YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం తెలంగాణ దేశీయం

సాఫ్ట్ వేర్ ఎంప్లాయిస్ కు కొత్త తిప్పలు

సాఫ్ట్ వేర్ ఎంప్లాయిస్ కు కొత్త తిప్పలు

సాఫ్ట్ వేర్ ఎంప్లాయిస్ కు కొత్త తిప్పలు
హైద్రాబాద్, మార్చి 14
కరోనా పేరు వింటే చాలు ప్రపంచ దేశాలు వణికిపోతున్నయ్‌‌‌‌. వైరస్‌‌‌‌ కట్టడిని గట్టి చర్యలు తీసుకుంటున్నయ్‌‌‌‌. కొన్ని దేశాలైతే విదేశీయులను పూర్తిగా నిషేధించాయి‌‌‌‌. చాలా దేశాలు కరోనా లేదని సర్టిఫికెట్‌‌‌‌ ఉంటనే తమ దేశంలోకి అనుమతిస్తామంటూ ఆంక్షలు పెడుతున్నాయి. దీంతో విదేశాల్లో పనిచేసే సాఫ్ట్‌‌‌‌వేర్‌‌‌‌ ఇంజినీర్లు, వివిధ ఉద్యోగాలు చేసేవారు, వర్క్‌‌‌‌ పర్మిట్‌‌‌‌ హోల్డర్లు కరోనా ఫ్రీ సర్టిఫికెట్‌‌‌‌ కోసం గాంధీకి క్యూ కడుతున్నరు. ఎవరికైనా ట్రావెల్‌‌‌‌ హిస్టరీ ఉండి.. వ్రమైన జ్వరం, జలుబు, ఒంటి నొప్పులు తదితర అనుమానిత లక్షణాలు ఉంటే గాంధీలో వెంటనే శాంపిల్స్‌‌‌‌ తీసుకొని టెస్టులు చేసి, కొవిడ్‌‌‌‌-19 ఉంటే వార్డుల్లో పెట్టి చికిత్స అందిస్తున్నరు. వైరస్ లేదంటే నెగిటివ్ రిపోర్టు ఇస్తున్నారు. అయితే  కొందరు టెస్టులు చేసి తమకు కరోనా లేదని సర్టిఫికెట్లు ఇవ్వాలని అడుతున్నారని.. ఇది సాధ్యం కాదని గాంధీ డాక్టర్లు చెబుతున్నారు. వేల మందికి టెస్ట్‌‌‌‌ చేయలేమని వారు చేతులెత్తేస్తున్నారు.వైరస్‌‌‌‌ సోకిందేమో అనే అనుమానంతో వచ్చేవారి సంఖ్య పెరిగిపోతుండడంతో టెస్ట్‌‌‌‌ల విషయంలో సర్కారు కొంత వెసులుబాటు కల్పించి. ట్రావెల్ హిస్టరీ, అనుమానిత లక్షణాలు ఉన్న వారు ప్రైవేట్ హాస్పిటల్‌‌‌‌ వెళ్లి తమ శాంపుల్స్‌‌‌‌ ఇవ్వవచ్చని పేర్కొంది. ఆ హాస్పిటళ్లు శాంపుల్స్‌‌‌‌ను గాంధీ ఆసుపత్రికి పంపించి అక్కడి నుంచి టెస్ట్‌‌‌‌ల రిపోర్టు పొందవచ్చు. విదేశాలకు వెళ్లడానికై కరోనా ఫ్రీ సర్టిఫికెట్ తప్పనిసరి కావడంతో కొందరు తాము ఫారిన్ ట్రావెల్ చేసి వచ్చామని ప్రైవేట్ ఆసుపత్రి వర్గాలను నమ్మించి, ఆ తర్వాత గాంధీ ఆసుపత్రి నుంచి కరోనా ఫ్రీ సర్టిఫికెట్లు తీసుకెళ్తున్నట్లు సమాచారం. కరోనా పాజిటివ్‌‌‌‌ వచ్చిన మహేంద్రహిల్స్ యువకుడి కుటుంబసభ్యులు తిరిగి కాలనీలోకి రావడంపై  స్థానికులు కొంత ఆందోళన చెందారు. వీరు కొవిడ్‌‌‌‌-19 నెగిటివ్ రిపోర్డులను తీసుకెళ్లడంతో ఊపిరి పీల్చుకున్నారు.కొవిడ్‌‌‌‌ భయంతో చాలా మంది సాధారణ జలుబు, దగ్గు ఉన్నా కరోనా పరీక్షల కోసం గాంధీ దవాఖానా బాట పడుతున్నారు. ఇలా పెద్ద సంఖ్యలో టెస్ట్‌‌‌‌ల కోసం వస్తుండడంతో గాంధీ వైద్య సిబ్బందికి పని భారం పెరుగుతోంది. దీంతో గాంధీ మెయిన్ ఎంట్రన్స్‌‌‌‌లో ఏర్పాటు చేసిన హెల్ప్‌‌‌‌డెస్క్ వద్దనే వడపోత చేపడుతున్నారు. కరోనా అనుమానితులను ప్రాథమిక పరీక్షలు చేశాక, అవసరమైతేనే ఐసోలేషన్ వార్డులకు తరలిస్తున్నారు. మిగిలిన వారికి కౌన్సిలింగ్ ఇచ్చి పంపుతున్నారు. అలాగే కరోనా మెడికల్ రిపోర్టు వచ్చేవరకు ఇక్కడే ఉండడానికి ఇష్టపడని వారిని ఇంటి వద్దనే హోమ్ ఐసోలేషన్‌‌‌‌లో ఉండాలని సూచించి, పంపిస్తున్నారు

Related Posts