YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విద్య-ఉపాధి ఆరోగ్యం ఆంధ్ర ప్రదేశ్

 అన్ని విద్యా సంస్థలకు సెలవులు

 అన్ని విద్యా సంస్థలకు సెలవులు

 అన్ని విద్యా సంస్థలకు సెలవులు
అమరావతి మార్చి 19      
కరోనా వ్యాప్తి చెందకుండా రాష్ట్రం లో ఉన్న అని విద్యాసంస్థలు మూసివేసాం. ఈ నెల 31 వరకు అన్ని సంస్థలు మూతబడి ఉంటాయని విద్యా శాఖ మంత్రి ఆదిములపు సురేష్ వెల్లడించారు. గురువారం అయన మీడియాతో మాట్లాడారు. స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్ మెంట్ పరిధిలోకి వచ్చే అన్ని సంస్థలకు సెలవులు ప్రకటించాం. హైయ్యార్ ఎడ్యుకేషన్ సంబంధించి అన్ని యూనివర్సిటీ లు, కాలేజీలు మూసివేస్తూ ఉత్తర్వులు జారీ చేసామని అన్నారు. ప్రవేట్ యూనివర్సిటీ లు, డీమ్డ్ యూనివర్సిటీ లు, రాష్ట్రంలో ఉన్న సెంట్రల్ సంస్థలు ఈ ఉత్తర్వులు పాటించాలి. పరీక్షలు రాస్తున్న పిల్లలకు రెసిడెన్షియల్ స్కూల్ లు తెరిచి ఉంటాయి. ఇంటర్, పదవ తరగతి పరీక్షలు షెడ్యుల్ యదావిధిగా కొనసాగుతాయి. ఎగ్జామ్ లో సీటింగ్ కూడా ప్రత్యేక ఆదేశాలు జారీ అయ్యాయని మంత్రి వెల్లడించారు.

Related Posts