YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం ఆంధ్ర ప్రదేశ్

మాస్కుల కోరత లేదు

మాస్కుల కోరత లేదు

మాస్కుల కోరత లేదు
అమరావతి మార్చి 20
కొవిడ్ -19(కరోనా) వైరస్ నిరోధక చర్యలపై చేసిన రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది.  విశాఖపట్నంలో ఒక కోవిడ్-19 పోజిటివ్  కేసు నమోదయ్యింది. ప్రకాశం,  నెల్లూరు జిల్లాల్లో కొవిడ్ -19 పాజిటివ్ బాధితులు కోలుకుంటున్నారని వైద్య ఆరోగ్యశాఖ  స్పెషల్ సిఎస్ డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి ప్రకటనలో పేర్కోన్నారు. సోషల్ మీడియాలో  వదంతుల్ని నమ్మొద్దు. కొవిడ్-19 వార్తల విషయంలో మీడియా బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. విదేశాల నుండి ఏపీకి తిరిగి వచ్చిన వారందరికీ స్వీయ గృహ నిర్బంధ నోటీసులు ఇస్తున్నాం. అతిక్రమిస్తే 'ఏపీ ఎపిడమిక్ డిసీజ్ కొవిడ్-19, 2020 ఐపిసి సెక్షన్ 188' ప్రకారం చట్టరీత్యా చర్యలు వుంటాయి. మాస్కులు , శానిటైజర్ల  కొరత లేదు. కొవిడ్-19 వైరస్ నియంత్రణకు యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నాంజ పూర్తి అప్రమత్తంగా ఉన్నాం. ఆందోళన పడొద్దని అయన అన్నారు.  కొవిడ్ -19 వైరస్ అనుమానితుల సమాచారాన్ని కంట్రోల్ రూం నంబరు ( 0866-2410978)కి తెలియజేయాలి. వెంటనే సమీప ప్రభుత్వాసుపత్రిని సంప్రదించాలి. వైద్య సలహాల కోసం 104 టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ కు ఫోన్ చేయాలి. కొవిడ్ -19 ప్రభావిత దేశాల నుండి రాష్ట్రానికొచ్చిన 966 మంది  ప్రయాణికుల్ని గుర్తించాం. 677 మంది ఇళ్లలోనే  వైద్యుల పరిశీలనలో ఉన్నారని అన్నారు. 258 మందికి 28 రోజుల పరిశీలన పూర్తయ్యింది. 31 మంది ఆసుపత్రిలో  వైద్యుల పరిశీలనలో ఉన్నారని అయన అన్నారు. 119 మంది నమూనాలను ల్యాబ్ కు పంపగా 104 మందికి నెగటివ్ వచ్చింది. 12 మంది శాంపిళ్లకు సంబంధించిన రిపోర్టులు రావాల్సి ఉంది. కొవిడ్-19 ప్రభావిత దేశాల  నుండి వచ్చిన ప్రయాణికులకు వ్యాధి లక్షణాలున్నా , లేకపోయినా 14రోజులపాటు ఇళ్లల్లోనే ఉండాలి. బయటికి వెళ్లకూడదు. కుటుంబ సభ్యులతోగానీ , ఇతరులతో గానీ కలవకూడదు. 108 వాహనంలోనే ఆసుపత్రికి వెళ్లాలి. ప్రతి జిల్లాలోని బోధన , జిల్లా ఆసుపత్రుల్లో ఐసోలేషన్ వార్డుల్ని ఏర్పాటు చేశామని అన్నారు.
====================

Related Posts