YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం వాణిజ్యం దేశీయం విదేశీయం

భారత్‌తో 3 బిలియన్ డాలర్ల రక్షణ ఒప్పందాలు : ట్రంప్

భారత్‌తో 3 బిలియన్ డాలర్ల రక్షణ ఒప్పందాలు : ట్రంప్

భారత్‌తో 3 బిలియన్ డాలర్ల రక్షణ ఒప్పందాలు : ట్రంప్
గుజరాత్, ఫిబ్రవరి 24
అహ్మదాబాద్‌లోని మొతేరా స్టేడియంలో నిర్వహించిన ‘నమస్తే ట్రంప్’ కార్యక్రమంలో పాల్గొన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. భారత్‌తో 3 బిలియన్ డాలర్ల విలువైన రక్షణ ఒప్పందం చేసుకుంటామని ప్రకటించారు. 1.25 లక్షల మంది హాజరైన ‘నమస్తే ట్రంప్’ సభలో.. ప్రధాని మోదీ మాట్లాడిన అనంతరం ప్రసంగించిన అనంతరం ట్రంప్ మాట్లాడుతూ.. బాలీవుడ్ నుంచి ఉగ్రవాదంపై పోరాటం వరకు అనేక అంశాలను ప్రస్తావించారు. మా గుండెల్లో భారత్‌కు ప్రత్యేక స్థానం ఉందన్న ట్రంప్.. అమెరికా భారత్‌ను ప్రేమిస్తోందని.. తమ దేశం ఇండియాను గౌరవిస్తోందని.. అమెరికా ఎప్పటికీ భారతీయులకు నమ్మకమైన మిత్రదేశమన్నారు.ఐదు నెలల క్రితం టెక్సాస్‌లోని పెద్ద ఫుట్ బాల్ స్టేడియంలో మీ ప్రధానికి అమెరికా స్వాగతం పలికింది. ఈ రోజు ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియంలో నాకు భారత్ స్వాగతం పలికిందని డొనాల్డ్ ట్రంప్ తెలిపారు.‘‘ప్రధాని మోదీ కేవలం గుజరాత్‌కే గర్వకారణం కాదు. కష్టించి పని చేయడానికి, ఉపాసనకు మీరో సజీవ సాక్ష్యం. భారతీయులు ఏదైనా సాధించగలరు, తాము అనుకున్నది చేయగలరు. ప్రధాని మోదీ అద్భుతంగా ఎదిగారు’’ అని ట్రంప్ ప్రశంసలు గుప్పించారు. ప్రధాని మోదీ ఛాయ్‌వాలా ప్రస్థానాన్ని ప్రారంభించిన విషయాన్ని గుర్తు చేసిన ట్రంప్.. ఆయన్ను ప్రతి ఒక్కరూ ప్రేమిస్తారన్నారు. కానీ మోదీ చాలా దృఢమైన వ్యక్తి అన్న అమెరికా అధినేత.. భారత ప్రజాస్వామ్యం అద్భుతం అని కొనియాడారు. భారత్ రావడం గొప్ప గౌరవంగా భావిస్తున్నానని ఈ సందర్భంగా ట్రంప్ తెలిపారు. ఇంతటి ఘన స్వాగతాన్ని, గొప్ప ఆతిథ్యాన్ని మేం చిరకాలం గుర్తుంచుకుంటామన్నారు.ప్రపంచ దేశాల ప్రజలు బాలీవుడ్ సినిమాలు, భాంగ్రా డ్యాన్స్‌తో ఆనందిస్తుంటారన్న ట్రంప్.. సచిన్, కోహ్లి లాంటి గొప్ప క్రికెటర్లను మీరు ఉత్సాహ పరుస్తారన్నారు. షోలే, దిల్ వాలే దునియా లేజాంగే సినిమాలను కూడా ట్రంప్ ప్రస్తావించారు.రక్షణ రంగంలో భారత్, అమెరికా మధ్య సహకారం కొనసాగుతుందన్న ట్రంప్.. ఈ భూమ్మీదున్న అత్యాధునిక, భయంగొల్పే సైనిక పరికరాలను భారత్‌కు ఇవ్వడానికి తాము సంసిద్ధంగా ఉన్నామన్నారు. అమెరికా గొప్ప ఆయుధాలను రూపొందించిందన్న ట్రంప్.. భారత్‌తో ఒప్పందం చేసుకుంటామన్నారు.ఇస్లామిక్ ఉగ్రవాదం ముప్పు నుంచి పౌరులను కాపాడుకోవడంలో ఇరు దేశాలు ఐక్యంగా ఉన్నాయన్న ట్రంప్.. తన హయాంలో ఐసిస్ ఉగ్రభూతాన్ని నామరూపాల్లేకుండా చేశానన్నారు. భారత్‌తో మంగళవారం 3 బిలియన్ డాలర్ల విలువైన రక్షణ ఒప్పందం కుదుర్చుకుంటామన్నారు.ఉగ్రవాదంపై పోరాటానికి భారత్, అమెరికా కట్టుబడి ఉన్నాయన్న ట్రంప్.. ఉగ్రవాద సంస్థలను నాశనం చేయడానికే తమ ప్రభుత్వం పాక్‌తో కలిసి పని చేస్తోందన్నారు. పాకిస్థాన్‌తో తమ సంబంధాలు బాగున్నాయన్న ఆయన.. పాక్‌లో పురోగతి కనిపిస్తోందన్నారు. దక్షిణాసియాలో ఉద్రిక్తతలు తొలగుతాయని, భవిష్యత్తులో సామరస్యం వెల్లివిరుస్తుందని ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు.

Related Posts