YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా దేశీయం

‘భారతీయుడు-2’ షూటింగ్‌లో భారీ ఘోర ప్రమాదం! 3 టెక్నీషియన్స్ మృతి , దర్శకుడు శంకర్ కి గాయాలు

‘భారతీయుడు-2’ షూటింగ్‌లో భారీ ఘోర ప్రమాదం! 3 టెక్నీషియన్స్ మృతి , దర్శకుడు శంకర్ కి గాయాలు

‘భారతీయుడు-2’ షూటింగ్‌లో భారీ ఘోర ప్రమాదం! 3 టెక్నీషియన్స్ మృతి , దర్శకుడు శంకర్ కి గాయాలు 
విలక్షణ నటుడు కమల్ హాసన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘భారతీయుడు-2’ షూటింగ్‌లో  భారీ ఘోర ప్రమాదంచోటుచేసుకుంది.! చెన్నై సమీపంలోని పూంతమల్లి పక్కన ఉన్న నజరత్‌పేట్‌లోని ఈవీపీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ జరుగుతుండగా సెట్‌లో ఒక్కసారిగా క్రేన్ క్రాష్ అయ్యింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో పదిమందికి పైగా తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. స్థానిక సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న నజరేత్‌పేట్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.  మృతులు ప్రొడక్షన్ అసిస్టెంట్స్  మధు (29), చంద్రన్ (60) సహాయ దర్శకుడు కృష్ణ (34) అని తెలుస్తోంది. అత్యవసర చికిత్స నిమిత్తం క్షతగాత్రులను చెన్నైలోని సవిత ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. మరోవైపు మృతదేహాలను రాజీవ్ గాంధి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా.. ఈ సినిమాకు శంకర్ దర్శకత్వం వహిస్తుండగా.. కమలహాసన్, కాజల్ అగర్వాల్ , రకుల్ ప్రీత్ సింగ్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే.

Related Posts