YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం విదేశీయం

 లాక్ డౌన్ తో ఉపయోగం ఉండదు

 లాక్ డౌన్ తో ఉపయోగం ఉండదు

 లాక్ డౌన్ తో ఉపయోగం ఉండదు
న్యూఢిల్లీ, మార్చి 23
కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో భారత దేశం మొత్తం లాక్ డౌన్ దిశగా పయనిస్తుంది. ఇప్పటికే దేశంలోని 12 రాష్ట్రాలు లాక్ డౌన్ చేశాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కేరళ, హర్యానా, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, పంజాబ్, ఢిల్లీ, నాగాలాండ్, రాజస్థాన్ రాష్ట్రాలు ఈనెల 31 వ తేదీ వరకు లాక్ డౌన్ చేస్తుండగా మధ్యప్రదేశ్ రాష్ట్రం నాలుగు రోజులపాటు లాక్ డౌన్ చేసింది. మిగతా రాష్ట్రాలు కూడా ఇదే బాటలో నడిచేందుకు రెడీ అవుతున్నాయి. మన రాష్ట్రాలే కాదు దేశాలకు దేశాలే లాక్ డౌన్ దిశగా పయనిస్తున్నాయి.కరోనా మహమ్మారిని అరికట్టేందుకు ప్రజలు ఇంటి నుంచి కదలకుండా కాలు బయట పెట్టకుండా... బయట ఉన్న వైరస్ బయటనే నశించే విధంగా కీలక చర్యలు చేపడుతున్నాయి. అయితే తాజాగా దేశాలు రాష్ట్రాలు వైరస్ తీవ్రతను తగ్గించేందుకు లాక్ డౌన్ చేస్తున్న నేపథ్యంలో... దీనిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పందించింది. కేవలం లాక్ డౌన్ చేసినంత మాత్రాన కరోనా వైరస్ ప్రభావం తగ్గదని షాకింగ్ న్యూస్ ఇచ్చింది ప్రపంచ ఆరోగ్య సంస్థ. లాక్ డౌన్‌లో మనం ఉన్నంత మాత్రాన ప్రాణాంతకమైన ఆ మహమ్మారిని ఓడించలేమంటున్నారు WHO హై రిస్క్ నిపుణుడు మైక్ ర్యాన్.ముందుగా మన ప్రాంతంలో కరోనా వైరస్ బారిన పడ్డ వారిని గుర్తించాలన్నారు. వారందర్ని గుర్తించాక ఐసోలేషన్‌లో ఉంచి వైరస్ బయటకు వెళ్లకుండా చూడాలన్నారు. అంతేకాని వైరస్ సోకిన వ్యక్తిని గుర్తించకుండా లాక్ డౌన్ ప్రకటిస్తే ఎలాంటి ఫలితం ఉండదంటున్నారు మైక్ ర్యాన్. లాక్ డౌన్ ప్రకటించినన్ని రోజులు వైరస్ కాస్త కంట్రోల్లోనే ఉన్నప్పటికీ.. లాక్ డౌన్ ఎత్తి వేయగానే మళ్లీ పరిస్థితి మొదటికి వస్తుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. దీంతో ఇప్పుడు లాక్ డౌన్ చేసిన రాష్ట్రాల్లో కూడా తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. మరోవైపు ప్రభుత్వాలు.. వైరస్ లక్షణాలు ఏమాత్రం కనిపించినా.. వెంటనే సమాచారం ఇవ్వాలని కోరుతున్నారు.

Related Posts