YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం ఆంధ్ర ప్రదేశ్

జనతా కర్ఫ్యూకు సంఘీభావం ప్రకటించాలి

జనతా కర్ఫ్యూకు సంఘీభావం ప్రకటించాలి

జనతా కర్ఫ్యూకు సంఘీభావం ప్రకటించాలి
  ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైయస్‌.జగన్మోహన్‌ రెడ్డి పిలుపు
అమరావతి, మార్చి 21
కోవిడ్‌ –19 (కరోనా వైరస్‌) వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన జనతా కర్ఫ్యూకు సంఘీభావం ప్రకటిద్దామని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైయస్‌.జగన్మోహన్‌ రెడ్డి పిలుపునిచ్చారు. మార్చి 22, ఆదివారం రోజున ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా జనతా కర్ఫ్యూను పాటించాలని, ఆ రోజు ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకూ ప్రజలెవ్వరూ కూడా ఇళ్ల నుంచి బయటకు రావొద్దని విజ్ఞప్తి చేశారు.అంతేకాదు ప్రధాన మంత్రి పిలుపు ఇచ్చినట్టుగా ఆదివారం సాయంత్రం 5 గంటల సమయంలో మీ మీ ఇళ్ల బాల్కనీల వద్దకు, ద్వారాల వద్దకు వచ్చి కరోనా వైరస్‌ వ్యాప్తి నివారణకు విశేషంగా సేవలందిస్తున్న సిబ్బందికి, ప్రజలకు ఎమర్జెన్సీ సర్వీసులు అందిస్తున్నవారికి మద్దతుగా 5 నిమిషాలసేపు నిలబడి చప్పట్లు కొడుతూ, గంటలు మోగిస్తూ వారికి మద్దతు తెలపాలి.దీనికి సంకేతం ఇవ్వడానికి సరిగ్గా ఆదివారం సాయంత్రం 5 గంటలకు మీమీ ప్రాంతాల్లో స్థానిక అధికారులు సైరన్‌ మోగిస్తారు. అందుకు అందరూ సమాయత్తంగా ఉండాలని, ప్రయాణాలు, పనులు ఆరోజు రద్దు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.పోలీసులు, వైద్య సిబ్బంది, మెడికల్‌ సర్వీసులు, విద్యుత్తు, అగ్నిమాపక సిబ్బంది, పాలు లాంటి నిత్యావసర వస్తువులు, ఎమర్జెన్సీ సర్వీసులు తప్ప మిగతా సర్వీసులన్నింటినీ జనతా కర్ఫ్యూకు సంఘీభావంగా స్వచ్ఛందంగా నిలిపేయాలని కోరుతున్నట్లు ఆయన చెప్పారు.

Related Posts