YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం తెలంగాణ

హైద్రాబాద్ లో కర్ఫ్యూ వాతావరణం

హైద్రాబాద్ లో కర్ఫ్యూ వాతావరణం

హైద్రాబాద్ లో కర్ఫ్యూ వాతావరణం
హైద్రాబాద్, మార్చి 21
కరోనా ప్రభావంతో ట్రాఫిక్ తగ్గడంతో గంటల ప్రయాణం నిమిషాల్లోకి చేరింది. నిత్యం ట్రాఫిక్‌తో కిక్కిరిసి పోయో ప్రాంతాల్లో ట్రాఫిక్ తగ్గడంతో గమ్యస్థానాలకు నిమిషాల్లో చేరుకుంటున్నా రు. అలాగే నిత్యం జనంతో కళకళలాడే పర్యాటక ప్రాం తాలు బోసిపోయాయి. జనసంద్రంలా ఉండే వ్యాపార కూడలిలు విరామం ప్రకటించినట్లు అగుపిస్తున్నాయి. గుంపులు గుంపులుగా ఉండే ప్రాంతాల్లో రద్దీ తగ్గింది. ట్రాఫిక్‌తో కిక్కిరిసిపోయో అనేక ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్ది తగ్గింది. ట్రాఫిక్ అధికంగా ఉండే సికింద్రాబాద్, నాంపల్లి, చార్మినార్, దిల్‌సుఖ్‌నగర్. ట్యాంక్‌బండ్, ఎస్‌ఆర్‌నగర్. హైటెక్‌సిటీతో పాటు రాష్ట్రంలోని అనేక పట్టణాల్లో ట్రాఫిక్ తగ్గింది. జాతీయ రహదారుల్లో వాహనాలు తగ్గాయి.కరోనా నేపథ్యంలో ట్రాఫిక్ గణనీయంగా తగ్గింది. ట్రాఫిక్‌తో నిత్యం సతమతమయ్యే హైటెక్‌సిటీ నుంచి వివిధ ప్రాంతాలకు ద్విచక్రవాహనాల్లో ప్రయాణిస్తే అయ్యే సమయాన్ని ట్రాఫిక్ సిబ్బంది అంచనావేసింది. హైటెక్‌సిటీ నుంచి బీరంగూడకు ఉన్న 17 కిలో మీటర్ల దూరాన్ని 36 నిమిషాల్లోను, హైటెక్‌సిటీ నుంచి కెపిహెచ్ కాలనీకి ఉన్న 8.3 కిలోమీటర్ల దూరా న్ని 15 నిమిషాలు. హైటెక్ సిటీ నుంచి ఎల్‌బినగర్‌కు ఉన్న 26 కిలోమీటర్ల దూరాన్ని 57 నిమిషాల్లో, హైటెక్‌సిటీ నుంచి 25 కిలో మీటర్ల దూరంలో ఉన్న ఉప్పల్‌కు 46 నిమిషాల్లో చోరుకుంటున్నట్లు ట్రాఫిక్ సిబ్బంది నివేది రూపొందించినట్లు తెలిసింది. అలాగే హైదరాబాద్‌లోని అనేక ప్రాంతాల్లో ట్రాఫిక్ తగ్గడంతో గతంలో గంట చేసే ప్రయాణాన్ని ప్రస్తుతం 25 నిమిషాల్లో ప్రయాణిస్తున్నట్లు తెలిసింది.సినిమాథియోటర్లు, విద్యాసంస్థలు బంద్ పాటించడంతో ప్రజల కదలికలు తగ్గాయి. వ్యక్తిగత పరిశుభత్రను పాటి స్తూ ప్రజలు ఇళ్లలోనే ఉంటున్నారు. కొన్ని ఇళ్ల ముందు కరోనా కారణంగా అనుమతిలేనిదే ఇంట్లోకి రాకూడదు అని బోర్డులు కూడా దర్శనిమిస్తున్నాయి. రాష్ట్ర ప్రజలు సిఎం కెసిఆర్ ఆదేశాలమేరకు అనేక జాగ్రతలు తీసుకుంటున్నారు. ప్రతిరోజు వేలాధి మంది పర్యాటకులు చార్మినార్‌పైకి వెళ్లి హైదరాబాద్ అందాలను తిలకించే వారు. అయితే కేంద్ర పురావస్తు శాఖ ఆదేశాలమేరకు చార్మినార్ పైకి పర్యాటకులను అనుమతించడంలేదు. అలాగే రాష్ట్ర పురావస్తు శాఖతో పాటు కేంద్ర పురావస్తు శాఖ ఆధీనంలోని చార్మినార్, గోల్కొండ, భవనగిరి కోట, వేయిస్థంబాల ఆలయం, బిర్లా సైన్స్ ప్లానిటోరియం తో పాటు వరంగల్ కోటలోకి పర్యాటకులను అనుమతించడంలేదు. అలాగే రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోని సుమారు 500ల పురావస్తు, పర్యాటకప్రాంతాల్లో పర్యాటకులను, ప్రజలను ప్రభుత్వం అనుమతించడంలేదు.

Related Posts