తి కేవలం 9.55 సెకన్లలోనే 100మీటర్లు దౌడ్ తీసి చరిత్ర సృష్టించాడు.ఇప్పటి వరకూ పరుగు వీరుడు అంటేనే మనకు వరల్డ్ రేస్ దిగ్గజం ఉసేన్ బోల్ట్ గుర్తుకు వస్తాడు.కానీ ఆ స్ధానాన్ని కౌవసం చేసుకొని భారత్ లో కూడా మరో పరుగు వీరుడు ఉన్నాడంటూ నిరూపించి ఉసేన్ బోల్ట్ సాటిగా నిలిచాడు. మామూలుగా నేలపై పరుగులు పెట్టడం క్రీడాకారులకు వెన్నతో పెట్టిన విద్య.కానీ బురదలో అది కూడా దున్నపోతుతో సంప్రదాయక కంబళ పోటీల్లో 142.5 మీటర్ల దూరాన్ని కేవలం 13.62 సెకన్లలోనే అధిగమించగం అంటే దాదాపు ఆసాధ్యమేనని కోవాలి. కానీ దాన్ని సాధ్యం చేసి తన ప్రత్యేకతను ప్రపంచానికి చాటి చెప్పారు.అది కూడా మామూలు నేల మీద కాదు బురద నీళ్లలో పరుగెత్తి ప్రపంచాన్ని ఆకర్షించాడు. రెండు దున్నలను కట్టేసి ఉంచిన తాడును పట్టుకుని ఈ పరుగు తీసి ఔరా అనిపించాడు.చిరుత పులి స్పీడ్ తో పోటీ పడే బోల్ట్ పరుగును బ్రేక్ చేసి ఈ పరుగు వీరుడు కర్ణాటక రాష్ట్రానికి అంతర్జాతీయ స్ధాయిలో గుర్తింపు తెచ్చాడు. భారత్లోనూ ఓ ఉసేన్ బోల్ట్ లాంటి పరుగు వీరుడు ఉన్నాడు.అతనే శ్రీనివాస గౌడ.అది ఉసేన్ బోల్ట్ కంటే వేగంగా పరుగులు పెట్టి అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నాడు.ఇప్పటి వరకు ప్రపంచంలో అత్యంత వేగంగా పరిగెత్తే వీరుడి జాబిలో ఉసేన్ బోల్ట్ పేరు ఉండేది.కానీ ఇప్పుడు ఆ స్ధానంలోకి శ్రీనివాస గౌడ వచ్చి చేరి రికార్డులను తిరగరాశాడు.దీంతో కంబళ పోటీల పరుగుతో ఆ క్రీడను ప్రపంచానికి పరిచయం చెయ్యడంతో పాటుగా ... తనలో ఉన్న క్రీడాశక్తిని చాటి చెప్పాడు.కర్ణాటకలోని మంగళూరు ఉడుపిలో ఈ పరుగు పందేలను ఏటా నిర్వహిస్తుంటారు.ఎవరైతే వాటిని వేగంగా పరిగెత్తించి లక్ష్యాన్ని చేరుకుంటారో వారే విజేతలుగా నిలుస్తారు.కంబళ పోటీల్లో 30 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టి అత్యంత వేగంగా పరిగెత్తిన వ్యక్తిగా శ్రీనివాస్ నిలిచాడు. పోటీలు క్రీడాకారులకు జాతీయ స్ధాయిలో గుర్తింపు తెస్తాయని శ్రీనివాస్ సాధించిన విజయంతో మరోసారి రుజువైంది.అది కూడా పరుగు వీరుడు అనే బిరుదు ఈ పోటీలతో దక్కించుకొని యావత్తు దేశంతో పాటు ప్రపంచ దృష్టిని ఆకర్షించాడు

Related Posts