YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం తెలంగాణ

సిటీ అంతా స్ప్రే

సిటీ అంతా స్ప్రే

సిటీ అంతా స్ప్రే
హైద్రాబాద్, మార్చి 23
హైదరాబాద్ నగర వ్యాప్తంగా పారిశుద్ధ్య కార్యక్రమాలను జీహెచ్ఎంసీ ముమ్మరం చేస్తోంది. ఈ మేరకు గత శనివారం నుంచి పలు చోట్ల జీహెచ్ఎంసీ సిబ్బంది స్ప్రేలు చేస్తున్నారు. సోమవారం కూడా భారీ జెట్టింగ్ యంత్రాలతో ప్రధాన రహదారికి ఇరు వైపులా ఉండే దుకాణాల ముందు జీహెచ్ఎంసీ సిబ్బంది హై ప్రెషర్‌తో రసాయనాలు చల్లుతున్నారు. హిమాయత్ నగర్ ప్రాంతంలో జరిగిన ఈ శానిటేషన్ డ్రైవ్‌ను హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్ దగ్గరుండి పర్యవేక్షించారు.సోడియం కోరంటైన్ ద్రావణాన్ని ప్రజల కదలికలు ఎక్కువగా ఉండే దుకాణాల ముందు స్ప్రే చేయడం ద్వారా కరోనా వైరస్ మాత్రమే కాకుండా ఎలాంటి బ్యాక్టీరియా ఉన్నా తుడిచి పెట్టుకు పోతుందని మేయర్ బొంతు రామ్మోహన్ అన్నారు. నగరంలో అత్యధిక భాగం పారిశుద్ధ్య డ్రైవ్ చేసేందుకు జెట్టింగ్ మెషిన్లను వాడుతున్నామని చెప్పారు. నగరంలో మొత్తం ఆరు యంత్రాలతో.. ఒక్కో యంత్రం గంటకు ఆరు కిలోమీటర్ల మేర స్ప్రే చేసేలా ప్రణాళిక రూపొందించామని చెప్పారు.ఇలా యంత్రాలతో రసాయనాలను స్ర్పే చేయడం కొన్ని దేశాల్లో మాత్రమే ఉన్నట్లు మేయర్ బొంతు రామ్మోహన్ చెప్పారు.

Related Posts