YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం విదేశీయం

అమెరికన్లను చంపేందుకే కరోనా వైరస్‌ను సృష్టించింది చైనానే. అమెరికా కోర్టులో దావా 

అమెరికన్లను చంపేందుకే కరోనా వైరస్‌ను సృష్టించింది చైనానే. అమెరికా కోర్టులో దావా 

అమెరికన్లను చంపేందుకే కరోనా వైరస్‌ను సృష్టించింది చైనానే. అమెరికా కోర్టులో దావా 
అమెరికాకు చెందిన ఓ లాయర్ చైనా ప్రభుత్వంపై దావా కూడా వేశారు. ల్యారీ క్లేమన్ అనే లాయర్.. చైనా సర్కార్, చైనా ఆర్మీ, వుహాన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ, డైరెక్టర్ ఆఫ్ వుహాన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ షీ షెంగ్లీ, చైనా ఆర్మీ మేజర్ జనరల్ చెన్ వెయ్‌పై అమెరికా కోర్టులో 20 ట్రిలియన్ డాలర్ల దావా వేశారు. ఈ మొత్తం మన కరెన్సీలో అక్షరాలా.. రూ.కోటి 52 లక్షల కోట్లు. చైనా జీడీపీ కంటే కూడా ఈ మొత్తం ఎక్కువ కావడం గమనార్హం. కరోనా వైరస్ వుహాన్ ఇనిస్టిట్యూట్ నుంచి బయటికి వదిలారని, చైనాలో చోటుచేసుకున్న మరణాలు.. డిజైన్ చేసినవేనని ఆరోపించింది ఆ లాయర్ బృందం.చైనాలోని వుహాన్ నగరంలో పుట్టిన వైరస్.. కరోనా. అక్కడి ప్రజలను బెంబేలెత్తించిన ఈ మహమ్మారి అనతికాలంలోనే ప్రపంచ దేశాలను విస్తరించింది. ఇటలీ, స్పెయిన్, అమెరికా.. తదితర దేశాలకు ముచ్చెమటలు పట్టిస్తోంది. భారత్‌లోనూ దాని ప్రభావం అంతకంతకూ పెరుగుతూ వస్తోంది. ఈ వైరస్ ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా 18వేల పైచిలుకు మృతిచెందగా, 4 లక్షల మందిని పట్టి పీడిస్తోంది. భారత్‌లో దీని బారిన పడి 11 మంది మృతిచెందారు. అయితే.. ఈ వైరస్ దానికదే పుట్టింది కాదని.. జీవాయుధంలా చైనా దీన్ని సృష్టించి, అమెరికాతో పాటు శత్రు దేశాలపైకి వదలిందని ఆరోపిస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కూడా ఈ వాదనే చేశారు.   కావాలనే కొంత మందికి వైరస్ ఎక్కించారని తెలిపింది. ప్రస్తుతం ఈ దావాపై ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది.

Related Posts