YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు విద్య-ఉపాధి ఆంధ్ర ప్రదేశ్

నూజివీడు లేడీస్ హాస్టల్లో దూరిన యువకుడు.. రాత్రంతా..

నూజివీడు లేడీస్ హాస్టల్లో దూరిన యువకుడు.. రాత్రంతా..

నూజివీడు లేడీస్ హాస్టల్లో దూరిన యువకుడు.. రాత్రంతా..
విజయవాడ, ఫిబ్రవరి 24
కృష్ణా జిల్లా నూజివీడు ట్రిపుల్ ఐటీ కళాశాలలో కలకలం రేగింది. విద్యార్థినుల హాస్టల్‌లోకి ఓ యువకుడు ఊచలు విరగగొట్టి మరీ ప్రవేశించాడు. ఓ రోజంతా విద్యార్థినుల హాస్టల్‌ గదిలోనే ఉన్నాడు. ఈ నేపథ్యంలో శనివారం మధ్యాహ్నం ఆ విద్యార్థిని సెక్యూరిటీ సిబ్బంది, కాలేజీ అధ్యాపకులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ప్రాథమిక విచారణ జరిపిన కళాశాల యాజమాన్యం ఆరుగురు విద్యార్థినులను సస్పెండ్ చేసింది.కళాశాలలో గత రెండు రోజులుగా ఫెస్ట్‌ జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా అమ్మాయిలు, అబ్బాయిలు కలిసి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అందరూ ఆ హాడావుడిలో ఉండగా, అదే కళాశాలలో రెండో సంవత్సరం చదువుతున్న యువకుడు ఊచలు విరగ్గొట్టి లేడీస్ హాస్టల్‌లో దూరినట్లు తెలుస్తోంది. ఇందుకు విద్యార్థినులు కూడా సహకరించినట్లు సమాచారం. శనివారం మధ్యాహ్నం సెక్యూరిటీ సిబ్బందికి అనుమానం వచ్చి అమ్మాయిలు ఉంటున్న గది తలుపు పగులగొట్టి లోపలికి వెళ్లగా  మంచం కింద యువకుడు ఉన్నట్లు గుర్తించారు. దీంతో యువకుడిని సెక్యూరిటీ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. ప్రాథమిక విచారణలో యువకుడు హాస్టల్లోకి ప్రవేశించేందుకు విద్యార్థినుల ప్రమేయం ఉందని నిర్ధారించిన యాజమాన్యం ఆరుగురిని సస్పెండ్ చేసింది. ఇటీవలే పలు వివాదాలతో వార్తల్లో నిలిచిన నూజివీడు ట్రిపుల్ ఐటీ.. మరోసారి సంచలన విషయంతో వెలుగులోకి వచ్చింది.

Related Posts