YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం దేశీయం

73కు చేరిన కరోనా కేసులు

73కు చేరిన కరోనా కేసులు

73కు చేరిన కరోనా కేసులు
న్యూఢిల్లీ, మార్చి 12
కరోనా వైరస్‌ను ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) మహమ్మారిగా ప్రకటించడంతో వివిధ దేశాలు మరింత అప్రమత్తమయ్యాయి. దేశంలోనూ కోవిడ్ కేసులు పెరగడం ఆందోళనకు గురిచేస్తోంది.దేశంలో ఇప్పటివరకు మొత్తం 10.57 లక్షల మంది ప్రయాణికులకు స్క్రీనింగ్‌ నిర్వహించామని తెలియజేశారు. అసాధారణ పరిస్థితులకు అసాధారణ ప్రతిస్పందన అవసరమని ఆయన వ్యాఖ్యానించారు. ఇలాంటి సమయంలో ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని, ఇది సురక్షితం కాదని అన్నారు.గత రెండు వారాలుగా దేశంలో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. వీటిలో కేరళలోనే అత్యధికంగా 17 వరకు కేసులు నమోదయ్యాయి. తాజాగా ముంబయిలో తొలిసారిగా రెండు కరోనా కేసులు నిర్ధారణ అయినట్లు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే ట్విటర్‌లో వెల్లడించారు. దీంతో మహారాష్ట్ర వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 11కి చేరింది. పుణెలో ఎనిమిది, ముంబయిలో ఇద్దరు, నాగ్‌పూర్‌లో ఒకరికి కరోనా ఉన్నట్లు తేలింది. ఉత్తరప్రదేశ్‌లో కరోనా కేసుల సంఖ్య 9కి చేరింది.ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 114దేశాల్లో వ్యాపించిన ఈ వైరస్‌ను ప్రపంచ మహమ్మారిగా డబ్ల్యూహెచ్‌ఓ ప్రకటించింది. కరోనా వైరస్‌ తీవ్రత దృష్ట్యా భారత ప్రభుత్వం ఏప్రిల్ 15 వరకు పర్యాటక వీసాలన్నీ రద్దు చేసింది. మార్చి 13నుంచి మొదలయ్యే ప్రయాణాలకు ఇది వర్తిస్తుందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. పార్లమెంట్ సభ్యులు తమ నియోజకవర్గాల్లోని ప్రజలను చైతన్యం చేయాలని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్దన్ కోరారు. పెద్ద సంఖ్యలో ఒకేచోట గుమిగూడి ఉండకుండా సూచనలు చేసి, ప్రభుత్వానికి సహకరించాలని ఆయన అభ్యర్థించారు. ఇరాన్‌లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి రప్పించే ప్రక్రియ కొనసాగుతోందని ఈ సందర్భంగా కేంద్ర మంత్రి తెలిపారు.

Related Posts