YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విద్య-ఉపాధి తెలంగాణ

ఐదు నిమిషాలైన పరీక్షకు అనుమతి

ఐదు నిమిషాలైన పరీక్షకు అనుమతి

ఐదు నిమిషాలైన పరీక్షకు అనుమతి
టెన్త్ పరీక్షలకు అంతా సిద్ధం
హైద్రాబాద్, మార్చి 18
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ కలెక్టక్ కీలక నిర్ణయం తీసుకున్నారు. పరీక్షలకు ఐదు నిమిషాలు ఆలస్యం అయినా కూడా అనుమతి ఇస్తామంటూ విద్యార్థులకు శుభవార్త చెప్పారు. రేపట్నుంచి ఉదయం 9:30 గంటలకు టెన్త్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. దీంతో ఇప్పటివరకు విద్యార్థులు ఓ అరగంట ముందే పరీక్షా కేంద్రాలకు రావాల్సి ఉంటుంది. అయితే కరోనా వైరస్ వ్యాపిస్తున్న నేపథ్యంలో అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఓ ఐదు నిమిషాలు ఆలస్యం అయినా కూడా పరీక్షా హాల్‌లోకి అనుమతి ఇవ్వాలని నిర్ణయించారు. విద్యార్థులు ముందుగా పరీక్షా కేంద్రంలోకే రావాలన్నారు. గుంపులు, గుంపులుగా రావొద్దని కోరారు. విద్యార్థులు ప్రొటక్షన్ మాస్క్ కూడా ధరిస్తే మంచిదని కలెక్టర్ ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు.తెలంగాణ వ్యాప్తంగా మార్చి 19 నుంచి ఏప్రిల్ 6 వరకు సుమారు 2,530 కేంద్రాల్లో పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. సుమారు 5,34,903 మంది విద్యార్థులు ఈ ఎగ్జామ్స్‌కు హాజరు కానున్నారు. ఇక అటు పరీక్షల నిర్వహణలో 30,500 మంది ఇన్విజిలేటర్లుగా బాధ్యతలు నిర్వర్తించనుండగా.. మాస్ కాపీయింగ్ జరగకుండా ఉండేందుకు 144 సిట్టింగ్‌ స్క్వాడ్స్, 4 ఫ్లైయింగ్ స్క్వాడ్లను ప్రభుత్వం ఏర్పాటు చేశారు.తెలుగు రాష్ట్రాల్లో కోవిడ్ 19 పంజా విసురుతున్న నేపథ్యంలో అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఇప్పటికే తెలంగాణలో ఇప్పటికే ఐదు పాజిటివ్ కేసులు నమోదు కావడంతో... తెలంగాణ యంత్రాంగం అప్రమత్తం అయ్యింది. ఎక్కడికక్కడ కరోనా వ్యాప్తి చెందకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. పరీక్షలకు మినహాయింపు ఇచ్చి... విద్యాసంస్థలన్నీ మూసివేశారు. సినిమా హాల్స్, షాపింగ్ మాల్స్, పార్కులు బంద్ చేశారు

Related Posts