YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆరోగ్యం తెలంగాణ

 శనివారం కరీం నగర్ కి సీఎం కేసీఆర్

 శనివారం కరీం నగర్ కి సీఎం కేసీఆర్

 శనివారం కరీం నగర్ కి సీఎం కేసీఆర్
హైదరాబాద్, మార్చి 20
కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి తీసుకుంటున్న చర్యలను స్వయంగా పర్యవేక్షించేందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శనివారం కరీనంగర్ పట్టణంలో పర్యటించనున్నారు. ఇండోనేషియా నుంచి కరీంనగర్ నుంచి వచ్చిన కొంత మందికి కరోనా వైరస్ సోకినట్లు తేలిన విషయం తెలిసిందే. దాంతో  అధికార యంత్రాంగం  అప్రమత్తమయింది.  పట్టణంలో వైరస్ వ్యాప్తి నిరోధానికి ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. ముఖ్యమంత్రి కూడా అక్కడి పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ పలు సూచనలు చేస్తూ వచ్చారు. ఇండోనేషియా నుంచి వచ్చిన వారికి తప్ప, స్థానికులెవరికీ వ్యాధి సోకకుండా అధికార యంత్రాంగం చేపట్టిన చర్యలు మంచి ఫలితాలు ఇచ్చాయి.   కరీంనగర్ లో పరిస్థితిని స్వయంగా పరిశీలించి, పర్యవేక్షించేందుకు శుక్రవారమే ముఖ్యమంత్రి కేసీఆర్ కరీంనరగ్ లో పర్యటించాలని భావించారు.  కానీ శుక్రవారం ప్రధానమంత్రి వీడియో కాన్ఫరెన్స్ ఉండడంతో ఈ పర్యటన శనివారానికి వాయిదా పడింది.  సిఎంతో పాటు రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులు కూడా కరీంనగర్ లో పర్యటిస్తారు.  అక్కడే ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్షా సమావేశం కూడా నిర్వహిస్తారు.

Related Posts