YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

గ్రామీణ నేపథ్యం ఉన్న 45 రైల్వే స్టేషన్లకు వైఫై సదుపాయం.

గ్రామీణ నేపథ్యం ఉన్న 45 రైల్వే స్టేషన్లకు వైఫై సదుపాయం.

గ్రామీణ నేపథ్యం ఉన్న 45 రైల్వే స్టేషన్లకు వైఫై సదుపాయం కల్పించనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఈ మేరకు రైల్వే బోర్డు ఆదేశాలు జారీ చేసింది. 

ఇప్పటి వరకు జోన్‌ వ్యాప్తంగా ఉన్న ఏ-1, ఏ, బీ కేటగిరీ స్టేషన్లకు మాత్రమే వైఫై సదుపాయం ఉంది. 

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కొత్తగా గ్రామీణ నేపథ్యం ఉన్న 45 రైల్వే స్టేషన్లకు వైఫై సదుపాయం కల్పించాలన్న రైల్వే బోర్డు ఆదేశాల ప్రకారం 7 డీ-కేటగిరీ స్టేషన్లు, 35 ఈ-కేటగిరీ స్టేషన్లు, 3 ఎఫ్‌-కేటగిరీ స్టేషన్లకు కూడా వైఫై సౌకర్యం కల్పించారు. 

ప్రిన్సిపల్‌ చీఫ్‌ సిగ్నల్‌, టెలీ కమ్యూనికేషన్స్‌ ఇంజినీర్‌ వినయ్‌మోహన్‌ శ్రీవాస్తవ, ఆయా డివిజన్ల డీఆర్‌ఎంలను దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ వినోద్‌కుమార్‌యాదవ్‌ ఈ సందర్భంగా అభినందించారు.

Related Posts