YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

నేటి అర్థరాత్రి నుంచి 21 రోజుల పాటు దేశంలో లాక్ డౌన్-ప్రధాని మోదీ

నేటి అర్థరాత్రి నుంచి 21 రోజుల పాటు దేశంలో లాక్ డౌన్-ప్రధాని మోదీ

నేటి అర్థరాత్రి నుంచి 21 రోజుల పాటు దేశంలో లాక్ డౌన్-ప్రధాని మోదీ

కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్రం కీలక నిర్ణయం  నేటి అర్థరాత్రి దేశంలో లాక్ డౌన్ ప్రకటిస్తున్నట్టు ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించారు. ఇది ఒక రకంగా కర్ఫ్యూ లాంటిదే అని... రాబోయే రోజులన్నీ అత్యంత కీలకమైనవని ప్రధాని మోదీ అన్నారు. ఈ 21 రోజులు మన ఇంటికి లక్ష్మణ రేఖ గీసుకుని ఉండాల్సిన పరిస్థితి ఉందని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. 21 రోజులు జాగ్రత్తగా ఉండకపోతే... ఆ తరువాత పరిస్థితలు మన చేతుల్లో ఉండవని తెలిపారు. కరోనా నియంత్రణ కోసం రూ. 15 వేల కోట్లు కేటాయిస్తున్నట్టు ప్రధాని తెలిపారు. ఈ 21 రోజులు దేశంలో అన్ని రాష్ట్రాలు వైద్య సేవలకే అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశారు. ప్రధానమంత్రి మొదలు నుంచి గ్రామంలో ఉన్న వ్యక్తి వరకు అంతా సోషల్ డిస్టెన్స్ కచ్చితంగా పాటించాలని సూచించారు. కరోనా వైరస్ మొదట్లో కంటే ఇప్పుడు వేగంగా ప్రబలుతోందని ప్రధాని మోదీ హెచ్చరించారు. జనతా కర్ఫ్యూను మించి ఇది ఉంటుందని ప్రధాని మోదీ తెలిపారు. దేశ ప్రజలను కాపాడేందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేశారు. ప్రజలందరూ ఇంట్లో నుంచి బయటకు రావొద్దని చేతులు జోడించి విజ్ఞప్తి చేశారు. 21 రోజుల పాటు ఈ లాక్ డౌన్ ఉంటుందని ప్రధాని నరేంద్రమోదీ స్పష్టం చేశారు. కరోనా వైరస్‌ను మనం అదుపులోకి తీసుకురావాలని... లేకపోతే పరిస్థితి అదుపులో ఉండదని అన్నారు. ఆ తరువాత ఏం జరుగుతుందో కూడా ఎవరూ ఊహించలేమని వ్యాఖ్యానించారు. దేశంలో నిత్యావసరాల సరఫరా ఎప్పటిలాగే ఉంటుందని... ఆ విషయంలో ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రధాని మోదీ అన్నారు. ప్రపంచంలోని అభివృద్ధి చెందిన దేశాలు సైతం కరోనా ధాటికి విలవిల్లాడుతున్నాయని అన్నారు. ఈ వైరస్ చైన్‌ను తెంచాలని ఆయన అన్నారు. అంతా కలిసినట్టుగా ఉంటూ ఈ ఆపద నుంచి బయటపడాలని ప్రధాని మోదీ తెలిపారు. దేశంలో లాక్ డౌన్ పరిస్థితి ఉన్నంత కాలం దేశ ప్రజలందరూ సంకల్పంతో ముందుకు సాగాలని చేతులు జోడించి విజ్ఞప్తి చేశారు. 21 రోజులు మన జాగ్రత్తలు పాటించకపోతే... మనం 21 సంవత్సరాలు వెనక్కి వెళ్లకపోతామని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు

Related Posts