YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం వాణిజ్యం తెలంగాణ

వాణిజ్య ప్రోత్సాహక సంస్థ డైరీని ఆవిష్కరించిన మంత్రులు

వాణిజ్య ప్రోత్సాహక సంస్థ డైరీని ఆవిష్కరించిన మంత్రులు

వాణిజ్య ప్రోత్సాహక సంస్థ డైరీని ఆవిష్కరించిన మంత్రులు
హైదరాబాద్ ఫిబ్రవరి 27 
రాష్ట్ర ఆబ్కారి, క్రీడా, పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, రాష్ట్ర హోంశాఖ మంత్రి  మహమ్మద్ మహమూద్ అలీ గురువారం నాడు తెలంగాణ రాష్ట వాణిజ్య ప్రోత్సాహక సంస్థ డైరీ ని హైదరాబాద్ లోని మంత్రుల నివాస సముదాయంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కొల్లాపూర్ శాసన సభ్యుడు హర్షవర్ధన్ రెడ్డి, సంస్థ  చైర్మన్  దేవరి మల్లప్ప, ఎండీ వెంకట నర్సింహారెడ్డి లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి  శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ, అనుబంధ సంస్ధల బలోపేతానికి ముఖ్యమంత్రి  కల్వకుంట్ల చంద్రశేఖరరావు  చర్యలు తీసుకున్నారన్నారు. వాణిజ్య ప్రోత్సాహక సంస్థ గతంలో పుస్తకాల ముద్రణకు ,సరఫరా కు ప్రైవేట్  వారిపై ఆధారపడి నామమాత్రంగా ఉండేది. కానీ, నేడు స్వయం సంపత్తి తో ఉద్యోగుల సహకారంతో ప్రభుత్వ  సంక్షేమ శాఖ గురుకులాలకు అన్ని రకాల పుస్తకాలను సరఫరా చేయటంతో పాటు ఎగుమతి సామర్ధ్యం ను గలిగిన సంస్థ గా అభివృద్ధి చేస్తున్న ఛైర్మన్ ఎండిలను మంత్రి అభినందించారు.

Related Posts