YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆరోగ్యం తెలంగాణ

ఎమ్మెల్యే దంపతుల స్వీయ నియంత్రణ

ఎమ్మెల్యే దంపతుల స్వీయ నియంత్రణ

ఎమ్మెల్యే దంపతుల స్వీయ నియంత్రణ
ఆసిఫాబాద్, మార్చి 21,
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప దంపతులు , ఇటీవల అమెరికా పర్యటించి వచ్చారు. వారి  స్వీయ నియంత్రణ కోసం జిల్లా అధికారులు ఆదేశాలు జారీ చేశారు . కోవిడ్-19 నియంత్రణపై కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు ఇతర దేశాలకు వెళ్లి వచ్చిన వారు 14 రోజుల పాటు స్వీయ నియంత్రణ చేపట్టలని అధికారులు సూచించారు . అమెరికా పర్యటన నుంచి కోనప్ప దంపతులు ఈనెల 18న కాగజ్నగర్ కు వచ్చారు. అనంతరం ఆయన వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు . కరోనా ముందస్తు జాగ్రత్తల నేపథ్యంలో కోనప్ప దంపతులు 14 రోజుల పాటు స్వీయనియంత్రణలో భాగంగా ఇంట్లోనే ఉండాలని సీఎంవో కార్యాలయం సూచించింది . వీరితో పాటు వీరి కుటుంబ సభ్యులకు , ఎమ్మెల్యేను కలిసిన ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని ఆదేశించారు .

Related Posts