YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు విద్య-ఉపాధి దేశీయం

విద్యార్ధినితో టీచర్ ట్రైయాంగిల్ లవ్ స్టోరీ

విద్యార్ధినితో టీచర్ ట్రైయాంగిల్ లవ్ స్టోరీ

విద్యార్ధినితో టీచర్ ట్రైయాంగిల్ లవ్ స్టోరీ
లక్నో, ఫిబ్రవరి 20  
విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పి క్రమశిక్షణగా తీర్చిదిద్దాల్సిన ఉపాధ్యాయులే కట్టుబాట్లు తప్పారు. కూతురులా చూడాల్సిన విద్యార్థినితో ఒకరికి తెలియకుండా మరొకరు ప్రేమలో పడ్డారు. చివరికి ఆమెను దక్కించుకునేందుకు ఒకరు ప్రాణం కోల్పోగా.. మరొకరు హంతకుడిగా మారి కటకటాల పాలయ్యాడు. ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రంలో వెలుగులోకి వచ్చిన ఈ ట్రయాంగిల్ లవ్‌స్టోరీ వివరాలిలా ఉన్నాయి.మీర్జాపూర్‌ జిల్లాలోని వింధ్యాచల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో గల రాపూరి గ్రామంలోని ఓ బావిలో శనివారం సూరజ్ పాండే అనే టీచర్ మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చారు. దీనిపై కేసు నమోదు కేసుకున్న పోలీసులకు దర్యాప్తులో దిమ్మతిరిగే నిజాలు వెల్లడయ్యాయి. అతడిని తోటి ఉపాధ్యాయుడే గొంతు కోసి చంపేశాడని అని తేలడంతో అందరూ షాకయ్యారు.రాపూరి గ్రామంలోని జడ్పీ హైస్కూల్‌లో సూరజ్ పాండే, అనుజ్ అనే యువకులు టీచర్లుగా పనిచేస్తున్నారు. ఇద్దరూ మంచి స్నేహితులు. సూరజ్ అదే గ్రామానికి చెందిన ఇంటర్ విద్యార్థినితో మూడేళ్లుగా ప్రేమాయణం నడుపుతున్నాడు. ఆమె పాఠశాలలో చదివినప్పుడు మొదలైన వ్యవహారాన్ని సూరజ్ గుట్టుచప్పుడు కాకుండా కొనసాగిస్తున్నాడు. ఇటీవలే ఈ విషయం తెలుసుకున్న అనుజ్ బాలిక ఫోన్ నంబర్ తెలుసుకుని మూడు నెలలుగా ఆమెతో మాట్లాడుతున్నాడు.ఈ విషయం తెలుసుకున్న సూరజ్ తన స్నేహితుడు అనుజ్‌ను నిలదీశాడు. ‘ఆమెతో ప్రేమ వ్యవహారం పెట్టుకోవద్దు, నువ్వు ఒప్పుకుంటే ఇద్దరం ఎంజాయ్ చేద్దాం’ అంటూ అనుజ్ అతడికి నచ్చజెప్పాడు. దానికి ఒప్పుకోని సూరజ్ తన ప్రియురాలితో సంబంధం వదలకపోతే అంతు చూస్తానని హెచ్చరించాడు. దీంతో అతడిపై కక్ష పెంచుకున్న అనుజ్.. తన సన్నిహితుడు రత్నేష్‌తో కలిసి ఫిబ్రవరి 11న సూరజ్‌ను గొంతు కోసి చంపేసి బావిలో పడేశాడు.ఆ మరుసటి రోజూ సూరజ్ మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. విచారణలో హత్య చేసింది అనుజ్ అని తేలడంతో పోలీసులు అతడి కోసం గాలించారు. ఈ విషయం తెలుసుకున్న అనుజ్ తీవ్ర ఆందోళనకు గురై ఫిబ్రవరి 13న ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సూరజ్ హత్యకేసులో సహ నిందితుడిగా ఉన్న రత్నేశ్‌ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఓ అమ్మాయి కారణంగా ఇద్దరు ప్రాణ స్నేహితులు ప్రాణాలు కోల్పోయిన ఘటన స్థానికంగా విషాదం నింపింది

Related Posts