YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు వాణిజ్యం ఆరోగ్యం ఆంధ్ర ప్రదేశ్

కనిపించని శానిటైజర్లు...

కనిపించని శానిటైజర్లు...

 కనిపించని శానిటైజర్లు...
కాకినాడ, మార్చి 24,
కరోనా వైరస్‌ సెరవేగంగా విస్తరిస్తున్న తరుణంలో వాటిని నియంత్రించే చర్యలు సామాన్యులకు అందుబాటులో లేకపోవడం దారుణమని పలువురు అంటున్నారు. కేవలం కరోనాను నియంత్రణద్వారా మాత్రమే ఆపగమని చెబుతున్న ప్రభుత్వం వాటి నియంత్రణకు మాత్రం చర్యలు చూపడంలేదు. కేవలం శాటిటైజర్లు, మాస్కులు అందించేందుకు చర్యలు చూపకుండా జనాన్ని రోడ్ల మీద తిరగొద్దు అంటూ వ్యాధి అదుపులోకి వచ్చేస్తుందా. మధురవాడ పరిసర ప్రాంతాలల్లో ఎక్కడా ఏ మెడికల్‌ షాపులో వెతికినా చేతులు శుభ్రపరుచుకునే శానిటైజర్లు, ముఖానికి ధరించే మాస్కులు కానరాని పరిస్థితి. దీంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. స్టాక్‌ బోర్డులు కూడా ఎక్కడ కనిపించటంలేదు, ప్రస్తుత పరిస్థితులలో వాటి అవసరం తీవ్రంగా ఉన్న తరుణంలో ఈ కొరత జనాన్ని చాలా కలవర పెడుతోంది. బయటకు పనుమీద వెళ్లేవారు మాస్కు ధరించి వెళ్లాలన్న నియమ నిబంధనలను పాటించేందుకు అవి అందుబాటులో లేవని చాలా మంది వాపోతున్నారు. కాకినాడపరిసర ప్రాంతాలలో సుమారు 80 మెడికల్‌ షాపులు ఉన్నాయి. కానీ పది రోజుల నుంచి ఏ ఒక్క మెడికల్‌ షాపులో కూడా శానిటైజర్లు, మాస్కులు దొరకడం లేదు అంటే కొరత ఏస్థాయిలో ఉందో అర్థమవుతోంది. ప్రజలకు సరిపడా మాస్కులు, శానిటైజర్లు అందించడంలో ప్రభుత్వం లోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. అపోలో, హెటిరో వంటి పెద్ద, పెద్ద షాపులలో కూడా ఇదే పరిస్థితి కనబడటం జనం చాలా అసహనం ప్రదర్శిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు స్పందించి అన్ని మెడికల్‌ షాపులలో ప్రజలకు సరిపడా శానిటైజర్లు, మాస్కులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

Related Posts