YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం తెలంగాణ

కరోనా పేషంట్ ట్రీట్ మెంట్ చేసిన నర్సుకు లక్షణాలు

కరోనా పేషంట్ ట్రీట్ మెంట్ చేసిన నర్సుకు లక్షణాలు

కరోనా పేషంట్ ట్రీట్ మెంట్ చేసిన నర్సుకు లక్షణాలు
హైద్రాబాద్, మార్చి 13 
కర్ణాటకకు చెందిన 76 ఏళ్ల వృద్ధుడు కరోనా వైరస్ కారణంగా మరణించిన సంగతి తెలిసిందే. దేశంలో తొలి కరోనా మరణం ఇదే కావడం గమనార్హం. ఉత్తర కర్ణాటకలోని కలబుర్గికి చెందిన ఆయన మార్చి 10న కరోనా లక్షణాలతో చనిపోయారు. ఆయనకు కోవిడ్ సోకినట్లు చనిపోయిన తర్వాత నిర్ధారించారు. హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని కేర్ హాస్పిటల్లో చికిత్స పొందిన ఆయన.. డిశ్చార్జి అయిన కాసేపటికే చనిపోయారు. అంతకు ముందు నగరంలోని మరో రెండు హాస్పిటళ్లు ఆయన్ను అడ్మిట్ చేసుకోవడానికి నిరాకరించాయి. చివరకు కేర్‌కు తీసుకురాగా... మూడు గంటలపాటు ఐసీయూలో ఉంచి చికిత్స అందించారు. అనంతరం గాంధీ హాస్పిటల్‌కు తీసుకెళ్లాలని కేర్ హాస్పిటల్ సిబ్బంది సూచించగా.. ఆయన బంధువులు కలబుర్గికి తీసుకెళ్లారు. కాగా కేర్ హాస్పిటల్ నుంచి అంబులెన్స్ బయల్దేరిన గంటకే ఆ పేషెంట్ చనిపోయాడని సమాచారం.‘కలబుర్గికి చెందిన వృద్ధుడు జనవరి 29న సౌదీ అరేబియాలోని మక్కా వెళ్లారు. ఫిబ్రవరి 29న హైదరాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఎయిర్‌పోర్టులో స్క్రీనింగ్ నిర్వహించగా ఆయనలో కరోనా లక్షణాలేవీ కనిపించలేదు. దీంతో హైదరాబాద్ నుంచి కలబుర్గి వెళ్లారు. మార్చి 5 నాటికి ఆయన అనారోగ్యానికి గురి కావడంతో కలబుర్గిలోని ఓ ప్రయివేట్ హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. మరుసటి రోజు ఆయన ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. కరోనా సోకిందనే అనుమానంతో ఆయన శాంపిళ్లను సేకరించి బెంగళూరు పంపారు. కారణలేంటో తెలీదు కానీ మార్చి 9న ఆయన్ను హైదరాబాద్‌ తీసుకొచ్చి కేర్ హాస్పిటల్‌లో చేర్పించారు.మరుసటి రోజు కేర్ నుంచి తీసుకెళ్తుండగా.. కలబుర్గి వెళ్లే దార్లోనే ఆయన చనిపోయారు. ఆయన కచ్చితంగా ఎప్పుడు, ఎక్కడ చనిపోయారనే వివరాలు తమ వద్ద లేవు’’ అని కర్ణాటక అధికారి ఒకరు తెలిపారు. బుధవారం మధ్యాహ్నం కలబుర్గిలో ఆయన అంత్యక్రియలు జరిగాయి. ఆయన శాంపిళ్లు బుధవారానికి గానీ బెంగళూరు ల్యాబ్‌కు చేరకపోవడం గమనార్హం.బంజారాహిల్స్‌లోని కేర్ హాస్పిటల్ ఆయన్ను మూడు గంటలపాటు ఐసీయూలో ఉంచిందని.. తర్వాత గాంధీ హాస్పిటల్‌కు తీసుకెళ్లాలని సూచించిందని కర్ణాటక ప్రభుత్వం తెలిపింది. కలబుర్గిలో చనిపోయిన వృద్ధుడికి కరోనా పాజిటివ్ అని తేలిందని కర్ణాటక ప్రభుత్వం గురువారం నిర్ధారించింది.‘‘శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిపడుతున్న కరోనా అనుమానితుడు హాస్పిటల్‌కు వచ్చాడు. ఐసోలేషన్‌లో ఉంచిన తర్వాత కరోనా చికిత్స అందిస్తున్న గాంధీ హాస్పిటల్‌కు తరలించాలని ఆయన్ను తీసుకొచ్చిన వారికి సూచించాం. కానీ ఆయన కుటుంబ సభ్యులు మా సూచనకు విరుద్ధంగా కలబుర్గి తీసుకెళ్లారు. అక్కడ ఆయన చనిపోయారు’’ అని కేర్ హాస్పిటల్‌ వర్గాలు వెల్లడించాయి.కేర్ హాస్పిటల్లో కరోనా పేషెంట్‌ను పర్యవేక్షించిన నర్సును ఐసోలేషన్ వార్డులో ఉంచారు. ఈ కేసు గురించి తాము ఆరోగ్య శాఖకు సమాచారం అందిచామని కేర్ వర్గాలు తెలిపాయి. ఈ కేసుకు సంబంధించిన మరింత సమాచారం కోసం తెలంగాణ ప్రభుత్వం కర్ణాటకనను సంపద్రించింది. కేర్ హాస్పిటల్‌ను సందర్శించిన ఆరోగ్యశాఖ అధికారులు అక్కడి పరిస్థితిని సమీక్షించారు

Related Posts