YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం తెలంగాణ

రోజుకు వందకు పైగా రిజిస్ట్రేషన్లు

రోజుకు వందకు పైగా రిజిస్ట్రేషన్లు

రోజుకు వందకు పైగా రిజిస్ట్రేషన్లు
రంగారెడ్డి, ఫిబ్రవరి 26
హైదరాబాద్, నాగార్జునసాగర్ రహదారికి రియల్ భూమ్ తాకింది. గతంలో ఇక్కడ ఎకరాకు రూ.10లక్షలుండగా.. ప్రస్తుతం కోటి రూపాయల నుంచి రెండు కోట్లకు చేరింది. ప్రతిరోజూ ఉదయం నుంచి సాయంత్రం వరకు సాగర్ రహదారి వెంట వందలాది వాహనాలు భూములు, ప్లాట్ల కోసం చక్కర్లు కొడుతున్నాయి. హైదరాబాద్, నాగార్జునసాగర్ రహదారికి ఇరువైపులా పది కిలోమీటర్ల లోపలి వరకు భూముల క్రయ విక్రయాలు పెద్ద ఎత్తున సాగుతున్నాయి. మరోవైపు సాగర్ రహదారికి ఇరువైపులా వేలాది వెంచర్లు కూడా ఏర్పడ్డాయి. దీంతో ప్రతిరోజూ సాగర్ రహదారికి ఇరువైపులా వందల కోట్ల రూపాయల లావాదేవీలు జరుగుతున్నాయి. ముఖ్యంగా నగర శివారు ప్రాంతాలు శరవేగంగా అభివృద్ధి చెందుతుండడంతో ఇబ్రహీంపట్నం, మంచాల, యాచారం, మాడ్గుల, మర్రిగూడ తదితర మండలాలకు చెందినవారు ఇంజాపూర్, తుర్కయంజాల్, రాగన్నగూడ, మన్నెగూడ, బొంగ్లూరు, ఆదిబట్ల, పటేల్‌గూడ, ఇబ్రహీంపట్నం ప్రాంతాల్లో ఇండ్ల కొనుగోలు చేస్తున్నారు. గ్రామాల్లో భూములను అమ్ముకుని ఈ ప్రాంతాల్లో స్థలాలు కొనుగోలు చేసి ఇండ్లు అలాగే, ఫార్మాసిటీలో కోల్పోతున్నవారు కూడా ఇబ్రహీంపట్నం, యాచారం, మాల్, గున్‌గల్, ఆగాపల్లి తదితర ప్రాంతాల్లో ప్లాట్లు కొనుగోలు చేస్తున్నారు. దీంతో సాగర్ రహదారి సమీప ్ధపాంతం అత్యంత ఖరీదైనదిగా మారింది.నగర శివారులోని ఔటర్ రింగ్‌రోడ్డు లోపలి గ్రామాల్లో గతంలో భూముల క్రయ, విక్రయాలు ఎకరాల్లో ఉండేది. ఎకరా 20 నుంచి 30 రూపాయలు పలికేది. ధరలు అమాంతం పెరిగి ప్రస్తుతం కోట్లలోకి చేరింది. మార్చి గజాల చొప్పున విక్రయిస్తున్నారు. తుర్కయంజాల్, ఆదిబట్ల, మన్నెగూడ, బొంగ్లూరు, పటేల్‌గూడ, ఇబ్రహీంపట్నం తదితర గ్రామాల్లో గజానికి సుమారు 20నుంచి రూ.30వేల వరకు పలుకుతున్నది. ఔటర్ రింగ్‌రోడ్డు లోపలి గ్రామాల్లో ఎకరాల్లో ఉన్న భూములు గజాల్లోకి వెళ్లిపోయాయి. ఔటర్ వెలుపలి గ్రామాలైన ఇబ్రహీంపట్నం, శేరిగూడ, ఆగాపల్లి, గున్‌గల్, యాచారం, నక్కగుట్టతండా, మాల్ గ్రామాల్లో కూడా భూముల ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో ఇక్కడా విక్రయాలు జరుగుతున్నాయి. నగరంతోపాటు ఉమ్మడి రాష్ర్ంటలోని అనేక ప్రాంతాలవారు సాగర్ రహదారి వెంట వ్యవసాయ భూములు, ఇండ్ల పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తున్నారు. యాచారంలో ఫార్మాసిటీ, ఇబ్రహీంపట్నంలో రక్షణరంగ పరిశ్రమలు, ఆదిబట్లలో ఐటీ సంస్థలు, కొంగరకలాన్‌లో కలెక్టర్ కార్యాలయం నేపథ్యంలో సాగర్ రహదారి వెంట భూములకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ప్రస్తుతం ఆదిబట్లలో టీసీఎస్‌తోపాటు ఇతర ఐటీ సంస్థలు ఏర్పాటైనందున ఎకరం ఐదు నుంచి పది కోట్ల రూపాయల వరకు పలుకుతుంది. మారుమూల మాల్ పరిసరాల్లో ఎకరం చేరుకుంది. యాచారం మండల కేంద్రంలో సాగర్ రోడ్డుకు ఇరువైపులా ఎకరాకు 60 నుంచి రూ.70 పలుకుతున్నది. సాగర్ రహదారి భూముల క్రయ విక్రయాలు అమాంతం పెరిగిపోయిన నేపథ్యంలో రిజిస్ట్రేషన్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో గతంలో రోజుకు 10 20వరకు రిజిస్ట్రేషన్లు జరిగేవి. ప్రస్తుతం రోజుకు 200కు పైగా ఇబ్రహీంపట్నం రిజిస్ట్రేషన్ కార్యాలయానికే రుసుము నెలకు సుమారు ఐదు రూపాయల వరకు వస్తుంది. కార్యాలయాల వద్ద డాక్యుమెంట్ రైటర్లు, రియల్ ఎస్టేట్ బ్రోకర్లు, స్టాంప్ వెండర్లు బిజీగా పనిచేస్తున్నారు.నగర శివారులోని రియల్ ఎస్టేట్ కార్యాలయాలు కిటకిటలాడుతున్నాయి. భూములు, ప్లాట్ల క్రయ విక్రయాల వల్ల రోజుకు సుమారు 50 నుంచి 100 రూపాయల వరకు చేతులు మారుతున్నాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారంతో అనేక మంది ఉపాధి పొందుతున్నారు.

Related Posts