YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం తెలంగాణ విదేశీయం

తెలంగాణ రాష్ట్రంలో మూడో కేసు

తెలంగాణ రాష్ట్రంలో మూడో కేసు

 

తెలంగాణ రాష్ట్రంలో మూడో కేసు
నెదర్లాండ్‌ నుంచి వచ్చిన రంగారెడ్డి జిల్లావాసికి వైరస్‌
హైదరాబాద్ మార్చి 16
తెలంగాణలో మూడో కరోనా (కొవిడ్‌ 19) కేసు నమోదైంది. నెదర్లాండ్‌ నుంచి 10 రోజుల కిందట రాష్ట్రానికి వచ్చిన రంగారెడ్డి జిల్లావాసి(48)లో కరోనాను నిర్ధారిస్తూ పుణె వైరాలజీ ప్రయోగశాల ఫలితాలను వెల్లడించింది. గాంధీ ఆసుపత్రిలో నిర్వహించిన పరీక్షల్లో ఇద్దరి నమూనాల్లో వైరస్‌ అనుమానిత లక్షణాలు వెల్లడవ్వడంతో.. నమూనాలను పుణేకు పంపించిన విషయం తెలిసిందే. ఆదివారం వెల్లడైన ఫలితాల్లో రంగారెడ్డి జిల్లా వాసిలో కరోనా ఉన్నట్లు తేలగా.. సౌదీ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన ఎయిర్‌ హోస్టెస్‌లో వైరస్‌ లేదని నిర్ధారించారు. దీంతో ఇప్పటివరకూ మూడు కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో తొలి కరోనా బాధితుడు దుబాయి నుంచి వచ్చిన యువకుడు కాగా, మలి బాధితురాలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన యువతి. తొలి బాధితుడు కోలుకొని ఇటీవల గాంధీ ఆసుపత్రి నుంచి ఇంటికెళ్లారు.    ప్రస్తుతం భద్రాద్రి, రంగారెడ్డి జిల్లాలకు చెందిన బాధితులిద్దరూ గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిద్దరి కుటుంబ సభ్యులనూ ఆసుపత్రిలో చేర్చి, విడి గదుల్లో ఉంచారు. దేశంలో తొలి కరోనా మృతుడి (కర్ణాటక వాసి)కి వైద్యసేవల్లో పాల్గొన్నట్లు గుర్తించిన రాష్ట్రానికి చెందిన 34 మందిలో.. ఇద్దరి నమూనాలను సేకరించి పరీక్షలకు పంపించినట్లు వైద్యవర్గాలు తెలిపాయి. వీరిని కూడా ఇంట్లోనే విడిగా ఉండాల్సిందిగా సూచించారు. ఆదివారం కరోనా అనుమానితులు 22 మంది కొత్తగా ఆసుపత్రుల్లో చేరగా.. వీరి నమూనాలను సేకరించి పరీక్షలకు పంపించారు. 28 నమూనాల ఫలితాలు వెల్లడవ్వాల్సి ఉంది. రాష్ట్రంలో కరోనా అనుమానిత లక్షణాలతో ఒక ఉన్నతాధికారిలోనూ నమూనాలు సేకరించినట్లు తెలిసింది.ఎవరెవరిని కలిశారు? కరోనా బాధిత కేసులు కొత్తగా రెండు నమోదవ్వడంతో.. ఆ ఇద్దరు గత 7-10 రోజుల్లో ఎవరెవరిని కలిశారనేది అత్యంత ప్రాధాన్యాంశంగా మారింది. ఇప్పటికే కరోనా నిర్ధారిత వ్యక్తి కుటుంబ సభ్యులను గాంధీలో చేర్చగా.. వీరికి తొలుత స్థానికంగా చికిత్స అందించిన వైద్యులు, వైద్యసేవల్లో పాల్గొన్న నర్సులు, ఇతర సహాయక సిబ్బంది, ఇరుగు పొరుగున సన్నిహితంగా మెలిగినవారు, బస్సులు, ఆటోల్లో ఎవరెవరితో కలిసి ఉంటారనే అంశాలపై ఆరోగ్యశాఖ దృష్టి సారించింది. ఇప్పటివరకూ కరోనా బాధితులందరూ విదేశాల నుంచి వచ్చినవారే. సాధ్యమైనంత వేగంగా వైరస్‌ అనుమానితులను బహిరంగ ప్రదేశాల్లో తిరగకుండా చేయగలిగితే.. రాష్ట్రంలో దీని వ్యాప్తిని అడ్డుకున్నట్లు అవుతుందని వైద్యశాఖ భావిస్తోంది

Related Posts