YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విద్య-ఉపాధి ఆరోగ్యం తెలంగాణ

ఖాళీగా మారిపోతున్న వైద్యవిద్య శాఖ

ఖాళీగా మారిపోతున్న వైద్యవిద్య శాఖ

ఖాళీగా మారిపోతున్న వైద్యవిద్య శాఖ
నిజామాబాద్, మార్చి 20
వైద్యఆరోగ్యశాఖలో డాక్టర్లు, సిబ్బంది కొరత వేధిస్తోంది. ఈ ప్రభావం రోగులపై పడుతోంది. ఆస్పత్రులకు వస్తే వారి ఆరోగ్యానికి భరోసా లేకుండా పోతోంది. పెద్ద రోగమొస్తే ప్రాణాలపై ఆశలు వదులుకోవాల్సిన దుస్థితి నెలకొంది. వైద్యుల పోస్టులు మొదలుకుని వార్డు బారుదాకా పోస్టులు ఏండ్ల తరబడి ఖాళీగా ఉండటమే ఇందుక్కారణం. ప్రజలకు వైద్యసేవలు భారం కాకుండా ప్రభుత్వాస్పత్రుల్లోనే మెరుగైన వైద్యం అందించాలనే లక్ష్యంతో పలు కార్యక్రమాలు చేపడుతున్న సర్కారు అందుకు అనుగుణంగా పోస్టులను మాత్రం భర్తీ చేయడంలేదు. నోటిఫికేషన్లతో సరిపెడుతూ నెలల తరబడి నాన్చుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ శాఖలో మొత్తం 37,141 పోస్టులు ఉండగా, 11,125 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 26,016 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వాస్తవానికి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రాష్ట్రంలోని అన్ని ఆస్పత్రుల దాక 24 గంటలపాటు సవ్యంగా పనిచేయాలంటే.. ఇప్పటికే ఉన్న ఖాళీలను భర్తీ చేయడంతోపాటు కొత్తగా మరో 12,353 పోస్టులను మంజూరు చేయాలని గతంలో అధికారులు నివేదిక రూపొందించారు. ఇందులో భాగంగా ప్రభుత్వం 10,718 పోస్టులను ఇప్పటికే మంజూరు చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా పలు ఆస్పత్రుల్లో ఐసీయూ యూనిట్లతోపాటు 40 డయాలసిస్‌ కేంద్రాల ఏర్పాటు జరుగుతోంది. కేసీఆర్‌ కిట్ల పథకంతో ప్రభుత్వాస్పత్రుల్లో రోగుల సంఖ్య భారీగా పెరుగుతోందని అధికారులు ప్రకటిస్తున్నారు. చాలా ఆస్పత్రుల్లో రోగుల సంఖ్య పెరిగినా.. తదనుగుణంగా నిపుణులైన వైద్యులు అందుబాటులో లేరరని, దాంతో తమపై పని ఒత్తిడి పెరిగిందని వైద్య సిబ్బంది పేర్కొంటున్నారు. కాగా, 2,118 పోస్టుల భర్తీకి 13.07.2016న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే, 660 పోస్టుల భర్తీకి 18.05.2017న ఉత్తర్వులు ఇచ్చింది. కానీ, అడుగు ముందుకు పడలేదు. ఇక తెలంగాణ హెల్త్‌ యూనివర్సిటీ ఏర్పాటై రెండేండ్లు గడుస్తున్నా.. వీసీ, రిజిస్ట్రార్‌ మినహా మిగతా పోస్టులు భర్తీ చేయలేదు. దీంతో యూనివర్సిటీ పూర్తి స్థాయిలో పనిచేయలేని పరిస్థితి నెలకొంది. ఏండ్లు గడుస్తున్న వర్సిటీ పూర్తిస్థాయిలో పరిపాలన జరగడంలేదు. ఉన్నతాధికారులు సైతం పోస్టుల భర్తీ విషయాన్ని పట్టించుకోవడంలేదు. రాష్ట్రంలో వైద్యవిద్య నిర్వహణలో కీలకమైన వర్సిటీపై ఆ శాఖ మంత్రి లక్ష్మారెడ్డి దృష్టిసారించకపోవడం వల్లే పోస్టుల భర్తీ ప్రక్రియ వెనుకబడిందనే విమర్శలు ఉన్నాయి. వర్సిటీ నిర్వహణకు అవసరమైన 82 పోస్టులను శాశ్వత ప్రాతిపదికన, 22 పోస్టులను తాత్కాలిక పద్ధతిలో భర్తీ చేసేందుకు అనుమతిస్తూ గతంలో ఉత్తర్వులు జారీ చేసినా ఫలితం లేదు. అలాగే, వైద్యశాఖలో ఇతర వర్సిటీల్లో పనిచేస్తున్న 21 మందిని డిప్యూటేషన్‌పై నియమించారు. దీంతో 61 పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. రాష్ట్రంలో ఆహార కల్తీని నిర్మూలించేందుకు 23 పోస్టులను ప్రభుత్వం మంజూరు చేసినా నియామకాలు జరగలేదు. ఎంఎన్‌జే క్యాన్సర్‌ ఆస్పత్రికి 251 పోస్టులను మంజూరు చేసిన అతీగతీలేదు. నిమ్స్‌ విస్తరణ కోసం మంజూరు చేసిన 1,472 పోస్టుల భర్తీ కూడా జరగలేదు. బీబీనగర్‌లోని నిమ్స్‌లోనూ ఓపీ సేవలను ప్రారంభించినా.. అక్కడ పనిచేయడానికి వై ద్యులు, ఇతర సిబ్బంది లేరు. రోజూ నిమ్స్‌ నుంచి వైద్యులు బీబీనగర్‌కు వెళ్లి సేవలందిస్తున్నారు. వైద్యవిద్య, డైరెక్టర్‌ ఆఫ్‌ హెల్త్‌, వైద్యవిధాన పరిషత్‌ విభాగాల్లో మొత్తం 8,890 పోస్టులు మంజూరైన ఒక్కటంటే ఒక్క పోస్టు కూడా భర్తీకి నోచుకోలేదు. రాష్ట్రంలో మెడికల్‌ కళాశాల్లో భారీగా ఖాళీలు ఉన్నాయి. మొత్తం 1,535 పోస్టుల్లో ప్రొఫెసర్లు 111, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు 58, అసోసియేట్‌ ప్రొఫెసర్లు 206 , మొత్తం 375  ఖాళీగా ఉన్నట్టు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. అలాగే, వైద్యవిద్య డైరెక్టర్‌ పరిధిలో మొత్తం సిబ్బంది 3,387 మంది ఉండాల్సి ఉండగా 1,482 ఖాళీలు ఉన్నాయి. ప్రజారోగ్యం, కుటుంబ సంక్షేమ డైరెక్టర్‌ పరిధిలో మొత్తం 6,662 మంది సిబ్బందిగాను 2,659 ఖాళీలు ఉన్నాయి. వైద్యవిధాన పరిషత్‌ పరిధిలో 2961 సిబ్బందికిగాను 1,055 ఖాళీగా దర్శనమిస్తున్నాయి.

Related Posts