YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం తెలంగాణ

 టీ ఆర్టీసీ బస్సుల్లో శానిటైజర్స్

 టీ ఆర్టీసీ బస్సుల్లో శానిటైజర్స్

 టీ ఆర్టీసీ బస్సుల్లో శానిటైజర్స్
వరంగల్, మార్చి 21
కరోనా వైరస్ వ్యాపించకుండా ఉండటం కోసం ముందు జాగ్రత్తగా ప్రభుత్వం ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికులందరికీ హ్యాండ్ శానిటైజర్స్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రతి ఒక్క ప్రయాణికుడికి కండక్టర్ టికెట్ తో పాటు శానిటైజర్స్ ఇస్తున్నారు. రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ ఖమ్మంతోపాటు పలుచోట్ల ఉన్నఆర్టీసీ బస్సుల్లో శానిటైజర్లను పంపిణీ చేశారు. వాటిని చిన్న ప్లాస్టిక్ సీసాల్లో నింపి అన్ని బస్సుల్లో అందుబాటులో ఉంచారు. దీనితో పాటు దూర ప్రాంతాలకు వెళ్లే బస్సుల్లో డ్రైవర్ వెనుక భాగంలో 500 మిల్లీ లీటర్ల బాటిల్స్నుఏర్పాటు చేశారు. కండక్టర్ల దగ్గర కూడా శానిటైజర్స్ బాటిల్స్ ఉన్నాయి. వాష్ బేసిన్ల వద్ద లిక్విడ్, సబ్బులను ప్రయాణికులకు అందుబాటులో ఉంచారు. ప్రయాణికులు హ్యాండ్ వాష్ చేసుకుని బస్సులు ఎక్కాలని మైకుల ద్వారా ప్రచారమూ చేస్తున్నారు. బస్సు ఎక్కగానే ప్రయాణికులని శానిటైజర్ తో చేతులు శుభ్రం చేసుకున్నారా అనీ డ్రైవర్, కండక్టర్లు ప్రశ్నిస్తున్నారు. ఒకవేళ శుభ్రం చేసుకోకపోతే శానిటైజర్ ఇచ్చి మరి హ్యాండ్స్ వాష్ చేసుకోమని చెబుతున్నారు.కరోనా వైరస్ భయంతో ప్రజా రవాణాను నిలిపివేస్తే ఇబ్బందులు తప్పవు. అలా అని బస్సుల్లో  ప్రయాణించటం వల్ల కరోనా వ్యాప్తిచెందే అవకాశం ఉంటుంది. అందుకే బస్సుల్లో శానిటైజర్ల ఏర్పాటు. వీటిని సొంతంగా  తయారు చేస్తున్నారు. ఐఐటీ హైదరాబాద్ మెటీరియల్ సైన్స్ డిపార్టుమెంట్ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ ముద్రిక ఖండేల్ వాల్ ఆధ్వర్యంలో ఐసోప్రొఫైల్‌ ఆల్కహాల్, గ్లిజరిన్, డిస్టిల్డ్‌ వాటర్‌లతోపాటు శానిటైజర్లు తయారుచేసింది తెలంగాణ ఆర్టీసీ

Related Posts