YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విద్య-ఉపాధి తెలంగాణ

ఖర్చు ఎక్కువ... తప్పులు ఎక్కువే

ఖర్చు ఎక్కువ... తప్పులు ఎక్కువే

ఖర్చు ఎక్కువ... తప్పులు ఎక్కువే
హైద్రాబాద్, మార్చి 6
ఆన్‌లైన్‌ మూల్యాంకనంతో ఫలితాల గందరగోళంతో పాటు భారీగానే ఖర్చవుతున్నట్టు వెల్లడవుతున్నది. మాన్యువల్‌ కంటే ఆన్‌లైన్‌ పద్ధతితో ఆరేడింతలు  అధికంగా భారమవుతున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. మాన్యువల్‌ వాల్యూయేషన్‌కు ఒక్కో పేపర్‌కు రూ.2 నుంచి రూ.3 వరకు ఖర్చవుతుండగా.. ఆన్‌లైన్‌కు మాత్రం 20 రూపాయలు చెల్లిస్తున్నట్టు ప్రొఫెసర్లు చెబుతున్నారు. ఇలా ఏడాదికి సుమారు 14 కోట్లు ఖర్చుచేస్తున్నా ఫలితాలు సకాలంలో రాకపోగా తప్పుల తడకగా మారిపోయింది. విద్యార్థుల భవిష్యత్‌ ఒకవైపు ఆందోళనకరంగా మారుతున్నా ఇందులో తమ తప్పేమీ లేదని అధికారులు దాటవేస్తున్నారు.ఓయూ పరిధిలో డిగ్రీ, పీజీ పరీక్షలు రెండు సెమిస్టర్లుగా జరుగుతాయి. యూజీ, పీజీ కలిపి సెమిస్టర్‌కు సుమారు 35లక్షల  జవాబుపత్రాలను వాల్యూవేషన్‌ చేయాలి. అంటే ఏడాదికి 70లక్షల పత్రాలను చేయాల్సి ఉంటుంది. 2018 సెప్టెంబర్‌కు ముందు మాన్యువల్‌గా కోడింగ్‌, డీకోడింగ్‌ చేసి వాల్యూవేషన్‌ చేసేవారు. ఒక్కో జవాబుపత్రానికి రూ.3చొప్పున ఖర్చయ్యేది. ఆన్‌లైన్‌ మూల్యాంకనానికి ఏడాదికి సుమారు రూ.14కోట్లు ఖర్చుచేయాల్సి వస్తోంది. వాటిలో జవాబుపత్రాలకు అంటించే ఒక్కో బార్‌కోడింగ్‌ స్టిక్కర్‌కు రూ.5 అవుతుంది. కాంట్రాక్టు దక్కించుకున్న ఏజెన్సీకి రూ.3.5 కోట్లు చెల్లించాలి. దీంతోపాటు ఒక్కో జవాబుపత్రంలో 32పేజీలు ఉంటాయి. వాటన్నింటినీ స్కాన్‌ చేయడానికి మ్యాగటిక్‌ అనే ఏజెన్సీకి అప్పగించారు.  జవాబుపత్రాన్ని స్కానింగ్‌ చేయ డానికి ఒక్కోదానికి రూ.15చొప్పున చెల్లిస్తున్నారు. మొత్తంగా ఆ ఏజెన్సీకి ఏడాదికి రూ.11.5కోట్లు చెల్లిస్తున్నారు. సెంటర్‌లో ప్రత్యేకంగా కంప్యూటర్లు, ఇతర సౌకర్యాలన్నీ కలిపి ఏడాదికి రూ.14కోట్లు ఖర్చుచేస్తున్నప్పటికీ ఫలితాల్లో అవకతవకలు జరుగుతున్నాయి. ప్రతి  రోజు 40వేల జవాబు పత్రాలు స్కానింగ్‌ చేస్తామని చెబుతున్నా పీజీ మొదటి సెమిస్టర్‌ ముగిసి 20 రోజులైనా నేటికి స్కానింగ్‌ పూర్తికాలేదు. మూల్యాం కనం తరువాత ప్రాసెసింగ్‌కు 15 రోజులు పడుతుంది. అక్కడ్నుంచి మరో సంస్థ ఫలితాలు సిద్ధం చేసేందుకు ఇంకో పదిహేను రోజులు తీసుకుంటుంది.  ఆన్‌లైన్‌ వ్యవస్థ తీసుకొచ్చినా ఆలస్యంగా ఫలితాలు వెల్లడికావడం పట్ల విద్యార్థులు, పలువురు అధ్యాపకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏజెన్సీలకు  దోచిపెట్టడానికే ఈ మూల్యాంకనం ప్రవేశపెట్టారని ఆరోపిస్తున్నారు.కంప్యూటర్‌లో 32 పేపర్లను స్కాన్‌ చేయడంతో వాటిని సంబంధిత అధ్యాపకులు పూర్తిగా చదువుకుంటూ కరెక్షన్‌ చేయాలి. 52 సబ్జెక్టులుండగా అందులో ఒక్కో పేపర్‌లో 32 పేజీలుంటాయి. విద్యార్థులు 32 పేజీలను పూర్తిగా రాసినా రాయకపోయినా స్కాన్‌ చేయాల్సిందే. స్క్రీన్‌పై కేవలం ఐదు నిమిషాలే అందుబాటులో పేపర్‌ ఉంటుంది. ఆ నిర్ణీత సమయంలోనే అన్ని పేజీలను చదవాలి. ఈ ప్రక్రియలో అధ్యాపకులకు వెన్నునొప్పులు, మెడ నొప్పులతో పాటు కండ్ల సమస్యలు ఏర్పడుతున్నట్టు తెలిసింది. ఐదారు సెట్లను పరిశీలించిన అనంతరం తీవ్ర  నీరసం వచ్చేస్తోందని పలువురు వాపోయారు. అయితే కోఠి ఉమెన్స్‌కాలేజీ, నిజాం కాలేజీలో ఇప్పటికీ మాన్యువల్‌గానే పేపర్లను దిద్దుతున్నారు. కేవలం వారం రోజుల్లోనే ఫలితాలను విడుదల చేస్తున్నారు.

Related Posts