YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం తెలంగాణ

కలెక్టర్ తీవ్రస్థాయిలో ఫైర్..

కలెక్టర్ తీవ్రస్థాయిలో ఫైర్..

 కలెక్టర్ తీవ్రస్థాయిలో ఫైర్..
హైద్రాబాద్, మార్చి 23
కరోనా వైరస్ మహమ్మారి వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో తెలంగాణలో లాక్‌డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం సాయంత్రం ప్రకటించారు. అదేరోజు జనతా కర్ఫ్యూకు జనమంతా మద్దతు పలికినా, తర్వాతి రోజు నుంచి సాధారణంగా రోడ్లపై తిరగడం మొదలు పెట్టారు. అన్ని రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి ఉండడంతో దీనిపై కేంద్ర ప్రభుత్వం సైతం సీరియస్ అయింది. ప్రధాని మోదీ కూడా దీనిపై ట్వీట్ చేశారు. అందరూ లాక్‌డౌన్‌ను విధిగా పాటించాలని సూచించారు. తెలంగాణలోనూ అదే పరిస్థితి కనిపిస్తోంది. హైదరాబాద్‌లో మాత్రమే కాకుండా జిల్లాల్లోనూ జనం బాధ్యతా రహిత్యంగా రోడ్లపైకి వస్తున్నారు. ప్రభుత్వ నిబంధనలు బేఖాతరు చేసి ద్విచక్ర వాహనంపై ఇద్దరు, కార్లలో నలుగురు, ఐదుగురు సైతం ప్రయాణిస్తున్నారు. దీనిపై సీరియస్ అయిన తెలంగాణ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటించింది. ఈ మేరకు తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌తో కలిసి మీడియా సమావేశం నిర్వహించి తీవ్రంగా హెచ్చరించారు.జిల్లా కేంద్రాల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. దీనిపై రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ తీవ్ర స్థాయిలో స్పందించారు. ఏకంగా రోడ్డుపైకి వచ్చి వాహనదారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం లాక్‌డౌన్ అని స్పష్టంగా ప్రకటించినా, బాధ్యతారాహిత్యంగా రోడ్లపైకి ఎలా వస్తారని వాహనదారులపై అసహనం వ్యక్తం చేశారు. ఒక్కో కారు వద్దకు వెళ్లి, ఎక్కడికి వెళ్తున్నారని అందులోని ప్రయాణికులను ప్రశ్నించారు. ఏదైమైనా బయటికి వెళ్లొ్ద్దని అత్యవసరమైతే ఇంటికి ఒక్కరు మాత్రమే వెళ్లాలని, ద్విచక్రవాహనాలపై ఒకరు మాత్రమే ప్రయాణించాలని తేల్చి చెప్పారు.ఓ దశలో తీవ్రమైన అసహనానికి గురైన కలెక్టర్ వాహనదారులను చెడామడా తిట్టారు. ముఖ్యంగా యువతపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్యాంకు పనులకు వెళ్తున్నామని కొందరు చెప్పగా.. ఆన్‌లైన్ లావాదేవీలు నిర్వహించుకోవాలని సూచించారు. ఎవరూ ముందుకు వెళ్లకూడదని, తక్షణం వెనక్కి వెళ్లిపోయి ఇంట్లోనే ఉండాలని ఆదేశించారు. దీనికి సంబంధించిన వీడియోలు కూడా ప్రస్తుతం బాగా వైరల్ అవుతున్నాయి. అయినా వినని వారి వద్ద నుంచి కారు అప్పగించేసి వెళ్లిపోవాలని, లాక్‌డౌన్ ముగిశాక అప్పగిస్తామని తెగేసి చెప్పారు. ఇలా వినని ఓ ద్విచక్రవాహన దారుడి నుంచి ఓ పోలీసు అతని బైక్‌ను తీసుకెళ్తుండడం వీడియోల్లో కనిపిస్తోంది.లాక్‌డౌన్‌లో భాగంగా బస్సులు, ఆటోలు, క్యాబ్‌లు, ప్రైవేటు వాహనాలు తిరిగేందుకు అనుమతి లేదు. వాహనాల ద్వారా దూర ప్రయాణాలు చేసేందుకు వీలు లేదు. కేవలం మెడికల్ ఎమర్జెన్సీకే అనుమతి ఉంటుంది. లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేసేందుకు పోలీసు యంత్రాంగం తీవ్రంగా పని చేస్తోంది. ఈ లాక్‌డౌన్‌ను ప్రజలు కఠినంగా పాటించకపోతే సమస్య తీవ్రం అవుతుందని సోమవారం డీజీపీ కూడా చెప్పారు. సాయంత్రం 7 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఎవర్నీ రోడ్ల మీదకు అనుమతించబోమని తేల్చి చెప్పారు. రాత్రి 7 గంటల తర్వాత ఇంట్లో నుంచి ఎవ్వరూ బయటకు రావద్దని హెచ్చరించారు. నిబంధనలు మీరితే వాహనాన్ని సీజ్ చేస్తామని, లాక్‌డౌన్ ముగిశాక తిరిగి ఇస్తామని చెప్పారు.

Related Posts