YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం తెలంగాణ

కరోనాపై ఢిష్యూం..డిష్యూం

కరోనాపై ఢిష్యూం..డిష్యూం

కరోనాపై ఢిష్యూం..డిష్యూం
హైదరాబాద్, మార్చి 24 
చైనాలో మొదలైన కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. దీంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ దీనిని మహమ్మారిగా ప్రకటించింది.  చైనా వ్యతిరేక సెంటిమెంట్ ప్రచారం జోరుగా సాగుతోంది.కరోనా వైరస్‌ను అమెరికా సైన్యమే తీసుకొచ్చిందని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఆరోపణలు గుప్పించగా.. వైరస్ విజృంభణకు సంబంధించిన నిందను తమ మీదకు మళ్లించడానికి చైనా ప్రయత్నిస్తోందని అమెరికా తిప్పికొట్టింది. తాజాగా, మరోసారి వైరస్ విషయమై చైనా, అమెరికాలు పరస్పర ఆరోపణలు గుప్పించుకుంటున్నాయి. కోవిడ్ 19ను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ‘చైనీస్‌ వైరస్‌’గా అభివర్ణించారు. ‘కరోనా’కు అమెరికాయే కారణమంటూ చైనా నిందలు వేస్తోందని అమెరికా విదేశాంగ మంత్రి మైక్‌ పాంపియో విరుచుకుపడ్డారు  చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి తీవ్రంగా స్పందించారు. ఈ వైరస్‌ను అమెరికా సైన్యమే చైనాకు తీసుకొచ్చి ఉండవచ్చని ఆరోపించారు. చైనాలో కంటే ప్రపంచంలోని మిగతా దేశాల్లో కరోనా మరణాలు ఎక్కువంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్‌వో) ప్రకటించిన రోజే అమెరికా-చైనాలు పరస్పరం విమర్శలకు దిగాయి.కోవిడ్-19 వ్యాధికి కారణమయ్యే కొత్త కరోనావైరస్‌ను ‘చైనా వైరస్’' అని అభివర్ణిస్తూ అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ ట్వీట్ చేశారు. అయితే, ఈ వైరస్‌ను ఏదైనా నిర్దిష్ట ప్రాంతానికి లేదా సమూహానికి ఆపాదించవద్దని.. అలా చేయడం వల్ల ఆ ప్రాంతం లేదా సమూహం పట్ల వివక్ష తలెత్తే ప్రమాదం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ గతంలోనే హెచ్చరించింది. అయినా సరే అమెరికా అధికారులు కొందరు ఈ వైరస్‌ను చైనీస్ వైరస్ అని ఉటంకిస్తున్నారు. విదేశాంగ మంత్రి పాంపేయే ఈ వైరస్‌ను ‘వుహాన్ వైరస్’ అని పదే పదే వ్యాఖ్యానిస్తున్నారు.  మూడు అమెరికా దినపత్రికలకు సంబంధించిన జర్నలిస్ట్‌ల గుర్తింపును చైనా రద్దుచేసింది. వాల్‌స్ట్రీట్ జర్నల్, న్యూయార్క్ టైమ్స్, వాషింగ్టన్ పోస్ట్‌లకు చెందిన అమెరికా జర్నలిస్ట్‌ గుర్తింపు రద్దుచేస్తూ నిర్ణయం తీసుకుంది. గత ఫిబ్రవరిలోనే వాల్‌స్ట్రీట్ జర్నల్‌‌కు చెందిన ముగ్గురు జర్నలిస్ట్‌ల ఇద్దరు అమెరికన్లు, ఒకరు ఆస్ట్రేలియన్‌ను చైనా తమ దేశం నుంచి బహిష్కరించాయి. కరోనా వైరస్ వ్యాప్తిపై కథనం ప్రచురించిన వాల్‌స్ట్రీట్ జర్నల్. ‘రియల్ సిక్ మ్యాన్ ఆఫ్ ఆసియా’గా పేర్కొంటూ ఒపీనియన్ కాలమ్ రాయడంతోనే చైనా ఈ నిర్ణయం తీసుకుంది.జాత్యహంకార ధోరణికి అద్దం పడుతోందని, తక్షణమే క్షమాపణ చెప్పాలని చైనా డిమాండ్ చేసినా, వాల్‌స్ట్రీట్ జర్నల్ అందుకు అంగీకరించలేదు. దీంతో తమ దేశంలోని ఆ పత్రికకు సంబంధించిన ముగ్గురు జర్నలిస్ట్‌లను గెంటేసింది. డ్రాగన్ నిర్ణయంపై తీవ్రంగా మండిపడిన అమెరికా... పత్రికా స్వేచ్ఛను చైనా హరిస్తోందని ఆరోపిస్తోంది.  ఇదిలా ఉండగా వాషింగ్టన్‌లో చైనా అధికారిక మీడియా సంస్థల కార్యాలయాలలో పనిచేసే ఆ దేశ పౌరుల సంఖ్యను 160 నుంచి 100కు కుదించిందని, ఇది డ్రాగన్ దేశంలోని పత్రికా స్వేచ్ఛ అణిచివేత తీవ్రతను తెలియజేస్తుందని అమెరికా దుయ్యబట్టింది. అమెరికా తమపై చేస్తున్న విమర్శలకు సమాధానం ఇచ్చిన చైనా.. అమెరికా జర్నలిస్ట్‌ల గుర్తింపు ఇప్పటికే ముగిసిందని, అందుకే తమ దేశంతోపాటు హాంకాంగ్, మకావులో విధులు నిర్వహించడానికి అనుమతించడంలేదని స్పష్టం చేసింది. అంతేకాదు, వారి గుర్తింపు కార్డులను పది రోజుల్లోగా వెనక్కు ఇవ్వాలని ఆదేశించింది.  'కరోనా' వ్యాప్తికి అమెరికా సైన్యం కారణమంటూ, చైనా నిందలు వేయడం సరికాదన్నారు వైరస్ ఎక్కడ నుంచి వచ్చిందో.. ఆ దేశం పేరు పెట్టి పిలవడం ఏమాత్రం తప్పుకాదన్నారు. చైనాకు ప్రయాణాలను నిషేధించి మంచిపని చేశానన్నారు. ఔషధ తయారీకి అవసరమయ్యే ముడిసరుకు దిగుమతుల్లో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందన్న వాదనను ట్రంప్‌ కొట్టిపారేశారు. ఇరు దేశాల మధ్య తొలిదశ ఒప్పందాన్ని చైనా ఉల్లంఘిస్తుందని భావించడం లేదన్నారు. చైనాకు అమెరికా ఉత్పత్తుల అవసరం చాలా ఉందన్నారు. ప్రస్తుతం ఉన్న సత్సంబంధాలను చైనా కొనసాగిస్తుందని జోస్యం చెప్పారు.

Related Posts