YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విద్య-ఉపాధి తెలంగాణ

 ప్రారంభమైన ఇంటర్ పరీక్షలు

 ప్రారంభమైన ఇంటర్ పరీక్షలు

 ప్రారంభమైన ఇంటర్ పరీక్షలు
హైద్రాబాద్, మార్చి 4 
రాష్ట్రంలో ఇంటర్ పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. అధికారులు ముందుగానే హెచ్చరించిన ‘నిమిషం’ నిబంధనకు అనుగుణంగా ఆలస్యంగా  పరీక్షా కేంద్రానికి వచ్చిన వారిపై అధికారులు కఠినంగా వ్యవహరించారు. ప్రతి విద్యార్థి పరీక్ష సమయానికి గంట ముందే కేంద్రానికి చేరుకోవాలని ముందే తెలిపారు. ఈ నేపథ్యంలో విద్యార్థులంతా పరీక్ష కేంద్రానికి ముందే చేరుకున్నారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష కొనసాగుతుంది. విద్యార్థులు తరగతిలోకి వెళ్లాక 8.45 గంటలకు ఓఎంఆర్‌ పత్రం ఇస్తారు. మరోవైపు, మంత్రి కేటీఆర్ కూడా ఇంటర్ విద్యార్థులకు  శుభాకాంక్షలు తెలిపారు. పరీక్షల్లో గ్రేడ్లు ముఖ్యమే కానీ, అవి జీవితం కాదని బుధవారం ఉదయం ట్వీట్ చేశారు.ఈ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 9,65,875 మంది హాజరవుతుండగా.. మొదటి సంవత్సరం విద్యార్థులు 4,82,808 మంది, రెండో సంవత్సరం విద్యార్థులు 4,83,067 మంది ఉన్నారు. ప్రతి కేంద్రంలో 4 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లుగా అధికారులు చెప్పారు. విద్యార్థులు హాల్‌ టికెట్లు, ఓఎంఆర్‌ పత్రాలపై ఉన్న వివరాలను క్షుణ్ణంగా పరిశీలించుకోవాలని సూచించారు. పొరపాట్లు ఉంటే వెంటనే అధికారులకు చెప్పాలని సూచించారు.పరీక్షల నేపథ్యంలో విద్యార్థుల ఒత్తిడిని దూరం చేసేందుకు ఇంటర్‌బోర్డు ప్రత్యేకంగా కౌన్సిలర్లను ఏర్పాటు చేసింది. విద్యార్థులు 7337225803కి ఫోన్‌ చేసి వారి ఇబ్బందులను వారితో చెప్పుకోవచ్చు. ఆయా కౌన్సిలర్లు విద్యార్థుల సమస్యలను బట్టి ఒత్తిడిని దూరం చేసే ప్రయత్నం చేస్తారని అధికారులు చెప్పారు. మరోవైపు, ఏవైనా ఫిర్యాదులుంటే కంట్రోల్‌ రూం నంబరు 040-24600110/24732369కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చని వెల్లడించారు. ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకు ఈ కాల్ సెంటర్ పని చేయనుంది.విద్యార్థులు తమ పరీక్ష కేంద్రాలను సులువుగా గుర్తించేందుకు ‘సెంటర్‌ లొకేటర్‌’ యాప్‌ను రూపొందించారు. అవసరమైన విద్యార్థులు గూగుల్‌ ప్లే స్టోర్‌లో డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఆ యాప్‌లో సెంటర్‌ కోడ్‌ నంబరును టైప్‌ చేస్తే.. సెంటర్‌కు దారి చూపిస్తుందని అధికారులు తెలిపారు. కరోనాతో తల్లిదండ్రుల టెన్షన్‌కరోనా వైరస్ హైదరాబాద్‌కు సైతం వ్యాపించిన నేపథ్యంలో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. బుధవారం నుంచి ఈ నెల 23 వరకు ఇంటర్‌, ఈ నెల  19 నుంచి ఏప్రిల్‌ 6 వరకు పదో తరగతి వార్షిక పరీక్షలు జరగనున్నాయి. ప్రభుత్వ కాలేజీలు, మరికొన్ని ప్రైవేటు కాలేజీల విద్యార్థులు మాత్రం ఆర్టీసీ బస్సులు, ఆటోల్లోనే వెళ్లాల్సిన పరిస్థితి ఉంది.కొన్ని ప్రైవేటు కాలేజీల నిర్వాకం వల్ల ఇంటర్ విద్యార్థుల భవిత ప్రశ్నార్థకంగా మారింది. రంగారెడ్డి జిల్లాలోని ఓ కాలేజీ యాజమాన్యం 48 మంది విద్యార్థుల నుంచి పరీక్ష ఫీజును వసూలు చేసి బోర్డుకు చెల్లించలేదు. దీంతో ఆ విద్యార్థులకు ఇంటర్‌బోర్డు నుంచి హాల్‌టికెట్లు రాలేదు. యాజమాన్యం తమకు హాల్‌టికెట్లు ఇవ్వకపోవడంతో విద్యార్థులు.. ఇంటర్‌బోర్డుకు వెళ్లి ఫిర్యాదు చేశారు. ఆరా తీసిన అధికారులకు  అసలు విషయం తెలిసింది. విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని హాల్‌టికెట్లు జారీ చేసి.. పరీక్షలకు అనుమతిస్తామని ఇంటర్‌బోర్డు కార్యదర్శి ఉమర్‌ జలీల్‌ తెలిపారు. కాలేజీపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.వరంగల్‌ అర్బన్‌ జిల్లా హన్మకొండలోని మరో కాలేజీలో 30 మంది విద్యార్థులకు హాల్‌టికెట్లు రాలేదు. ఆ కాలేజీ బోర్డు గుర్తింపు పొందకపోవడమే దీనికి కారణంగా చెబుతున్నారు. ఫిబ్రవరిలో జరిగిన ప్రాక్టికల్‌ పరీక్షలకు కూడా ఈ కాలేజీ విద్యార్థులు హాజరుకాలేదు. ప్రాక్టికల్‌ పరీక్షలకు హాజరుకాకుంటే.. వార్షిక పరీక్షలు రాసేందుకు అనర్హులని ఇంటర్‌ బోర్డు కార్యదర్శి ఉమర్‌ జలీల్‌ ఓ ప్రకటనలో  తెలిపారు. ఈ విద్యార్థులకు సప్లిమెంటరీ రాసుకునే అవకాశం కల్పిస్తామని తెలిపారు.

Related Posts