YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం దేశీయం

మే 22 వరకు కరోనా ప్రభావం

మే 22 వరకు కరోనా ప్రభావం

మే 22 వరకు కరోనా ప్రభావం
హైద్రాబాద్, మార్చి 26
శార్వరినామ సంవత్సరంలో రాజు- బుధుడు కావడంతో ప్రకృతి బీభత్సాలు ప్రజలకు చేదు అనుభవం మిగులుస్తాయని ములుగు సిద్ధాంతిగారు తెలిపారు. అధికార రాజకీయ వర్గం ప్రజాసేవకు అంకితమవుతుందని అన్నారు. విద్య, వైద్యం సామాన్యులకు అందుబాటులో ఉంటాయి. కుల, మత, వర్గ, ప్రాంతీయ విచక్షణలు అధికమవుతాయి. ప్రజలను దోపిడీ చేసేవాళ్లు మేధావులు, గొప్పవాళ్లుగా చలామణి అవుతారు.చంద్రుడు మంత్రి కావడంతో అందరూ పైకి బాగానే ఉంటారు కానీ, ఎవరి ధోరణి వాళ్లదే. తామే గొప్పని మాకే అంతా తెలుసని అనుకుంటారు. అన్నీ తాత్కాలిక ప్రయోజనాల కోసమే వెంపర్లాడుతారు. వ్యవసాయం గతంలో కంటే మెరుగ్గా ఉంటుంది.రవి సేనాధిపతి కావడంతో అవినీతి అన్ని హద్దులనూ దాటిపోతుంది. పరిశ్రమలు, గనులలో ప్రమాదాలు, నౌకలు మునిగిపోవడం, అంతరిక్ష ప్రయోగాలు విఫలం, ధన, ప్రాణ నష్టానికి కారణమవుతాయి.గురువు సస్యాధిపతి కావడంతో వ్యవసాయ దిగుబడులు బాగుంటాయి. ధాన్యం, పొగాకు, మిర్చి, పత్తి, అపరాలు, నవరత్నాలు, బంగారం, వెండి అధిక ధరలు కలిగి ఉంటాయి. కూరగాయలు, పండ్లు, పాల ధరలు కూడా పెరుగుతాయి.కుజుడు ధాన్యాధిపతి కావడంతో నిత్యావసరాల ధరలు పెరుగుతాయి. కృత్రిమ కొరత ఏర్పడుతుంది.రవి అర్ఘ్యాధిపతి కావడంతో ఎరుపు, గులాబీ రంగు వస్త్రాల ధరలు అధికమవుతాయి. వినయోగం పెరుగుతాయి. దక్షిణ భారతంలో అన్ని రాష్ట్రాలకు ప్రతికూల సంఘటనలు, భూకంపం లాంటి ప్రకృతి ఉపద్రవాలు చోటుచేసుకుంటాయి.రవి మేఘాధిపతి కావడం వల్ల వర్షపాతం సామాన్యంగా ఉంటుంది. ఈదురు గాలులు, ప్రచండ వేగంతో వీచే గాలులతో అధిక నష్టం సంభవిస్తుంది.రసాధిపతిగా శని ఉండటంతో అన్ని రంగాల్లో మహిళల ఆధిపత్యం ప్రదర్శిస్తారు. కళా, సాహస క్రీడలు, క్రీడారంగం, రాజకీయ రంగాలలో రాణిస్తారు. వినోదం విషయంలో అశ్లీలం అన్ని హద్దులూ దాటిపోతుంది. హాస్యం అపహాస్యం అవుతుంది.నీరసాధిపతి- గురువు కావడంతో యువత బాధ్యతారహిత్యంగా ఉంటారు. విలాసాలకు ఎక్కువ మంది అలవాటుపడతారు. యువతుల పాత్ర ఆక్షేపణీయంగా ఉంటుంది. సులువుగా ధనం సంపాదించే మార్గాలు, ఊహలు అధికమవుతాయి. నేరాలలో యువత పాత్ర అధికమవుతుంది. మహిళల ప్రాతినిధ్యం కూడా అధికంగా ఉంటుంది. జీర్ణకోశ సంబంధత రోగాలు అధికమవుతాయి. మద్యం ఏరులై పారుతుంది.ఇక, వికారి నామ సంవత్సరం మహమ్మారి కరోనా వైరస్‌ను ఇచ్చిపోయిందని శార్వరి నామ సంవత్సరంలో కాల సర్పయోగం ఆరుసార్లు కలగడం వల్ల విపత్తులు సంభవిస్తాయని  పండితులు అంటున్నారు. ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొనే ఆస్కారం ఉంటుందని, మే 22 వరకు ప్రజలు కరోనా వైరస్ పట్ల జాగ్రత్తగా ఉండాలని, స్వీయ నియంత్రణ పాటించాలని సూచించారు. చండీయాగాలు, చండీ హోమాలు, పారాయణాలు చేయడం ద్వారా మహమ్మారి బారి నుంచి బయటపడవచ్చని తెలిపారు.కొత్త ఏడాదిలో దేశం ఆర్థిక ఒడుదొడుకులను ఎదుర్కొంటుందని, ఆర్థిక మంత్రి పని కత్తిమీద సాములా ఉంటుందని జోస్యం చెప్పారు. దేశంలో తరచూ విపత్తులు సంభవించే అవకాశం ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యాశాఖలో కుంభకోణాలు వెలుగుచూస్తాయన్నారు. కేంద్ర, రాష్ట్ర   ప్రభుత్వాలు కలిసి పనిచేస్తూ సుపరిపాలన అందజేస్తాయని, దేశ, రాష్ట్రాభివృద్ధి బాగుంటుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సర్వాదాయం 105, సర్వ వ్యయం 96. శేషం 9 రావడం శుభసూచకం.

Related Posts