YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం వాణిజ్యం దేశీయం విదేశీయం

భారత్- అమెరికా మధ్య ఐదు ఒప్పందాలు

భారత్- అమెరికా మధ్య ఐదు ఒప్పందాలు

భారత్- అమెరికా మధ్య ఐదు ఒప్పందాలు
న్యూఢిల్లీ ఫిబ్రవరి 25
భారత్- అమెరికా మధ్య ఐదు ఒప్పందాలు కుదిరాయి. ఆర్థిక, వాణిజ్య, రక్షణాంశాల్లో రెండు దేశాలు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ట్రంప్-మోదీ మధ్య పలు అంశాలపై చర్చలు జరిగాయి. ఈ సందర్భంగా వీసాల గురించి ట్రంప్ వద్ద మోదీ ప్రస్తావించినట్లు సమాచారం. చర్చల సందర్భంగా ట్రంప్‌కు మోదీ మరోసారి కృతజ్ఞతలు తెలిపారు. ఓ ప్రపంచ నేతకు భారత్‌లో ఈ స్థాయిలో ఘనస్వాగతం ఇంతకుముందు ఎప్పుడూ పలకలేదని మోదీ అన్నారు. ట్రంప్ కూడా భారత్ ఆతిధ్యానికి మరోసారి ధన్యవాదాలు చెప్పారు. వాణిజ్య, రక్షణ రంగాల్లో రెండు దేశాలు కలిసి ముందుకుసాగుతాయని అన్నారు. నిన్న, ఇవాళ అద్భుతంగా గడిచాయని చెప్పారు. అంతుకుమందు మంగళవారం ఉదయం రాష్ట్రపతి భవన్‌లో ట్రంప్‌కు ఘనస్వాగతం లభించింది. ట్రంప్ దంపతులకు రామ్‌నాథ్ కోవింద్, మోదీ ఘనస్వాగతం పలికారు. కోవింద్ సతీమణి ట్రంప్ దంపతులకు రెండు చేతులు జోడించి నమస్కారం అంటూ ఆహ్వానించారు. ట్రంప్ సతీమణి మెలానియా ట్రంప్  ఢిల్లీలోని సర్వోదయ స్కూల్‌కు వెళ్లారు. హ్యాపీనెస్ క్లాసులను పరిశీలించారు. గంట పాటు మెలానియా ఈ స్కూల్లో గడిపారు. మెలానియా స్కూలు రావడంతో అక్కడ విద్యార్థులు సాదర స్వాగతం పలికారు.ఢిల్లీలోని హైద‌రాబాద్ హౌజ్‌లో ట్రంప్‌తో జ‌రిగిన ద్వైపాక్షిక చ‌ర్చ‌ల అనంత‌రం సంయుక్త మీడియా స‌మావేశంలో ప్ర‌ధాని మోదీ మాట్లాడారు.  భార‌త్‌, అమెరికా భాగ‌స్వామ్యానికి చెందిన కీల‌క విష‌యాల‌ను చ‌ర్చించామ‌ని మోదీ అన్నారు.  ర‌క్ష‌ణ‌, భ‌ద్ర‌త‌, ఎన‌ర్జీ, వ్యూహాత్మ‌క భాగ‌స్వామ్యం, వాణిజ్యం, ప్ర‌జ‌ల సంబంధాల గురించి మాట్లాడామ‌న్నారు. ర‌క్ష‌ణ రంగంలో బ‌లోపేతం కావ‌డ‌మే కీల‌క‌మైన అడుగ‌న్నారు.  ఉగ్ర‌వాదానికి కార‌ణ‌మైవారిని, మ‌ద్ద‌తు ఇచ్చేవారి ప‌ట్ల క‌ఠిన చ‌ర్య‌లు రెండు దేశాలు అంగీక‌రించాయ‌న్నారు. వాణిజ్య ఒప్పందాలపై మా శాఖా మంత్రులు పాజిటివ్‌గా చ‌ర్చ‌లు నిర్వ‌హించిన‌ట్లు చెప్పారు. ఆ చ‌ర్చ‌ల‌కు న్యాయ ప్ర‌క్రియ జోడించాల‌న్నారు. రెండు దేశాల మ‌ధ్య బంధం ప్ర‌భుత్వాల మ‌ధ్య ఉన్న బంధం మాత్ర‌మే కాదు అని, ఇది ప్ర‌జ‌ల మ‌ధ్య ఉన్న బంధం అని మోదీ అన్నారు.

Related Posts