YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆరోగ్యం దేశీయం

 ఫిబ్రవరి 12న కరోనా పై ట్వెట్టర్ లో రాహుల్ హెచ్చరిక

 ఫిబ్రవరి 12న కరోనా పై ట్వెట్టర్ లో రాహుల్ హెచ్చరిక

 ఫిబ్రవరి 12న కరోనా పై ట్వెట్టర్ లో రాహుల్ హెచ్చరిక
న్యూ ఢిల్లీ మార్చ్ 26
కరోనా వైరస్ గురించి కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ ముందు నుంచి చెబుతూనే ఉన్నారు కానీ ఎవరూ పట్టించుకోలేదు. ఫిబ్రవరి 12న ఆయన ట్వీట్ చేస్తూ కరోనా వైరస్ మన దేశ ప్రజలకు మన దేశ ఆర్ధిక వ్యవస్థ కు కూడా ఎంతో ప్రమాదకరమైనది.ప్రభుత్వం కరోనా వైరస్ ను సీరియస్ గా తీసుకోవడం లేదేమోనని నాకు అనిపిస్తున్నది అని చెప్పారు. తన ట్వీట్ కు ది హార్వర్డ్ గజెట్ వెబ్ పేజిని కూడా యాడ్ చేశారు. చైనా లోని ఊహాన్ లో పుట్టిన ఈ వైరస్ భయంకరంగా విస్తరించే అవకాశం ఉందని హార్వర్డ్ గజెట్ లో హార్వర్డ్ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ మైఖేల్ మినా ఫేస్ బుక్ లైవ్ లో చెప్పిన వీడియోను కూడా రాహుల్ గాంధీ తన ట్వీట్ కు జత చేశారు.అప్పటికే కరోనా వైరస్ 23 దేశాలకు విస్తరించి ఉంది. చైనాలోని ఊహాన్ తరవాత ఫిలిప్పైన్స్ లో తొలి కరోనా మరణం నమోదు అయింది.  సార్స్ వైరస్ లో డెత్ రేట్ 10 శాతం ఉండగా కరోనాలో డెత్ రేట్ 2 శాతం మాత్రమే. అందువల్ల కరోనా తక్కువ ఎఫెక్టు ఉంటుందని అనుకోవడానికి వీల్లేదని మైఖేల్ మినా చెప్పారు.ఎందుకంటే సార్స్ 10 మందికి సోకే సమయంలో కరోనా వెయ్యి మందికి సోకుతుందని అందువల్ల కరోనా సార్స్ కన్నా ప్రమాదకరమైనదని ఆయన చెప్పారు. ఇవన్నీ రాహుల్ గాంధీ ఫిబ్రవరి 12 నాటి ట్వీట్ లో చెప్పారు కానీ ఎవరూ పట్టించుకోలేదు. ఆ తర్వాత మార్చి 3వ తేదీన ఆయన మరొక ట్వీట్ చేశారు. ప్రతి దేశంలో తమ నాయకుడిని పరీక్షకు గురి చేసే కొన్ని క్షణాలు ఉంటాయి.భారత దేశం పైనా, భారత దేశ ఆర్ధిక వ్యవస్థ పైనా పెను ప్రభావం చూపే కరోనా వైరస్ ను అరికట్టడం అనే అంశంపైనే నిజమైన నాయకుడు అయితే దృష్టి సారిస్తాడు అని రాహుల్ గాంధీ మార్చి 3న మళ్లీ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ కు మాత్రం ప్రధాని మోడీ సమాధానం ఇచ్చారు. కరోనా వైరస్ కు సంబంధించి ప్రభుత్వం సన్నద్ధంగా ఉందని వివిధ మంత్రిత్వ శాఖలు, రాష్ట్రాలు కలిసి పని చేస్తున్నాయని దేశంలోకి వచ్చే వారందరిని పరీక్షిస్తున్నామని వారికి తక్షణ వైద్య సహాయం అందిస్తున్నామని పేర్కొన్నారు. అయితే జరగాల్సిన డ్యామేజీ జరుగుతూనే ఉన్నది. ఈ విషయంలో రాహుల్ గాంధీ ముందు చూపు నకు హ్యాట్సాఫ్ అనాల్సిందే.

Related Posts