YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం తెలంగాణ

కరోనా క్వారంటైన్ కేంద్రంగా గచ్చిబౌలి స్టేడియం

కరోనా క్వారంటైన్ కేంద్రంగా గచ్చిబౌలి స్టేడియం

కరోనా క్వారంటైన్ కేంద్రంగా గచ్చిబౌలి స్టేడియం
హైదరాబాద్ మార్చి 16
కరోనా వ్యాధి నివారణ చర్యల్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గచ్చిబౌలి స్టేడియంను క్వారం టైన్  కేంద్రంగా మార్చేందుకు ఏర్పాట్లు చేపట్టింది. గచ్చిబౌలి స్టేడియంలోని అథ్లెటిక్ క్రీడా ప్రాంగణంలో గల పరిపాలన విభాగంతో పాటు అందుబాటులో ఉన్న గదులను ఆధీనంలోకి తీసుకుని వైరస్ నివారణ వార్డుల కింద తీర్చిదిద్దేందుకు ఏర్పాట్లు చేపట్టారు. గచ్చిబౌలిలోని స్టేడియంను 50 పడకల క్వారంటైన్ కేంద్రంగా తీర్చిదిద్దేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. వైద్య ఆరోగ్య శాఖ అధికారుల తో పాటు జిహెచ్ఎంసీ అధికారులు స్టేడియంను పరిశీలించారు. శేరిలింగంపల్లి సర్కిల్ 11 పారిశుద్ధ్య విభాగం సిబ్బంది స్టేడియంలో పారిశుద్ధ్య పనులు చేపట్టారు. రెండు రోజుల్లో పూర్తి స్థాయిలో గచ్చిబౌలి స్టేడియంను క్వారంటైన్ కేంద్రంగా ఏర్పాటు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 

Related Posts