YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం వాణిజ్యం దేశీయం విదేశీయం

 భారీగా పడిపోయిన ఆయిల్ ధరలు

 భారీగా పడిపోయిన ఆయిల్ ధరలు

 భారీగా పడిపోయిన ఆయిల్ ధరలు
ముంబై, మార్చి 9
మందగమనంలో సాగుతున్న ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు కరోనా వైరస్‌ చుక్కలు చూపిస్తున్న విషయం తెలిసిందే.  ఓ వైపు కరోనా భయాలు వెంటాడుతుండగా.. తాజాగా చమురు ఉత్పత్తి దేశాల మధ్య నెలకొన్న తీవ్ర పోటీలో  భారత్‌ సహా  పలు దేశాల స్టాక్‌ మార్కెట్లు సోమవారం కుప్పకూలాయి. ఆసియా మార్కెట్ల ప్రభావంతో దేశీయ మార్కెట్లు భారీగా నష్టపోయాయి. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు కూడా భారీగా పడిపోయాయి. సోమవారం ట్రేడింగ్ ప్రారంభం నుంచే పతనం దిశగా కొనసాగుతున్న సెన్సెక్స్, నిఫ్టీ భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి.  సౌదీ అరేబియా ఉత్పత్తి పెంచాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలియడంతో  అంతర్జాతీయ మార్కెట్లో 30 శాతానికి పైగా  చమురు ధరలు పడిపోయాయి.   1990లో గల్ఫ్‌ యుద్ధం తర్వాత ఒకరోజులో ఆయిల్‌ ధరలు భారీగా పడిపోవడం ఇదే తొలిసారి. తమ దేశంలో చమురు ఉత్పత్తి పెంచి.. తక్కువ ధరకు మార్కెట్లో విక్రయించాలని రియాద్‌ తీవ్ర ధరల పోరుకు సిద్ధమవడంతో సోమవారం అంతర్జాతీయ మార్కెట్లో బ్యారల్‌ ముడి చమురు అత్యల్పంగా 31.02డాలర్ల స్థాయికి పడిపోయింది.   ఓపెక్‌ దేశాలకు నేతృత్వం వహిస్తున్న సౌదీ అరేబియా, రష్యా దేశాలు చమురు ఉత్పత్తిపై ఒక అవగాహనకు రాలేకపోయాయి. దీంతో ఆగ్రహించిన సౌదీ ఉత్పత్తిని భారీ స్థాయిలో పెంచి..మంచి డిస్కౌంట్లతో తక్కువ ధరకే ముడిచమురును విక్రయించాలని నిర్ణయం తీసుకుంది. ఉత్పత్తిలో కోత విధించే ముందు   చమురు డిమాండ్‌పై కరోనా వైరస్‌ పూర్తి ప్రభావాన్ని అంచనా వేయాలని తాము భావిస్తున్నట్లు రష్యా పేర్కొంది.  చమురు ధర బ్యారల్‌కు 43 డాలర్ల కన్నా తగ్గితే రష్యా కూడా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.  ప్రపంచంలో అతిపెద్ద చమురు వినియోగ దేశాలైన భారత్‌, చైనాలకు ఇది ఆయిల్‌ బొనాంజా అని విశ్లేషకులు అంటున్నారు. వచ్చే నెల నుంచి 10 మిలియన్‌ బ్యారల్‌కు పైగా ముడిచమురును ఉత్పత్తి చేయాలని సౌదీ లక్ష్యంగా పెట్టుకోవడంతో ఇది ఈ రెండు దేశాలకు ఉపయోగకరమని భావిస్తున్నారు. సోమవారం స్టాక్‌ మార్కెట్ల పతనంతో ఆరున్నర లక్షల కోట్ల సంపద హరించుకపోయింది. 

Related Posts