YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విద్య-ఉపాధి ఆరోగ్యం దేశీయం

దుబాయ్‌లో చదువుతున్న ఓ భారతీయ విద్యార్థి కరోనా వైరస్

దుబాయ్‌లో చదువుతున్న ఓ భారతీయ విద్యార్థి కరోనా వైరస్

భారతీయ విద్యార్ధికి కరోనా
ముంబై, మార్చి 5
దుబాయ్‌లో చదువుతున్న ఓ భారతీయ విద్యార్థి కరోనా వైరస్ బారిన పడినట్లు నిర్ధారణ అయింది. 16 ఏళ్ల ఆ బాలుడికి వారి తల్లిదండ్రుల నుంచి కోవిడ్ -19 వైరస్ సోకినట్లు అధికారులు వెల్లడించారు. ఐదు రోజుల విదేశీ పర్యటనకు వెళ్లి ఇటీవలే దుబాయ్ తిరిగొచ్చిన విద్యార్థి తల్లిదండ్రుల్లో కరోనా వైరస్ పాజిటివ్‌గా తేలిందని.. వారి నుంచి అతడికి కూడా ఇన్‌ఫెక్షన్ సోకిందని గల్ఫ్ న్యూస్ గురువారం (మార్చి 5) వెల్లడించింది. దుబాయ్ హెల్త్ అథారిటీ (డీహెచ్‌ఏ) కూడా దీన్ని ధ్రువీకరించినట్లు పేర్కొంది.బాధిత విద్యార్థిని, అతడి తల్లిదండ్రులను ప్రత్యేక వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలిపారు. ముందు జాగ్రత్త చర్యగా గురువారం నుంచి విద్యా సంస్థను మూసివేస్తున్నట్టు దుబాయ్‌లోని ఇండియన్ హై గ్రూప్ ఆఫ్ స్కూల్ ప్రకటించింది. పాఠశాల విద్యార్థులు, సిబ్బందికి అధికారులు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు.తాజా కేసుతో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 27కి చేరిందని అరబ్ ఎమిరేట్స్ ఆరోగ్య శాఖ అధికారులు ప్రకటించారు. భారత్‌లో గురువారం నాటికి కరోనా వైరస్ కేసుల సంఖ్య 30కి పెరిగింది. తాజాగా గజియాబాద్‌కు చెందిన ఓ వ్యక్తికి కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. కరోనా అనుమానిత లక్షణాలతో దేశంలో మొత్తం 19 వేల మందికి పైగా వివిధ ఆస్పత్రుల్లో చేరారు.

Related Posts