YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు విద్య-ఉపాధి ఆంధ్ర ప్రదేశ్

బాలికలను మోకాళ్లపై నడిపించిన టీచర్ 

బాలికలను మోకాళ్లపై నడిపించిన టీచర్ 

బాలికలను మోకాళ్లపై నడిపించిన టీచర్ 
గురుకుల పాఠశాలలో దారుణం
కడప మార్చి 3, 
పాఠశాల పరిసరాలను శుభ్రం చేయలేదన్న కారణంతో పాఠశాల చుట్టూ విద్యార్థినులను మోకాళ్ళపై 11 రౌండ్లు నడిపించిన దారుణం కడప జిల్లా వనిపెంట లోని "మహాత్మా జ్యోతిబా పూలే  బాలికల సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల"లో ఆలస్యంగా వెలుగు చూసింది. బొబ్బ లెక్కి నడవలేమని ప్రాధేయపడినా వినకుండా కర్కశంగా ప్రవర్తించిన పి.ఈ.టి. టీచర్ లావణ్య పై చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. కడప జిల్లా వనిపెంటలోని బాలికల సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల పరిసరాలలో పడి ఉన్న చెత్తను శుభ్రం చేయాలని  ఎనిమిదవ తరగతి చదువుతున్న విద్యార్థినులను పిఈటి టీచర్ లావణ్య పురమాయించారు. చెత్తను శుభ్రం చేయలేదన్న కోపంతో విద్యార్థుల పట్ల కిరాతకంగా ప్రవర్తించింది. బొబ్బ లెక్కి రక్తం  కారుతున్నా బెత్తంతో కొట్టి మరీ మోకాళ్ళపై నడిపించింది. ఇదేమి ఘోరమని ప్రశ్నించిన తల్లిదండ్రులను సైతం లెక్క చేయలేదు. మైదుకూరు మండలం విద్యాధికారి పద్మలత జరిగిన ఘటనపై  విద్యార్థులను, పిఈటి టీచర్ లావణ్యను విచారించారు. విద్యార్థులు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై ఆరా తీశారు. విద్యార్థుల ఫిర్యాదు మేరకు పిఈటి టీచర్ లావణ్య పై ఉన్నతాధికారులకు  నివేదిక అందజేస్తామని తెలిపారు. ప్రధానోపాధ్యాయురాలు కృష్ణవేణి మాట్లాడుతూ... ఘటన జరిగిన రోజున కడపలో ఉన్నతాధికారులతో మీటింగ్‌లో ఉన్నానని తెలిపింది. విద్యార్థులను  మోకాళ్ళపై నడిపించిన పిఈటి టీచర్ లావణ్య పైన ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.  ప్రభుత్వం నుండి వేలకు వేలు జీతం తీసుకుంటూ... పాఠశాల  పరిసరాలను, తరగతి గదులను శుభ్రం చేయాల్సిన సిబ్బంది ఏమయ్యారు? స్వచ్ఛభారత్ పేరుతో విద్యార్థులతో పనులు చేయించడం ఎంతవరకు సబబు? బొబ్బ లెక్కి మోకాళ్ళపై  నడవలేమని ప్రాధేయపడినా కనికరించకుండా విద్యార్థుల పట్ల కర్కశంగా ప్రవర్తించడమే కాకుండా ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించిన పిఈటి టీచర్ లావణ్యను మొదటి తప్పుగా క్షమించాలని కోరడం హాస్యాస్పదం.

Related Posts