YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు వాణిజ్యం తెలంగాణ

కుత్బుల్లాపూర్ లో ఆగని  కబ్జాలు

కుత్బుల్లాపూర్ లో ఆగని  కబ్జాలు

కుత్బుల్లాపూర్ లో ఆగని  కబ్జాలు
రంగారెడ్డి, మార్చి 24
గాజులరామారంలోని గొలుసు నాలా కబ్జా పై అధికార యంత్రాంగం నామ మాత్రపు చర్యలను చేపట్టి చేతులు దులుపుకున్నారు. అతి పెద్ద నాలా అయినా గొలుసు కట్టు నాలా ప్రైవేటు వెంచర్ మాయం చేసినా అధికారుల్లో మాత్రం చలనం లేకుండా పోయింది. రాష్ట్ర మంత్రి అధికారులకు మొట్టికాయలు వేసినా ఫలితం మాత్రం కనిపించడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సంబంధిత అధికారులు నాలా కబ్జాను పరిశీలించి పోలీసులకు ఫిర్యాదు చేసి చేతులను దులుపుకున్నారు. మళ్లీ మొదటికి వచ్చిందనే ఆరోపణలు స్థానికంగా నెలకొన్నాయి. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని గాజులరామారం సర్కిల్ సూరారం శ్రీరామ్‌నగర్‌లోని పెద్దచెరువు నుంచి గాజులరామారంలో వెలసిన బాలాజి లే అవుట్ వెంచర్ మీదుగా చిత్తారమ్మ దేవాలయం నుంచి గొలుసు నాలా పరికి చెరువు వరకు ప్రవహిస్తుంది. సుమారు రెండు కిలోమీటర్ల వరకు ఉన్న నాలా పూర్తిగా కనుమరుగైంది. సర్వేనంబరు 92, 93, 98, 99, 101, 105, 106, 121, 122, 137, 136, 132, 130, 147, 175, 181, 183, 184 పైనుంచి 1200 మీటర్ల పొడవు, 10 మీటర్ల వెడల్పుతో గొలుసు నాలా ప్రవహిస్తుంది. రెండు కిలోమీటర్ల పొడవునా దాదాపుగా 2.5 ఎకరాల నాలా స్థలం ప్రైవేటు వ్యక్తుల వశమైన విషయం తెలిసిందే. నాలాను ప్రైవేటు వెంచర్ యాజమాన్యం తనకు అనుకూలంగా మలుచుకుని యథేశ్చగా నాలాను కబ్జా చేసి పైపులను వేసి నాలాను పూర్తిగా కనుమరుగు చేశారు. అంతేకాకుండా నాలాపై రోడ్లను, ప్లాట్లను సైతం వేసినట్లు అధికారుల పరిశీలనలో తేలినట్లు సమాచారం. రానున్న వర్షాకాలానికి గొలుసు నాలాను పునరుద్ధరిస్తే ఎలాంటి ప్రమాదం జరగదని ప్రజలు భావిస్తున్నారు. గత వర్షాకాలంలోనే ఈ నాలా కబ్జాకు గురి కావడం వలన వరద నీరు పూర్తిగా వెంచర్‌లోనే నిలిచి చెరువును తలపించిన విషయం తెలిసిందే. రాబోవు వర్షాకాలానికి నాలాను పునరుద్ధరించని పక్షంలో ప్రమాదం తప్పదని ప్రజలు భయపడుతున్నారు. అతిపెద్ద గొలుసు నాలాను సుమారు 90 డిగ్రీల వరకు ఇష్టానుసారంగా మలుపుకున్నారని అధికారుల పరిశీలనలో తేలింది. రాష్ట్ర ప్రభుత్వం అతి పురాతనమైన, అతి పెద్ద గొలుసు నాలాను పునరుద్ధరించి కబ్జాదారుల పై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు

 

Related Posts