YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం ఆరోగ్యం దేశీయం

. మూతపడ్డ 5 లక్షల రెస్టారెంట్స్

. మూతపడ్డ 5 లక్షల రెస్టారెంట్స్

. మూతపడ్డ 5 లక్షల రెస్టారెంట్స్
ముంబై, మార్చి 18
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ పంజా విసురుతున్న నేపథ్యంలో నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(NRAI) కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా కట్టడిలో భాగంగా తమ ఆధీనంలో ఉన్న 5 లక్షల రెస్టారెంట్లను మూసివేయాలని ఆదేశించింది. రెస్టారెంట్లతో పాటు బార్లు, పబ్ లు, కేఫ్ లను మార్చి 18వ తేదీ నుంచి మార్చి 31వ తేదీ వరకు మూసివేయాలంది.. అయితే రెస్టారెంట్లు మూసివేయాలనే ఆదేశాలు తప్పనిసరి కాదని, రెస్టారెంట్లు మూసివేయడం అనేది యాజమాన్యాల ఇష్టమని స్పష్టం చేసింది. మంగళవారం చాప్టర్ మెంబర్స్ తో మాట్లాడిన తర్వాత అసోసియేషన్ పెద్దలు ఈ నిర్ణయం తీసుకున్నారు. కరోనా కట్టడిలో భాగంగా పలు రాష్ట్రాల్లో మాల్స్, థియేటర్లు, విద్యా సంస్థలు మూసివేసిన సంగతి తెలిసిందే. 'దేశం అంతటా అన్ని రెస్టారెంట్లను మూసివేయమని సభ్యులకు సలహా ఇచ్చే నిర్ణయం తీసుకున్నాము, కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తోంది. చాలామంది ఉద్యోగులను అపాయంలో పడేస్తున్నాము, ఏదైనా ప్రాణాంతకం జరిగితే ఎప్పటికీ ఆ అపరాధం నుండి బయటపడలేము, ముందు జాగ్రత్తగానే ఈ నిర్ణయం తీసుకున్నాము'' అని ఎన్ఆర్ఏఐ ప్రెసిడెంట్ అనురాగ్ అన్నారు. మేనేజింగ్ కమిటీ, ఎన్ఆర్ఏఐ చాప్టర్స్ సభ్యులతో చర్చించిన తర్వాత ఈ నిర్ణయానికి వచ్చామన్నారు. ఎన్ఆర్ఏఐ సూచనతో త్వరలోనే వేల సంఖ్యలో రెస్టారెంట్లు మూతపడొచ్చని అనురాగ్ అంచనా వేశారు. పలు రాష్ట్రాల్లో ప్రభుత్వ ఆదేశాలతో మాల్స్ మూసివేయబడ్డాయని, దాంతో పలు రెస్టారెంట్లు తమ ఔట్ లెట్లు ఇప్పటికే బంద్ చేశాయని అనురాగ్ తెలిపారు. NRAI అదేశాలను పాటిస్తామని, మార్చి 31వ తేదీ వరకు తమ ఔట్ లెట్లు మూసివేస్తామని  రెస్టారెంట్ల ఎండీ ప్రియాంక తెలిపారు. కరోనా వైరస్ వ్యాప్తికి రెస్టారెంట్లు కేంద్రాలు కాదని చెప్పలేమన్నారు. కొన్ని సమయాల్లో వ్యాపారం, లాభాలకన్నా కస్టమర్లు, ఉద్యోగులు, సిబ్బంది యోగక్షేమాలే తమకు ముఖ్యమని ప్రియాంక స్పష్టం చేశారు. వైరస్ పోయిన తర్వాత మళ్లీ రెట్టించిన ఉత్సాహంతో రెస్టారెంట్లు రీ ఓపెన్ చేస్తామన్నారు.కాగా, భారత్ లో డొమినోస్ పిజ్జా  రన్ చేసే జుబిలంట్ ఫుడ్  వర్స్ లిమిటెడ్ మాత్రం తమ రెస్టారెంట్లు మూసివేయమని, యథావిథిగా కొనసాగుతాయని ప్రకటించింది.కరోనా వైరస్ పంజా విసుర్తున్న నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కీలక నిర్ణయాలు తీసుకున్నాయి. కరోనా కట్టడిలో భాగంగా విద్యా సంస్థలు మూసివేశాయి. మాల్స్, థియేటర్లు, స్విమ్మింగ్ పూల్స్, కోచింగ్ సెంటర్లు మార్చి 31వరకు మూసేశాయి. వ్యాపారాలతో పాటు ఆర్థిక వ్యవస్థపై కరోనా తీవ్ర ప్రభావం చూపింది.

Related Posts