YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం ఆరోగ్యం దేశీయం

కరోనాపై యుద్ధానికి కార్పొరేట్ సంస్థ భారీ సాయం

కరోనాపై యుద్ధానికి కార్పొరేట్ సంస్థ భారీ సాయం

కరోనాపై యుద్ధానికి కార్పొరేట్ సంస్థల భారీ సాయం
హిందూస్తాన్ లివర్, పతంజలి, గోద్రెజ్ సహా పలు సంస్థలు కూడా తమ వంతు సాయం చేస్తున్నాయి. తమ సబ్బు ఉత్పత్తుల ధరలను 12.5 శాతం వరకు తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పటిష్ట చర్యలు చేపట్టాయి. పలు ప్రైవేట్, కార్పొరేట్ సంస్థలు సైతం కరోనా పోరాటం భాగస్వామ్యమవుతున్నాయి. ఈ క్రమంలోనే ప్రముఖ FMCG కంపెనీ హిందుస్థాన్ యూనీలివర్ తన వంతుగా ముందుకొచ్చి.. కరోనా వైరస్ పోరాటానికి రూ. 100 కోట్ల సాయం ప్రకటించింది. అంతేకాదు కరోనా వ్యాప్తిని అరికట్టే శానిటైజర్లు, సబ్బులను తక్కువ ధరకే అందిస్తామని తెలిపింది. లైఫ్ బాయ్ శానిటైజర్, లిక్విడ్ హ్యాండ్‌వాష్, డోమెక్స్ ఫ్లోర్ క్లీనర్ ధరలను 15శాతం మేర తగ్గిస్తామని తెలిపింది. రానున్న నెల రోజుల్లో దేశవ్యాప్తంగా 2 కోట్ల లైఫ్ బాయ్ సబ్బును ప్రజలకు ఉచితంగా పంపిణీ చేస్తామని HUL ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ సంజీవ్ మెహతా చెప్పారు. పతంజలి, గోద్రెజ్ సహా పలు సంస్థలు కూడా తమ వంతు సాయం చేస్తున్నాయి. తమ సబ్బు ఉత్పత్తుల ధరలను 12.5 శాతం వరకు తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి. మరోవైపు దేశంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో శానిటైజర్లు, మాస్క్‌లు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. వ్యాపారులు ఇష్టం వచ్చిన ధరలకు శానిటైజర్లు, మాస్క్‌లు విక్రయిస్తున్నారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం కరోనా వైరస్ మాస్క్‌లు, శానిటైజర్ల ధరలను ఖరారు చేసింది. మాస్క్‌ల ధరలు రూ.8, రూ.10గా కేంద్రం నిర్ణయించింది. మరోవైపు.. 200 ML శానిటైజర్ ధర రూ.100గా ఖరారు చేసింది. ఈ ఆదేశాలు మార్చి 21 నుంచి జూన్ 30 వరకు అమల్లో ఉంటాయని కేంద్రం ప్రకటించింది. ప్రజల భయాన్ని క్యాష్ చేసుకుంటూ, మాస్క్‌లు, శానిటైజర్లను అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని కేంద్ర ప్రభుత్వం గట్టి హెచ్చరిక జారీ చేసింది.

Related Posts