YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం ఆంధ్ర ప్రదేశ్

కోసేవారేరీ..? 

కోసేవారేరీ..? 

కోసేవారేరీ..? (కృష్ణాజిల్లా)

మచిలీపట్నం, ఏప్రిల్ 08 (న్యూస్ పల్స్): రబీలో వరిని సాగు చేసిన రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. పంట చేతికొచ్చే సమయంలో కోత కోసేందుకు కూలీలు ముందుకు రావడంలేదు. పంటను ఏంచేయాలో పాలుపోని పరిస్థితి నెలకొంది. జిల్లాలోని 40 మండలాల్లో 61,330 హెక్టార్లలో వరిని సాగు చేశారు. అత్యధికంగా బంటుమిల్లి మండలంలో 6352 హెక్టార్లలో సాగవుతోంది. ఆ తర్వాత బందరు మండలంలో అత్యధికంగా 4375 హెక్టార్లుకంకిపాడులో 4365 హెక్టార్లలో వరిని సాగుచేశారు. అత్యధికంగా రైతులు ఎంటీయూ 1156, ఎంటీయూ 1153 రకాలను అత్యధికంగా సాగుచేశారు. చెదురు మదురుగా బీపీటీలు ఉన్నాయి. వరికోతలు మొదలు పెడితే పంట ఇంటికి చేరేవరకు కనీసంగా 30 రోజుల సమయం అవసరం. వరి కోతలు మొదలు ప్రారంభించేందుకు సమయాత్తమవుతున్న వేళ కరోనా లాక్‌డౌన్‌ కారణంగా రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించింది. రైతు కూలీలు ఇతర జిల్లాల నుంచి ఇక్కడికి రాలేని పరిస్థితి నెలకొంది. జిల్లాలో వివిధ మండలాల్లో ఉన్న వ్యవసాయ కూలీలకు అదనంగా పొరుగు జిల్లాలైన తూర్పుపశ్చిమ గోదావరిశ్రీకాకుళంనెల్లూరు జిల్లాల నుంచి కూలీలు ఇక్కడికి వలసలు వస్తారు. రవాణా వ్యవస్థ స్తంభించటంసామాజిక దూరం తప్పని సరిగా పాటించాలన్న నిబంధనల నడుమ ఈసారి కూలీలు వచ్చే అవకాశం కన్పించటంలేదు. లాక్‌డౌన్‌ ఈనెల 14 తర్వాత తీసివేసిన సాధారణ పరిస్థితులకు కొద్ది రోజుల సమయం తీసుకొంటుంది. జిల్లాలో 158 వరకు వరి కోత యంత్రాలున్నాయి. వీటిలో ఇప్పటికే ఇతర జిల్లాలకు సగానికి పైగా వెళ్లాయి. ఏటా జిల్లా నుంచి దాదాపు 250కు పైగా వరి కోత యంత్రాలు జిల్లాకు వస్తాయని రైతులు పేర్కొంటున్నారు. పంట చేతికొచ్చే సమయంలో వెలుగుచూసిన ఈ విపత్కర పరిణామాలతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో 1,24,375 హెక్టార్లలో మినుమును సాగు చేస్తున్నారు. గత నెలలో మొదలైన మినుము తీత పనులు దాదాపు చివరిదశకు చేరుకొన్నాయి. వరితో పోల్చితే మిమునుకు కూలీల అవసరం అంతగా లేకపోవటంతో గండం గట్టెక్కింది. ఇప్పటికే కొంతమంది మినుమును విక్రయించగా మరికొందరు తమ ఇళ్లకు పంటను చేర్చారు. ప్రైవేటు మార్కెట్‌లో క్వింటాల్‌కు రూ.7వేల ధర పలుకుతున్నా రవాణా మార్గాలు లేక వ్యాపారులు కొనుగోలు చేయటంలేదు. అన్నదాతలు ఆర్థిక కష్టాలను ఎదుర్కొంటున్నారు.

Related Posts