YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం దేశీయం

కరోనా విజృంభన

కరోనా విజృంభన

కరోనా విజృంభన
న్యూఢిల్లీ, మార్చి 18
చైనాలో విజృంభించిన కరోనా వైరస్ ప్రపంచ దేశాలకు వ్యాపించింది. ఇప్పటి వరకు 165 దేశాలకు కరోనా వైరస్ విస్తరించింది. ప్రపంచ వ్యాప్తంగా లక్షా 98 వేల 426 మందికి కరోనా సోకగా, 7,987 మంది మృతి చెందారు. చైనాలో కరోనా మృతుల సంఖ్య 3,237కు చేరింది. ఇటలీలో 2,503 మంది, ఇరాన్లో 988, స్పెయిన్లో 533, ఫ్రాన్స్లో 175, అమెరికాలో 115, దక్షిణ కొరియాలో 84, యూకేలో 71, నెదర్లాండ్స్లో 43, జపాన్లో 29 మంది మృతి చెందారు. భారత్లో కరోనాతో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు,   ఇరాన్లో చిక్కుకున్న దాదాపు 254 మంది భారతీయులకు కరోనా పాజిటివ్ వచ్చినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు మంగళవారం రాత్రి కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటన విడుదల చేసింది. ఇరాన్లో ఆదివారానికి 13,938 మందికి కరోనా పాజిటివ్ అని తేలగా, 724 మంది మృతిచెందారు.  ఈ నేపథ్యంలో ఇరాన్కు వెళ్లిన జమ్మూ కశ్మీర్, లదాఖ్ ప్రాంతాలకు చెందిన 1,100 మంది యాత్రికుల బృందంలో 254 మందికి కరోనా వైరస్ సోకినట్లు సమాచారం. విదేశాల్లోని భారతీయుల యోగక్షేమాల కోసం హెల్ప్లైన్ నంబర్ కొత్తగా ఏర్పాటు చేసినట్లు కేంద్రం వెల్లడించింది.

Related Posts